ఎవరైతే నిర్లక్ష్యం కారణంగా మూడు శుక్రవారాలను వదిలివేస్తారో, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర (సీలు) వేస్తాడు

ఎవరైతే నిర్లక్ష్యం కారణంగా మూడు శుక్రవారాలను వదిలివేస్తారో, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర (సీలు) వేస్తాడు

అబీ అల్ జ’ది అద్’దారిమీ (రదియల్లాహు అన్హు) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సాహచర్యములో గడిపినారు. ఆయన ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "ఎవరైతే నిర్లక్ష్యం కారణంగా మూడు శుక్రవారాలను వదిలివేస్తారో, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర (సీలు) వేస్తాడు"

[దృఢమైనది]

الشرح

శుక్రవారం ప్రార్థనను వదిలివేయవద్దని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దానికి వ్యతిరేకంగా హెచ్చరించినారు; సరైన కారణం లేకుండా సోమరితనం మరియు నిర్లక్ష్యం కారణంగా మూడు సార్లు శుక్రవారం నమాజును వదిలివేస్తే, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర (సీలు) వేస్తాడు, దానిని మూసివేస్తాడు మరియు మంచి చేరకుండా అడ్డుకుంటాడు.

فوائد الحديث

శుక్రవారపు నమాజు ప్రతి వ్యక్తిపై వ్యక్తిగతంగా విధిగా ఆచరించవలసిన ఆరాధన అనే విషయంపై ఉమ్మత్ యొక్క ఏకాభిప్రాయము (ఇజ్మా) ఉన్నది అని నమోదు చేస్తున్నారు.

సోమరితనం మరియు నిర్లక్ష్యం కారణంగా శుక్రవారం నమాజును నిర్లక్ష్యం చేసే వారి కొరకు హెచ్చరిక ఏమిటంటే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర (సీలు) వేస్తాడు.

సరియైన కారణం ఉండి ఎవరైనా శుక్రవారపు నమాజును ఆచరించలేక పోయినట్లైతే అటువంటి వారు ఈ ప్రమాదములో లేరు.

ఇమాం అష్-షౌకానీ ఇలా అన్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రకటన, మూడు శుక్రవారాలు గురించి, అంటే ఏ రూపంలోనైనా శుక్రవారం ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం, వరుసగా మూడు శుక్రవారాలు కావచ్చు లేదా అడపాదడపా మూడు శుక్రవారాలు కావచ్చు. ఉదాహరణకు ప్రతి సంవత్సరం ఒక శుక్రవారం దాటవేసినప్పటికీ, మూడవ సంవత్సరం శుక్రవారం తర్వాత, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతని హృదయానికి ముద్ర వేస్తాడు, హదీసు యొక్క స్పష్టమైన భావార్థం ద్వారా ఇది సూచించబడుతున్నది. అలాగే ఇది వరుసగా మూడు శుక్రవారాలను కోల్పొవడాన్ని కూడా సూచిస్తున్నది.