إعدادات العرض
“నిశ్చయంగా, స్వర్గంలో ఒక బజారు ఉంది. వారు (విశ్వాసులు) ప్రతి శుక్రవారం ఆ బజారుకు వస్తారు
“నిశ్చయంగా, స్వర్గంలో ఒక బజారు ఉంది. వారు (విశ్వాసులు) ప్రతి శుక్రవారం ఆ బజారుకు వస్తారు
అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “నిశ్చయంగా, స్వర్గంలో ఒక బజారు ఉంది. వారు (విశ్వాసులు) ప్రతి శుక్రవారం ఆ బజారుకు వస్తారు. అపుడు ఉత్తరం వైపు నుండి గాలి వీస్తూ మందమారుతాన్ని, వారి ముఖాల మీద, బట్టల మీద చల్లుతూ, వారి మనోహరతను, సౌందర్యాన్ని పెంచుతుంది. ఆ తరువాత వారు తమ కుటుంబాల వద్దకు పెరిగిన ఆకర్షణతో, శోభతో మరింత సౌందర్యవంతులుగా తిరిగి వస్తారు. వారి కుటుంబ సభ్యులు ఆరితో ఇలా అంటారు: అల్లాహ్ సాక్షి, మా తర్వాత మీరు ఆకర్షణను మరియు సౌందర్యాన్ని పెంచుకున్నారు. అల్లాహ్ సాక్షి, మా తరువాత మీరు సౌందర్యములోను, శోభ మరియు ఆకర్షణలోనూ నిశ్చయంగా అభివృద్ధి చెందారు."
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt සිංහල Kurdî Nederlands Kiswahili অসমীয়া ગુજરાતી Magyar ქართული Hausa Română ไทย Português मराठी ភាសាខ្មែរ دری አማርኛ Македонски Українська ਪੰਜਾਬੀ മലയാളം Moore پښتو ಕನ್ನಡالشرح
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: స్వర్గంలో వారికి (విశ్వాసులకు) ఒక బజారు ఉంది, అక్కడ వారు కలుసుకుంటారు, అక్కడ కొనుగోలు లేదా అమ్మకం ఉండదు, మరియు వారు తాము కోరుకున్నదానిని తీసుకుంటారు. వారందరూ ప్రతి ఏడు రోజులకోసారి అక్కడకు వస్తారు. ఉత్తరం వైపునుండి గాలి వీస్తూ వారి ముఖాలను, దుస్తులను కదిలిస్తుంది. వారి సౌందర్యం, అందం పెరుగుతాయి. వారు తమ అందం మరియు సౌందర్యం పెరిగిన స్థితిలో తమ కుటుంబాలకు తిరిగి వస్తారు, వారి కుటుంబాలు వారితో ఇలా అంటాయి: అల్లాహ్ సాక్షి, మేము వెళ్ళిన తర్వాత మీ అందం మరియు సౌందర్యం మరింత పెరిగింది. వారు (మరలా) ఇలా అంటారు: అల్లాహ్ సాక్షి, మేము వెళ్ళిన తర్వాత మీ అందం మరియు సౌందర్యం మరింత పెరిగింది.فوائد الحديث
ఈ హదీథులో స్వర్గవాసులు తమ అందాన్ని మరియు సౌందర్యాన్ని పెంచుకుంటూ, అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు అనే ప్రకటన ఉన్నది.
ఈ హదీసులు ప్రజలను మంచి పనులు చేయమని ప్రోత్సహిస్తాయి, అలా చేస్తూ ఉన్నట్లైతే అది వారిని స్వర్గములో ఈ నివాసానికి దారి తీస్తుంది.
ఈ హదీథులో ఉత్తర గాలి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది; ఎందుకంటే ఇది అరబ్బులలో అత్యుత్తమమైన గాలిగా పరిగణించబడుతుంది, అది మంచిని మరియు వర్షాన్ని తీసుకువస్తుంది.
పరలోక జీవితములో స్వర్గాన్ని, మరియు దాని సుఖాలను, ఆనందాన్ని ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోవాలని ఈ హదీథులో ప్రోత్సాహము ఉన్నది.
التصنيفات
స్వర్గము,నరకము యొక్క లక్షణాలు