"కిందటి దుస్తులలో ఏదైతే కాలి చీలమండలముల కంటే దిగువగా ఉంటుందో అది నరకాగ్నిలో ఉంటుంది (నరకశిక్షకు గురవుతాడు)"

"కిందటి దుస్తులలో ఏదైతే కాలి చీలమండలముల కంటే దిగువగా ఉంటుందో అది నరకాగ్నిలో ఉంటుంది (నరకశిక్షకు గురవుతాడు)"

అబూ హురరైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "కిందటి దుస్తులలో ఏదైతే కాలి చీలమండలముల కంటే దిగువగా ఉంటుందో అది నరకాగ్నిలో ఉంటుంది (నరకశిక్షకు గురవుతాడు)"

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను ఇలా హెచ్చరించారు — ఒకరు ధరించే క్రింది దుస్తులు అంటే ప్యాంటు, లుంగీ లేదా క్రింది దేహాన్ని కప్పే ఇతర వస్త్రాలు, వారి కాలిచీలమండలము కంటే దిగువగా వేలాడకూడదు. ఎవరైనా తమ క్రింది దుస్తులను కాలిచీలమండలము కంటే దిగువగా వేసుకుంటే, ఆ భాగం నరకాగ్నిలో పడుతుంది. ఇది అతడు చేసిన పనికి శిక్ష.

فوائد الحديث

పురుషులు తమ క్రింది దుస్తులను కాలిచీలమండలము కంటే దిగువగా వేసుకోవడం ఇస్లాంలో నిషిద్ధం, ఇది పెద్ద పాపాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైనా తన ఇజార్ (క్రింది దుస్తులు)ను సముచితమైన కారణాల వలన మాత్రమే కాలి చీలమండలము కంటే దిగువగా వేసుకోవడం అనుమతించబడుతుంది. ఉదాహరణకు, ఎవరికైనా కాలిచీల మండలము వద్ద లేదా దాని క్రింద గాయముంటే, ఆ గాయాన్ని దోమలు లేదా ఈగలు బాధించకుండా కప్పుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, అతనికి మరో ప్రత్యామ్నాయం లేకపోతే, అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.

ఈ నియమం పురుషులకు మాత్రమే వర్తిస్తుంది, ఎందుకంటే మహిళలు తమ దుస్తులను కాలిమడమలకు దిగువగా, ముంజేయి పొడువంత వరకు పొడిగించమని ఆజ్ఞాపించబడింది.

التصنيفات

వస్త్రాధరణ మరియు అలంకరణ