إعدادات العرض
“మూడు రకాల వ్యక్తులతో అల్లాహ్ పునరుత్థాన దినమున మాట్లాడడు, వారిని శుద్ధి చేయడు, మరియు వారికి బాధాకరమైన శిక్ష…
“మూడు రకాల వ్యక్తులతో అల్లాహ్ పునరుత్థాన దినమున మాట్లాడడు, వారిని శుద్ధి చేయడు, మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది
సల్మాన్ అల్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మూడు రకాల వ్యక్తులతో అల్లాహ్ పునరుత్థాన దినమున మాట్లాడడు, వారిని శుద్ధి చేయడు, మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది: వృద్ధుడైన వ్యక్తి వ్యభిచారానికి పాల్బడినట్లైతే, పేదవాడైన వ్యక్తి అహంకారిగా ఉంటే, మరియు ఆ వ్యక్తి, ఎవరికైతే అల్లాహ్ వర్తక సామాగ్రిని ఇచ్చినాడో – అతడు కొన్నా ‘అల్లాహ్ మీద ఒట్టు’ అని, అమ్మినా ‘అల్లాహ్ మీద ఒట్టు’ అని వర్తకం చేస్తాడు.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Indonesia Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Kurdî Русский Tiếng Việt Magyar ქართული Kiswahili සිංහල Română অসমীয়া ไทย Português मराठी دری አማርኛ ភាសាខ្មែរ Nederlands Македонски ગુજરાતી Tagalog ਪੰਜਾਬੀ മലയാളം ಕನ್ನಡالشرح
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో మూడు రకాల వ్యక్తులను గురించి తెలియజేసినారు: వారు పశ్చాత్తాప పడకపోయినా లేక క్షమించబడక పోయినా పునరుత్థాన దినమున అల్లాహ్ యొక్క మూడు శిక్షలకు పాత్రులవుతారు. మొదటిది: అల్లాహ్ తన తీవ్రమైన కోపం కారణంగా పునరుత్థాన దినాన వారితో మాట్లాడడు. పైగా ఆయన వారి నుండి దూరంగా ఉంటాడు లేదా ఆయన వారితో వారికి నచ్చని విధంగా మాట్లాడి వారి పట్ల తనకున్న అసంతృప్తిని సూచిస్తాడు. రెండవది: ఆయన వారిని స్తుతించడు, పొగడడు, మరియు వారి పాపాలను కడిగివేయడు. మూడవది: వారు పరలోకంలో కఠినమైన మరియు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు. ఆ మూడు రకాల వ్యక్తులు వీరే: మొదటి రకం: వ్యభిచారానికి పాల్బడిన వృద్ధుడు. రెండవది: సంపద లేకపోయినా ప్రజల పట్ల అహంకారంతో ఉండే పేదవాడు. మూడవది: కొనేటప్పుడు మరియు అమ్మేటప్పుడు తరచుగా అల్లాహ్ పై ప్రమాణం చేసేవాడు (అల్లాహ్ మీద ఒట్టు అనుట), తద్వారా అల్లాహ్ పేరును దిగజార్చేవాడు, కించపరిచేవాడు మరియు దానిని ధనం సంపాదించడానికి ఒక మాధ్యమంగా ఉపయోగించేవాడు.فوائد الحديث
అల్ ఖాదీ ఇయాద్ (రహిమహుల్లాహ్) ఈ హదీథులో పేర్కొనబడిన కఠినమైన శిక్షకు గల కారణాన్ని ఇలా వివరించారు: “ప్రతి ఒక్కరూ పైన పేర్కొన్న పాపాన్ని చేసారు, వాస్తవానికి ఆ పాపం వారికి దూరంగా ఉన్నప్పటికీ మరియు దానిని చేయవలసిన అవసరం లేనప్పటికీ మరియు బలహీనమైన ప్రేరేపణల కారణంగా దానికి పాల్బడినారు. పాపం చేసినందుకు ఎవరూ క్షమించబడనప్పటికీ, ఆ పాపానికి పాల్బడవలసిన అత్యంత అవసరం గానీ లేక వారు అలవాటుగా చేసేవారు కాకపోయినప్పటికీ, వారు ఆ చర్యలలో మునిగిపోవడం అనేది – వారు అల్లాహ్ హక్కులను ధిక్కరించడం, నిర్లక్ష్యం చేయడం మరియు ఎటువంటి బలమైన కారణం లేకుండా ఉద్దేశ్యపూర్వకంగా అవిధేయతకు పాల్బడడం అవుతుంది.
వ్యభిచారము, అసత్యము పలుకుట మరియు అహంకారము – ఇవి కబాయిర్’ల లోనివి (ఘోరమైన పాపాలలోనివి).
అల్ కిబ్ర్ (అహంకారం): అంటే హక్కులను తిరస్కరించడం మరియు ప్రజలను తృణీకరించడం.
ఈ హదీథులో, కొనుగోలు మరియు అమ్మకాలలో తరచుగా అల్లాహ్ పై ప్రమాణం చేయకూడదనే హెచ్చరిక ఉన్నది మరియు ప్రమాణాలను గౌరవించాలని మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క నామములను గౌరవించాలని ఒక ఉద్బోధ ఉంది. దివ్యఖుర్’ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు: [మరియు అల్లాహ్’ను మీ ప్రమాణాలకు పాత్రగా చేసుకోకండి.] (సూరతుల్ బఖరహ్: 2:224)
التصنيفات
పాపకార్యముల ఖండన