అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా…

అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా తరువాత మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. కనుక నా సున్నత్’ను మరియు సన్మార్గగాములైన ఖలీఫాల (ఖులాఫా అర్రాషిదీన్ అల్ మహిదియ్యీన్ ల) సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండండి

అల్ ఇర్బాజ్ ఇబ్న్ సారియహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక రోజు మా మధ్యన (కూర్చుని) ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడినారు. నిలబడి హితబోధ చేసినారు. ఆ హితబోధ మా హృదయాలను భయంతో కంపించేలా చేసింది, మా కళ్ళనుండి కన్నీళ్ళు వచ్చేలా చేసింది. మాలో ఒకరు ఇలా అన్నారు: “మీరు చేసిన హితబోధ, శాశ్వతంగా విడిచి వెళ్ళబోతున్న వారు చేసిన హితబోధలా ఉన్నది. మా కొరకు ఏదైనా ప్రమాణాన్ని ఉపదేశించండి”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా తరువాత మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. కనుక నా సున్నత్’ను మరియు సన్మార్గగాములైన ఖలీఫాల (ఖులాఫా అర్రాషిదీన్ అల్ మహిదియ్యీన్ ల) సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండండి; మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకుని ఉండండి. (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే.”

[దృఢమైనది]

الشرح

ఈ హదీథు ద్వారా తెలుస్తున్న విషయము: తన సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దినము హితబోధ చేసినారు. ఆ హితబోధ అక్కడ ఉన్న వారి హృదయాలను కంపింపజేసింది, వారి కళ్ళలో కన్నీళ్ళు వచ్చేలా చేసింది. ఆ హితబోధలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన విషయాల గాంభీర్యం, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించిన తీరు చూసి వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ ఇది (మీరు చేసిన హితబోధ) శాశ్వతంగా వీడిపోతున్న వారు చేసిన హితబోధలా ఉన్నది”. కనుక తమ కొరకు ఏదైనా ప్రమాణాన్ని, ఆయన తరువాత దానికి కట్టుబడి ఉండేలా ఆదేశించమని కోరినారు. దానికి ఆయన ఇలా అన్నారు: “మీకోరకు ఇది నా హితబోధ (వసియ్యహ్); అల్లాహ్ వీధి చేసిన విషయాలను ఆచరిస్తూ, ఆయన నిషేధించిన విషయాలకు దూరంగా ఉంటూ, అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి.” మాట వినుట మరియు అనుసరించుట: అంటే అమీరుల (పాలకుల) మాట వినుట మరియు వారిని అనుసరించుట అని అర్థము. బానిస అయినా సరే పాలకునిగా నియమించబడినా, లేక వారి విషయాల నియంత్రణ కొరకు నియమించబడినా అతని మాట వినాలి, అతడిని అనుసరించాలి. అంటే మరో మాటలో సృష్టి మొత్తములో అందరి కంటే అధమ స్థాయికి చెందిన వాడు అయినా సరే పాలకునిగా నియమించబడితే దానిని వ్యతిరేకించకండి, అతడిని అనుసరించండి. వ్యతిరేకత వివాదాలను, కలహాలను రేకిత్తిస్తుంది, రెచ్చగొడుతుంది. ఎందుకంటే (నా తరువాత) మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తీవ్రమైన విబేధాలనుండి ఎలా బయటపడాలో వివరించారు – అది తన సున్నత్ ను మరియు తన తరువాత (షరియత్ మార్గదర్శనములో) సన్మార్గ గాములైన ఖలీఫాల సున్నత్ ను; అంటే అబూ బకర్ అస్సిద్దీఖ్, ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్, ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ మరియు అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ ల సున్నత్ ను అంటి పెట్టుకుని ఉండాలని, దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోవాలని అన్నారు. దీని అర్థం సున్నత్‌కు కట్టుబడి ఉండటం మరియు దానిని అనుసరించడం. ఈ పదాలు ఆ విషయం యొక్క ప్రాముఖ్యత మరియు దాని తీవ్రతను సూచిస్తున్నాయి. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మములో కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి అని; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే అని హెచ్చరించినారు.

فوائد الحديث

ఇందులో సున్నత్ ను అంటిపెట్టుకుని ఉండడం మరియు సున్నత్ ను అనుసరించడం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.

ధార్మిక ప్రసంగాలు వినడం పట్ల శ్రద్ధ వహించాలి. వాటి వలన హృదయాలు మృదువుగా మారతాయి.

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత (షరియత్ మార్గదర్శనములో) సన్మార్గ గాములైన ఖలీఫాలను; అంటే అబూ బకర్ అస్సిద్దీఖ్, ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్, ఉథ్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ మరియు అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ ల సున్నత్ ను అనుసరించాలనే ఆదేశం ఉన్నది.

ధర్మములో కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల నిషేధం కనిపిస్తున్నది; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే అనే హెచ్చరిక ఉన్నది.

విశ్వాసులపై అధికారిగా, లేక పాలకునిగా ఎవరు నియమించబడినా అవిధేయత చూపకుండా, వారి మాట వినాలి, వారిని అనుసరించాలి.

అన్ని సమయాలలోనూ, అన్ని విషయాలలోనూ అల్లాహ్ పట్ల తఖ్వా (భయభక్తులు) కలిగి ఉండడం యొక్క ప్రాధాన్యత కనిపిస్తున్నది.

ఉమ్మత్ లో విబేధాలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అవి ప్రస్ఫుటమైనప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ వైపునకు మరియు ఖులాఫా అర్రాషిదీన్’ల యొక్క సున్నత్ వైపునకు మరలడం విధి.

التصنيفات

సున్నత్ ప్రాముఖ్యత మరియు దాని స్థానం., ప్రవక్త అనుచరుల ఘనత రజిఅల్లాహు అన్హుమ్, సమాజంపై ఇమామ్ యొక్క హక్కు