“బద్ర్ (యుధ్ధం) మరియు హుదైబియహ్ (ఒప్పందము) లలో ఎవరైతే పాల్గొన్నాడో అతడు ఎన్నడూ నరకాగ్ని లోనికి ప్రవేశించడు.”

“బద్ర్ (యుధ్ధం) మరియు హుదైబియహ్ (ఒప్పందము) లలో ఎవరైతే పాల్గొన్నాడో అతడు ఎన్నడూ నరకాగ్ని లోనికి ప్రవేశించడు.”

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “బద్ర్ (యుధ్ధం) మరియు హుదైబియహ్ (ఒప్పందము) లలో ఎవరైతే పాల్గొన్నాడో అతడు ఎన్నడూ నరకాగ్ని లోనికి ప్రవేశించడు.”

[దృఢమైనది] [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: హిజ్రీ రెండవ సంవత్సరంలో జరిగిన బదర్ యుద్ధంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలిసి పోరాడిన లేదా హిజ్రీ ఆరవ సంవత్సరంలో రిద్వాన్ ప్రతిజ్ఞతో కూడిన హుదైబియా ఒప్పందంలో పాల్గొన్న ఎవరైనా నరకంలో ప్రవేశించరని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రకటించారు.

فوائد الحديث

ఈ హదీథు బద్ర్ యుధ్ధములో మరియు హుదైబియహ్ ఒప్పందములో పాల్గొన్న వారి ఘనతను మరియు ఆ కారణంగా వారు ఎన్నటికీ నరకాగ్నిలోనికి ప్రవేశించరు అని తెలియజేస్తున్నది.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారిని ఎటువంటి అన్యాయానికి పాల్బడకుండా రక్షిస్తాడని, విశ్వాసంతో మరణించే సామర్థ్యాన్ని, అవకాశాన్ని ప్రసాదిస్తాడని మరియు వారికి ముందస్తు నరక శిక్ష లేకుండా స్వర్గంలోకి ప్రవేశపెడతాడని ఈ హదీథు వివరిస్తున్నది. ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహం, ఆయన తాను కోరుకునే వారికి దానిని ప్రసాదిస్తాడు; నిశ్చయంగా అల్లాహ్ గొప్ప అనుగ్రహానికి యజమాని.

التصنيفات

ప్రవక్త అనుచరుల ఘనత రజిఅల్లాహు అన్హుమ్, ప్రవక్త అనుచరుల స్థానాలు రజిఅల్లాహు అన్హుమ్, ప్రవక్త అనుచరుల రజిఅల్లాహు అన్హుమ్ ప్రాముఖ్యతలు