“ఏ ముస్లిమునకైనా ఏదైనా ఆపద సంభవిస్తే అతడు అల్లాహ్ ఆదేశించిన విధంగా: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్…

“ఏ ముస్లిమునకైనా ఏదైనా ఆపద సంభవిస్తే అతడు అల్లాహ్ ఆదేశించిన విధంగా: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ (సూరతుల్ బఖరా 2:156) అల్లాహుమ్మ’జుర్నీ ఫీ ముసీబతీ, వ అఖ్లిఫ్’లీ ఖైరమ్మిన్’హా” {నిశ్చయంగా మేము అల్లాహ్’కు చెందినవారము, మరియు నిశ్చయంగా ఆయన వైపునకే మరలి వెళ్ళువారము; ఓ అల్లాహ్, నా ఈ ఆపదలో నాకు ప్రతిఫలం ప్రసాదించు, మరియు (నేను నష్టపోయిన) దాని స్థానంలో నాకు అంతకంటే మంచిదానిని ప్రసాదించు} అని పలికినట్లైతే, అల్లాహ్ అతనికి దాని స్థానంలో మెరుగైనది ఇస్తాడు తప్ప మరేమీ కాదు.”

ఉమ్మె సలమహ్, ఉమ్ముల్ మూ’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తి), (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “ఏ ముస్లిమునకైనా ఏదైనా ఆపద సంభవిస్తే అతడు అల్లాహ్ ఆదేశించిన విధంగా: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ (సూరతుల్ బఖరా 2:156) అల్లాహుమ్మ’జుర్నీ ఫీ ముసీబతీ, వ అఖ్లిఫ్’లీ ఖైరమ్మిన్’హా” {నిశ్చయంగా మేము అల్లాహ్’కు చెందినవారము, మరియు నిశ్చయంగా ఆయన వైపునకే మరలి వెళ్ళువారము; ఓ అల్లాహ్, నా ఈ ఆపదలో నాకు ప్రతిఫలం ప్రసాదించు, మరియు (నేను నష్టపోయిన) దాని స్థానంలో నాకు అంతకంటే మంచిదానిని ప్రసాదించు} అని పలికినట్లైతే, అల్లాహ్ అతనికి దాని స్థానంలో మెరుగైనది ఇస్తాడు తప్ప మరేమీ కాదు.” ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ (రదియల్లాహు అన్హా) ఇంకా ఇలా అన్నారు: “(నా భర్త) అబూ సలమహ్ చనిపోయినపుడు “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు వలస వెళ్ళిన ప్రాంతానికి మొట్టమొదట తన కుటుంబంతో సహా వలస వెళ్ళిన వారు అబూ సలమహ్; ఆయనకంటే ఉత్తములు ఎవరుంటారు?” అనుకుని ఈ దుఆ పఠించాను. ఆయన స్థానములో అల్లాహ్ నాకు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రసాదించినాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ (రదియల్లాహు అన్హా), రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా విన్నాను అని అన్నారు: ఏదైనా ఆపద లేక కీడు వచ్చిపడిన ఎవరైనా ముస్లిం, అల్లాహ్ సిఫార్సు చేసిన విధంగా ఇలా అంటాడో: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ (సూరతుల్ బఖరా 2:156 - నిశ్చయంగా మేము అల్లాహ్’కు చెందినవారము, మరియు నిశ్చయంగా ఆయన వైపునకే మరలి వెళ్ళువారము); (అల్లాహుమ్మ’జుర్నీ ఫీ ముసీబతీ) ఓ అల్లాహ్! నా ఈ ఆపదలో నాకు ప్రతిఫలం ప్రసాదించు, నేను సహనం వహించినందుకు గాను; మరియు నాకు కలిగిన ఈ నష్టాన్ని (వ అఖ్’లిఫ్ లీ) పూరించు, (ఖైరమ్’మిన్హా) దాని స్థానములో దానికంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించడం ద్వారా. (ఎవరైతే ఇలా వేడుకుంటారో) అల్లాహ్ అతనికి దానికంటే ఉత్తమమైనది ప్రసాదిస్తాడు తప్ప మరేమీ కాదు. ఆమె ఇంకా ఇలా అన్నారు: “(నా భర్త) అబూ సలమహ్ చనిపోయినపుడు “అబూ సలమహ్ కంటే ఉత్తముడు ఎవరుంటారు; ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వలస వెళ్ళిన దగ్గరికి, అబూ సలమహ్ తన కుటుంబముతో సహా వలస వెళ్ళినవాడు – అనుకున్నాను. కానీ అల్లాహ్ సహాయంతో నేను ఆ పలుకులు పలికినాను. అబూ సలమహ్ స్థానములో అల్లాహ్ నాకు అతనికంటే ఉత్తముడైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రసాదించినాడు.”

فوائد الحديث

ఇందులో ఆపదల లేక కీడు వచ్చి పడిన సమయాలలో సహనం వహించాలని, నిరాశ నిస్పృహలకు లోను కారాదనే ఆదేశం ఉన్నది.

ఆపద, దుఃఖము మరియు విపత్తులు కలిగినపుడు అల్లాహ్’ను వేడుకోవాలి, దుఆ చేయాలి – ఎందుకంటే కేవలం ఆయన మాత్రమే నష్ఠాన్ని పూరించగలవాడు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఆదేశపాలన చేయడం అత్యంత అవసరం; వారి ఆదేశాల వెనుక ఉన్న ఉద్దేశ్యము మన వివేకానికి అందినా అందకపోయినా.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అనుసరించడములో, మరియు వారి ఆదేశపాలన చేయడములోనే విశ్వాసి యొక్క మంచి అంతా ఉన్నది.

التصنيفات

ఆలె బైత్ యొక్క ఘనత, హృదయాల ఆచరణలు