“అల్లాహుమ్మ బిక అస్బహ్’నా, వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు, వ ఇలైకన్నుషూర్”

“అల్లాహుమ్మ బిక అస్బహ్’నా, వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు, వ ఇలైకన్నుషూర్”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఉదయం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ బిక అస్బహ్’నా, వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు, వ ఇలైకన్నుషూర్” సాయంత్రం అయితే ఆయన (స) ఇలా పలికేవారు: “బిక అమ్’సైనా, వబిక అస్బహ్’నా, వబిక నహ్యా, వబిక నమూతు, వైలైకన్నుషూర్”. అబూహురైరహ్ (ర) ఇంకా ఇలా అన్నారు: “ఒక్కోసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అనేవారు: “...వ ఇలైకల్ మసీర్”. (ఓ అల్లాహ్! నీ ద్వారా మేము ఉదయంలోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; మరియు నీ ద్వారా మేము ఉదయం లోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. (ఒక్కోసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “...అంతిమ గమ్యం కూడా నీ వైపునకే)

[ప్రామాణికమైనది]

الشرح

ఉషోదయపు వెలుగు నుంచి ఉదయములోనికి ప్రవేశించునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: (అల్లాహుమ్మ, బిక అస్బహ్’నా) ఓ అల్లాహ్! నీ ద్వారా మేము ఉదయాన్ని ప్రారంభించినాము, నీ రక్షణను దుస్తులుగా ధరించి, నీ కృపలో మునిగి, నీ నామస్మరణలో నిమగ్నమై, నీ నామం సహాయంతో నీ సహాయాన్ని కోరుతూ, నీవు ప్రసాదించే విజయాన్ని ఆవరింపజేసుకుని, నీవు ప్రసాదించిన బలమూ మరియు శక్తితో కదులుతూ (ఓ అల్లాహ్! మేము నీ ద్వారా ఉదయాన్ని ప్రారంభించినాము). (వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు) దీని అర్థము ‘ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంకాలము లోనికి ప్రవేశించినాము, నీ ద్వారా మేము జీవించి ఉన్నాము, మరియు నీ ద్వారా మేము మరణిస్తాము’. ఇక్కడ కూడా ఇంతకు ముందు పైన చెప్పబడిన భావాలే ప్రస్ఫుటమవుతాయి; అయితే ఈ పదాలు సాయంకాలము పలుకబడతాయి. కనుక ఈ పదాలు పలుకునపుడు దాసుడు “ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంకాలము లోనికి ప్రవేశించినాము; జీవితాన్ని ప్రసాదించేవాడా! నీ నామము ద్వారా మేము జీవిస్తున్నాము; మరియు మరణాన్ని ప్రసాదించేవాడా! నీ నామము ద్వారా మేము మరణిస్తాము. (వ ఇలైకన్నుషూర్) మరియు నీ వైపునకే మా పునరుథ్థానము కూడా. మరణము తరువాత పునరుథ్థానము; సమీకరించబడిన తరువాత (కర్మానుసారం) వేరు చేయబడడం, సర్వకాల సర్వావస్థలలో మా స్థితి ఇదే; నేను ఆయన నుంచి వేరు కాను, మరియు ఆయనను విడిచి పెట్టను. మరియు మధ్యాహ్నము తరువాత సాయంత్రము వచ్చినపుడు (అంటే అస్ర్ తరువాత) ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: (అల్లాహుమ్మ బిక అమ్’సైనా, వబిక అస్బహ్’నా, వబిక నహ్యా, వబిక నమూతు, వఇలైకల్ మసీర్) ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; మరియు నీ ద్వారా మేము ఉదయం లోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు అంతిమ గమ్యం కూడా నీవైపునకే. ఈ లోకం లోనికి రావడం, మరియు పరలోకము లోనికి తిరిగి వెళ్ళడం అంతా నీ ద్వారానే, ఎందుకంటే నీవే నాకు జీవనాన్ని ఇచ్చే వాడవు, మరియు నీవే నాకు మరణాన్ని ఇచ్చేవాడవు.

فوائد الحديث

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని అనుసరిస్తూ ఈ ధ్యానాన్ని (దిక్ర్ లను) ఉదయం మరియు సాయంత్రం పలుకుతూ ఉండడం ‘ముస్తహబ్’ (నొక్కి వక్కాణించబడిన ఆచరణ)

దాసునికి అతని అన్ని పరిస్థితులు మరియు సమయాలలో తన ప్రభువు అవసరం ఉంటుంది.

అల్లాహ్ యొక్క స్మరణలను స్మరించుకునే ఉత్తమ సమయం దినారంభములో, అంటే ఉషోదయం (ఫజ్ర్) సమయం నుండి మొదలుకుని సూర్యుడు ఉదయించడానికి మధ్యన; మరియు అస్ర్ తరువాత నుండి మొదలుకుని సూర్యుడు అస్తమించడానికి ముందు వరకు. ఒకవేళ ఎవరైనా ఆ తరువాత ఈ స్మరణలను పలికినట్లయితే? అంటే ఒకవేళ ఎవరైనా ఉదయం సూర్యుడు ఉదయించిన తరువాత పలికినట్లయితే – అది అతనికి సరిపోతుంది; అలాగే ఎవరైనా జుహ్ర్ తరువాత పలికినట్లయితే – అది అతనికి సరిపోతుంది; ఒకవేళ ఎవరైనా మగ్రిబ్ తరువాత పలికినట్లయితే – అది అతనికి సరిపోతుంది. ఎందుకంటే అవి స్మరణలను పలికే సమయాలే.

ఉదయం పూట "వ ఇలైకన్నుషూర్ - మరియు మా పునరుత్థానం కూడా నీ వైపునకే" అని పలుకుటలో ఔచిత్యమేమిటంటే, ప్రజలు చనిపోయిన తరువాత, వారికి పునరుజ్జీవనం కలిగించే ‘మహా పునరుథ్థాన దినమును’ అది వారికి గుర్తు చేస్తుంది. అది వారి నూతన పునరుజ్జీవనం, ‘అర్వాహ్’ లోనికి ఆత్మలు తిరిగి వచ్చే కొత్త రోజు అది, అందులో ప్రజలు నలువైపులా విస్తరిస్తారు, అల్లాహ్ సృష్టించిన ఆ దినము, ఆదము సంతతిపై ఒక సాక్ష్యము లాగా కొత్తగా ఊపిరి పోసుకుంటుంది. దాని కాలముల యొక్క నిక్షేపస్థానములు మన ఆచరణల భాండాగారాలు.

సాయంకాలము “వ ఇలైకల్ మసీర్” అని స్మరణ చేయుటలో ఔచిత్యము ఏమిటంటే – తమ తమ జీవిక, బతుకు తెరువు కొరకు ఉదయం నలువైపులకు వెళ్ళిపోయి, అలసి సొలసి తమ తమ పనుల నుండి ఇళ్లకు తిరిగి వచ్చి, సేదదీరి విశ్రమిస్తారు. ఇది వారికి సర్వోన్నతుడు, పరమ పవిత్రుడు అయిన అల్లాహ్ వైపునకే తాము తిరిగి వెళ్ళవలసి ఉన్నదనే విషయాన్ని, తమ నిజ గమ్యస్థానము, చిట్టచివరి మజిలీ అదే అనే విషయాన్ని వారికి గుర్తుచేస్తుంది.

التصنيفات

ఉదయం,సాయంత్రం దుఆలు