“అన్సారులను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అన్సారులను విశ్వాసులైన ప్రతి ఒక్కరూ …

“అన్సారులను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అన్సారులను విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కపట విశ్వాసి తప్ప వారిని ఎవరూ ద్వేషించరు. వారిని (అన్సారులను) ఎవరైతే ప్రేమిస్తారో, అల్లాహ్ అతడిని ప్రేమిస్తాడు, మరియు ఎవరైతే వారిని ద్వేషిస్తాడో అల్లాహ్ అతడిని ద్వేషిస్తాడు.”

అల్ బరా ఇబ్న్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “అన్సారులను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అన్సారులను విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కపట విశ్వాసి తప్ప వారిని ఎవరూ ద్వేషించరు. వారిని (అన్సారులను) ఎవరైతే ప్రేమిస్తారో, అల్లాహ్ అతడిని ప్రేమిస్తాడు, మరియు ఎవరైతే వారిని ద్వేషిస్తాడో అల్లాహ్ అతడిని ద్వేషిస్తాడు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మదీనా వాసులలో అన్సారుల పట్ల ప్రేమను కలిగి ఉండుట అన్నది సంపూర్ణమైన విశ్వాసానికి నిదర్శనం. ఇది ఎందుకంటే (అత్యంత కష్ట కాలములో) వారు ముందడుగు వేసి ఇస్లాంకు మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సహాయంగా, మద్దతుగా నిలబడినారు, (మదీనాకు వలస వచ్చిన) ముస్లిములకు శ్రమకోర్చి ఆశ్రయం కల్పించారు, వారికి ధన సహాయం చేసినారు, మరియు అల్లాహ్ మార్గములో ప్రాణలను సైతం అర్పించినారు. వారిని ద్వేషించడం కపటత్వానికి నిదర్శనం. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఎవరైతే అన్సారులను ప్రేమిస్తాడో అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు, మరియు ఎవరైతే అన్సారులను ద్వేషిస్తాడో, అల్లాహ్ వారిని ద్వేషిస్తాడు – అని వివరించారు.

فوائد الحديث

ఈ హదీసు ద్వారా (మదీనా వాసులలో) అన్సారుల ప్రత్యేక స్థానము, వారి ఘనత తెలుస్తున్నది. వారి పట్ల ప్రేమ కలిగి ఉండడం సంపూర్ణ విశ్వాసానికి, మరియు కపటత్వము నుండి విముక్తికి నిదర్శనం.

దైవభక్తి రులు మరియు ధర్మనిష్టాపరుల పట్ల ప్రేమ (ఉదా: మదీనా లోని అన్సారుల పట్ల ప్రేమ) – దాసుల పట్ల అల్లాహ్ యొక్క ప్రేమకు ఒక కారణం అవుతుంది.

అలాగే ఇందులో (ఇస్లాం కొరకు మరియు ప్రవక్త కొరకు) అందరి కంటే ముందుగా ముందడుగు వేసిన వారి ఘనత, ఔన్నత్యము తెలుస్తున్నాయి.

التصنيفات

విశ్వాసము యొక్క భాగాలు, ప్రవక్త అనుచరుల ఘనత రజిఅల్లాహు అన్హుమ్