నిజంగా, నువ్వు ఎలాంటి హాని చేయలేని, ఎలాంటి లాభం కలిగించలేని ఒక రాయివి మాత్రమే అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు.…

నిజంగా, నువ్వు ఎలాంటి హాని చేయలేని, ఎలాంటి లాభం కలిగించలేని ఒక రాయివి మాత్రమే అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూడకపోయి ఉంటే, నేనూ నిన్ను ముద్దాడే వాడిని కాను

ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: అతడు నల్ల రాయి (కాబాగృహపు ఒక మూలలో ఉన్న హజ్రె అస్వద్) దగ్గరికి వచ్చి, దానిని ముద్దుపెట్టుకుని ఇలా అన్నాడు: "నిజంగా, నువ్వు ఎలాంటి హాని చేయలేని, ఎలాంటి లాభం కలిగించలేని ఒక రాయివి మాత్రమే అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూడకపోయి ఉంటే, నేనూ నిన్ను ముద్దాడే వాడిని కాను."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, మోమినుల నాయకుడు, కాబాగృహం ఒక మూలలో ఉన్న నల్ల రాయి (హజ్రె అస్వద్) దగ్గరికి వచ్చి, దానిని ముద్దుపెట్టుకుని, ఆ తర్వాత ఇలా అన్నారు: "నిజంగా, నువ్వు ఎలాంటి హాని చేయలేని, ఎలాంటి లాభం చేకూర్చలేని ఒక రాయివి మాత్రమే అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దుపెట్టుకోవడం నేను చూడకపోయి ఉంటే, నేనూ నిన్ను ముద్దాడే వాడిని కాను."

فوائد الحديث

తవాఫ్ (కాబాగృహ ప్రదక్షిణ) చేసేవారు నల్ల రాయి (హజ్రె అస్వద్) దగ్గరికి వచ్చినప్పుడు, ఒకవేళ సులభంగా సాధ్యమైతే, దానిని ముద్దుపెట్టడం అనుమతించబడింది (సున్నతు).

నల్ల రాయిని (హజ్రె అస్వద్) ముద్దుపెట్టుకోవడం వెనుకనున్న ప్రధాన ఉద్దేశ్యం — రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించిన దానిని అనుసరించడం మాత్రమే అంటే ఒక సున్నతును పాటించడము.

నవవి (రహిమహుల్లాహ్) ఇలా పలికినారు: దీని అర్థం — ఆ నల్లరాయికి లాభం చేకూర్చే శక్తీ లేదు, హాని కలిగించే శక్తీ లేదు; అది ఇతర సృష్టిరాశుల లాగానే అది కూడా ఒక సృష్టించబడిన రాయి, దాని ద్వారా లాభం లేదా హాని ఏదీ జరుగదు. ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ మాటలను హజ్ కాలంలో బహిరంగంగా పలికినారు, ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈ మాటలు వినాలని. తద్వారా ఈ విషయం వారందరికీ స్పష్టంగా తెలుస్తుంది.

ఆరాధన కార్యాలు (ఇబాదతులు) తౌఖీఫియ్యహ్ (దివ్య గ్రంథాలలో పేర్కొన్న విధము) గా మాత్రమే ఉంటాయి. అందువలన, వాటిలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినవి తప్ప మరేదీ చెల్లదు.

ఒక ఆరాధనా కార్యం ఖచ్చితమైన ఆధారాలతో స్థాపించబడితే, దాని పూర్వాపరాల గురించి మనకు తెలియకపోయినా దాన్ని ఆచరించాలి. ఎందుకంటే, ఆరాధన యొక్క వివేకవంతమైన ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి — నిశ్చయంగా ప్రజలు అల్లాహ్‌ ఆరాధనలను విధేయతతో ఆచరించడమే.

షరీఅతులో స్పష్టంగా అనుమతించబడిన వాటిని తప్ప, ఆరాధనలో భాగంగా రాళ్లు లేదా వేరే ఇతర వాటిని ముద్దుపెట్టడం నిషిద్ధం.

التصنيفات

ప్రవక్త అనుచరుల ఘనత రజిఅల్లాహు అన్హుమ్, హజ్ మరియు ఉమరా ఆదేశాలు మరియు సమస్యలు