“బిస్మిల్లాహి అర్’ఖీక, మిన్ కుల్లి షైఇన్ యు’జీక, మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ అవ్ ఐనిన్ హాసిదిన్, అల్లాహు యష్ఫీక, …

“బిస్మిల్లాహి అర్’ఖీక, మిన్ కుల్లి షైఇన్ యు’జీక, మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ అవ్ ఐనిన్ హాసిదిన్, అల్లాహు యష్ఫీక, బిస్మిల్లాహి అర్’ఖీక” (అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను; మీకు హాని కలిగించే ప్రతి దాని నుండి, ప్రతి ఆత్మ యొక్క చెడు నుండి లేదా అసూయపడేవారి కంటి నుండి అల్లాహ్ మిమ్మల్ని స్వస్థపరచుగాక. అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను)”

అబూ సయీద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగినారు: “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు అనారోగ్యం పాలైనారా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును” అని బదులిచ్చినారు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా పలికినారు: “బిస్మిల్లాహి అర్’ఖీక, మిన్ కుల్లి షైఇన్ యు’జీక, మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ అవ్ ఐనిన్ హాసిదిన్, అల్లాహు యష్ఫీక, బిస్మిల్లాహి అర్’ఖీక” (అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను; మీకు హాని కలిగించే ప్రతి దాని నుండి, ప్రతి ఆత్మ యొక్క చెడు నుండి లేదా అసూయపడేవారి కంటి నుండి అల్లాహ్ మిమ్మల్ని స్వస్థపరచుగాక. అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను)”

[ప్రామాణికమైన హదీథు] [ముస్లిం నమోదు చేసినారు:]

الشرح

జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి వారిని ఇలా అడిగినారు: “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ! మీరు అనారోగ్యంతో ఉన్నారా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును” అన్నారు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అస్వస్థతగా ఉన్న వారి కొరకు పఠించే ఒక ప్రార్థన (రుఖయహ్) ను పఠించారు: (బిస్మిల్లాహి) అల్లాహ్ నామమున, ఆయన సహాయాన్ని కోరుతూ, (అర్’ఖీక) మీ కొరకు ఆయన శరణు వేడుకుంటూ మీ కొరకు ఒక ప్రార్థనను – రుఖయహ్ ను – పఠిస్తున్నాను. (మిన్ కుల్లి షైఇన్ యు’జీక) మీకు హాని కలిగించే ప్రతి విషయము నుండి – అది చిన్నది గానీ, పెద్దది గానీ -; (మిన్ షర్రి కుల్లి నఫ్సిన్) ప్రతి చెడు ఆత్మ యొక్క చెడు నుండి; (ఔ ఐని హాసిదిన్) లేదా అసూయపడే వారి కంటి నుండి, అది కలిగించే చెడు నుండి, అల్లాహ్ మిమ్మల్ని (యష్ఫీక) స్వస్థపరుచు గాక, ఆయన మిమ్మల్ని అన్ని వ్యాధుల నుండి రక్షించు గాక, కాడుగాక, (బిస్మిల్లాహి అర్’ఖీక) అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను”. జిబ్రయీల్ (అలైహిస్సలాం) దానిని నొక్కి చెప్పడం కొరకు ఆ పదాలను పునరావృతం చేసినారు. ఆయన ఆ ప్రార్థనను ఆ పదాలతోనే ప్రారంభించినారు మరియు ఆ పదాలతోనే ముగించినారు; నిశ్చయంగా ఆయన (సర్వ స్తోత్రములకు అర్హుడైన అల్లాహ్) తప్ప ప్రయోజనం కలిగించే వారెవరూ లేరు అని సూచిస్తూ.

فوائد الحديث

పరిస్థితి యొక్క వాస్తవికతను తెలియజేయడానికి, ఆవేదనా పూర్వకంగానో, లేక ఫిర్యాదు చేస్తున్నట్లుగానో లేక కోపముతోనో కాకుండా తన అనారోగ్యపు స్థితిని ఇతరులకు తెలియజేయుటకు అనుమతి ఉన్నది.

రుఖయహ్ ఈ క్రింది షరతులతో అనుమతించబడుతుంది: 1. రుఖయహ్ ను ఖుర్ఆన్ మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క స్మరణతో మరియు, దాని సూచించ బడిన ప్రార్థనలతో (దుఆలతో) నిర్వహించాలి; 2. రుఖయహ్ ను అరబీ భాషలో నిర్వహించాలి; లేదా అర్థం తెలిసిన, అర్థం చేసుకోగల ఇతర భాషలలో కూడా నిర్వహించవచ్చును. 3. రుఖయహ్ దానంతట అదే స్వయంగా ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని, అది కేవలం ఒక మధ్యమం మాత్రమేనని మరియు దాని ప్రభావం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అనుమతి ద్వారా మాత్రమే సాధ్యమని విశ్వసించాలి. 4. రుఖయహ్ నిర్వహణలో ఏ విధమైన షిర్క్ (బహుదేవతారాధన), నిషేధించబడిన పద్ధతులు, లేదా ‘బిద్’అత్’ (ధర్మములో నూతన ఆవిష్కరణలు) లేదా వాటికి దారి తీసే ఏ విషయమూ ఉండరాదు.

ఈ హదీథు ‘దిష్టి’ తగలడం వల్ల కలిగే హానిని మరియు అది వాస్తవమని ధృవీకరిస్తున్నది, కనుక దాని నుండి రుఖయహ్ ద్వారా స్వస్థత పొందుట అనుమతించబడినది.

హదీథులో పేర్కొనబడిన విధంగా రుఖయహ్ ను నిర్వహించుట అభిలషణీయము.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవమాతృడే, ఇతరులు అనారోగ్యానికి గురి అయినట్లే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అనారోగ్యానికి గురి అయినారు.

అల్లాహ్ తన ప్రవక్తలను, సందేశహరులను రక్షిస్తాడు, అందుకు ఆయన తన దూతలను (దైవదూతలను) ఈ పని కొరకు నియోగిస్తాడు

التصنيفات

షరఈ రుఖయ్య