తల వెంట్రుకలకు సవరాన్ని జోడించి, వెంట్రుకలను పొడిగించే స్త్రీని మరియు సవరం కొరకు అడిగే స్త్రీని, పచ్చబొట్లు…

తల వెంట్రుకలకు సవరాన్ని జోడించి, వెంట్రుకలను పొడిగించే స్త్రీని మరియు సవరం కొరకు అడిగే స్త్రీని, పచ్చబొట్లు వేసే స్త్రీని మరియు పహ్చబొట్టు వేయమని అడిగే స్త్రీని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారు.”

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా ఉల్లేఖించినారు: తల వెంట్రుకలకు సవరాన్ని జోడించి, వెంట్రుకలను పొడిగించే స్త్రీని మరియు సవరం కొరకు అడిగే స్త్రీని, పచ్చబొట్లు వేసే స్త్రీని మరియు పహ్చబొట్టు వేయమని అడిగే స్త్రీని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాలుగు వర్గాల ప్రజలను శపించారు, బహిష్కరించారు మరియు అల్లాహ్ కారుణ్యము నుండి వారిని దూరం చేసినారు: ఒకటి: తన తల వెంట్రుకలకు లేదా వేరే స్త్రీల తల వెంట్రుకలకు సవరాన్ని జోడించే స్త్రీని రెండు: తన జుత్తుకు సవరాన్ని జోడించమని వేరే స్త్రీని కోరే స్త్రీ. మూడు: పచ్చబొట్టు పొడిచే స్త్రీ; ఆమె ముఖము, చేయి లేదా ఛాతీ వంటి శరీరంలోని ఒక భాగంలో, సౌందర్యం పొందడానికి చేసే ప్రక్రియలో భాగంగా, సూదిని గ్రుచ్చి, ఆ భాగాలు నీలి రంగులోనికో లేక ఆకుపచ్చ రంగులోనికో మారేటంత వరకు, సూదితో కాటుక పొడి (సుర్మా, కొహ్ల్) వంటి పచ్చబొట్టు పొడిచేందుకు ఉపయోగించే పదార్థాలను చొప్పిస్తుంది. అటువంటి స్త్రీ కూడా శపించబడింది. నాలుగు: తనకు పచ్చబొట్టు పొడవమని అడిగి పచ్చబొట్టు పొడిపించుకునే స్త్రీ. ఈ ఆచరణలు “కబాయిర్” ఆచరణలు (పాపములలో ఘోరమైన పాపములు) గా పరిగణించబడతాయి.

فوائد الحديث

ఇమాం ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “నిషేధించబడిన విషయం ఏమిటంటే, సహజంగా (జన్మతహ) ఉన్న తలవెంట్రుకలకు సవరం రూపంలో బయటి నుండి వెంట్రుకలను జోడించడం (వెంట్రుకలకు వెంట్రుకలను జోడించడం). అలాకాక ఆమె తన వెంట్రుకలను వెంట్రుకలతో కాకుండా వేరే దేనితోనైనా, అంటే వస్త్రం ముక్క, హెయిర్’బాండ్ లేదా ఇలాంటి వాటితో అటాచ్ చేస్తే, అది నిషేధం కిందకు రాదు.

పాపపు పనిలో సహకరించడం కూడా నిషేధమే.

అల్లాహ్ సృష్టిని మార్చడం నిషేధం, ఎందుకంటే అది అల్లాహ్ యొక్క సృష్ఠిని అబధ్ధీకరించడం మరియు మోసం చేయడం అవుతుంది.

అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు శపించిన వారిని సాధారణంగా ఇతరులు కూడా శపించవచ్చు అనడానికి ఇందులో ఆధారం ఉన్నది.

మన కాలంలో నిషేధించబడిన పొడిగింపులలో విగ్ ధరించడం కూడా ఉంది, ఇది నిషేధించబడింది ఎందుకంటే ఇది అవిశ్వాసులను అనుకరించడం, మోసం మరియు వంచన కలిగి ఉంటుంది.

ఖత్తాబి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ విషయాల గురించి తీవ్రమైన హెచ్చరిక ప్రస్తావించబడింది. ఎందుకంటే వాటిలో మోసం మరియు కపటం ఉన్నాయి. వాటిలో దేనినైనా అనుమతిస్తే, అది ఇతర రకాల మోసాలను అనుమతించడానికి దారితీస్తుంది. అదనంగా, ఇబ్న్ మసూద్ (రదియల్లాహు అన్హు) హదీసులో సూచించినట్లుగా, సహజ సృష్టిని మార్చడం కూడా ఇందులో ఉంటుంది, అక్కడ ఇబ్న్ మస్’ఊద్ రదిఉల్లాహ్ ఇలా అన్నారు: "అల్లాహ్ సృష్టిని మార్చేవారు..." వల్లాహు ఆ’లము (అల్లాహ్‌కు మాత్రమే బాగా తెలుసు).

ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "ఇది (పచ్చబొట్టు) పొడిచేవారికి మరియు ఎవరికి పొడవబడుతుందో వారికి ఇద్దరికీ నిషేధించబడింది. ఎక్కడైతే పచ్చబొట్టు వేయబడిందో ఆ ప్రదేశం అపవిత్రమవుతుంది. వైద్యపరంగా దాన్ని తొలగించడం సాధ్యమైతే, దానిని తొలగించుకోవడం అతనిపై విధి అవుతుంది. అయితే ఆ భాగములో కోత ద్వారా మాత్రమే సాధ్యమైతే – ఆ భాగము లేక అవయవానికి హాని కలుగుతుందని, లేక దాని పనితీరు దెబ్బతింటుంది అనే భయం లేక శరీరంలో ఆ భాగానికి ప్రస్ఫుటంగా తీవ్ర నష్టం కలుగుతుంది అనే భయం గానీ ఉంటే అటువంటి పరిస్థితులలో ఆ పచ్చబొట్టును తొలగించడం తప్పనిసరికాదు. పచ్చబొట్టు పొడిపించుకున్న వ్యక్తి మనస్ఫూర్తిగా పాశ్చాత్తాపపడితే అతనిపై ఎటువంటి పాపము లేదు. ఆ వ్యక్తికి పైన పేర్కొన్నవాటిలో ఏ ఒక్క భయము కూడా లేనట్లైతే ఆ పచ్చబొట్టును తొలగించవలసిన బాధ్యత అతనిపై ఉంటుంది. దానిని తొలగించడం అతడు ఆలస్యం చేస్తున్నట్లైతే అతడు పాపకార్యానికి పాల్బడుతున్నాడన్నమాట.

التصنيفات

వస్త్రాధరణ మరియు అలంకరణ