ప్రవక్త అనుచరుల ఘనత రజిఅల్లాహు అన్హుమ్

ప్రవక్త అనుచరుల ఘనత రజిఅల్లాహు అన్హుమ్

1- నేను మీకు అల్లాహ్ పట్ల భయభక్తులను కలిగి ఉండమని, మరియు ఒక బానిస మీపై నాయకుడిగా నియమించబడినప్పటికీ, అతడి మాట వినమని మరియు విధేయత చూపమని ఉపదేశిస్తున్నాను. నిశ్చయంగా, నా తర్వాత మీలో ఎవరైతే జీవిస్తారో, వారు అనేక విభేదాలను చూస్తారు. కాబట్టి, నా సంప్రదాయాన్ని (సున్నత్) మరియు సన్మార్గం పొందిన, సరైన మార్గంలో నడిచిన ఖలీఫాల సంప్రదాయాన్ని మీరు తప్పనిసరిగా అనుసరించండి

2- నేను మీలో నుండి ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకున్నాను అనే విషయం నుండి నన్ను నేను అల్లాహ్ ముందు విముక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగానైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను తన ఆప్తమిత్రునిగా (ఖలీల్ గా) తీసుకున్నాడో, నన్ను కూడా అల్లాహ్ తన ఆప్తమిత్రునిగా తీసుకున్నాడు

3- అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా తరువాత మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. కనుక నా సున్నత్’ను మరియు సన్మార్గగాములైన ఖలీఫాల (ఖులాఫా అర్రాషిదీన్ అల్ మహిదియ్యీన్ ల) సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండండి

4- “అన్సారులను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అన్సారులను విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కపట విశ్వాసి తప్ప వారిని ఎవరూ ద్వేషించరు. వారిని (అన్సారులను) ఎవరైతే ప్రేమిస్తారో, అల్లాహ్ అతడిని ప్రేమిస్తాడు, మరియు ఎవరైతే వారిని ద్వేషిస్తాడో అల్లాహ్ అతడిని ద్వేషిస్తాడు.”