“మీలో ఎవరైనా ఒకవేళ తింటే కుడి చేతితోనే తినండి, త్రాగితే కుడి చేతితోనే త్రాగండి, ఎందుకంటే నిశ్చయంగా షైతాను ఎడమ…

“మీలో ఎవరైనా ఒకవేళ తింటే కుడి చేతితోనే తినండి, త్రాగితే కుడి చేతితోనే త్రాగండి, ఎందుకంటే నిశ్చయంగా షైతాను ఎడమ చేతితో తింటాడు మరియు ఎడమ చేతితో త్రాగుతాడు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “మీలో ఎవరైనా ఒకవేళ తింటే కుడి చేతితోనే తినండి, త్రాగితే కుడి చేతితోనే త్రాగండి, ఎందుకంటే నిశ్చయంగా షైతాను ఎడమ చేతితో తింటాడు మరియు ఎడమ చేతితో త్రాగుతాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం కుడి చేతితోనే తినాలని, మరియు కుడి చేతితోనే త్రాగాలని ఆదేశిస్తున్నారు. మరియు ఎడమ చేతితో తినుటను, త్రాగుటను నిషేధిస్తున్నారు. ఎందుకంటే షైతాను అలా (ఎడమ చేతితో) తింటాడు మరియు త్రాగుతాడు కనుక.

فوائد الحديث

ఎడమ చేతితో తినుట మరియు త్రాగుట షైతాన్’ను అనుకరించినట్లు అవుతుంది, కనుక అది నిషేధించబడినది.

التصنيفات

తినే మరియు త్రాగే పద్దతులు