“ఫజ్ర్ యొక్క రెండు రకాతుల (సున్నతు) నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, (మొదటి రకాతులో) “ఖుల్ యా అయ్యుహల్…

“ఫజ్ర్ యొక్క రెండు రకాతుల (సున్నతు) నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, (మొదటి రకాతులో) “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” సూరహ్’ను, (రెండవ రకాతులో) “ఖుల్ హువల్లాహు అహద్” సూరహ్’ను పఠించేవారు.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఫజ్ర్ యొక్క రెండు రకాతుల (సున్నతు) నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, (మొదటి రకాతులో) “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” సూరహ్’ను, (రెండవ రకాతులో) “ఖుల్ హువల్లాహు అహద్” సూరహ్’ను పఠించేవారు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఫజ్ర్ యొక్క రెండు రకాతుల రవాతిబ్ (స్వచ్ఛంద – సున్నత్) నమాజులో, మొదటి రకాతులో సూరహ్ అల్ ఫాతిహా పఠించిన తరువాత “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” సూరహ్’ను (సూరహ్ అల్-కాఫిరూన్), మరియు రెండవ రకాతులో సూరహ్ అల్ ఫాతిహా పఠించిన తరువాత “ఖుల్ హువల్లాహు అహద్” సూరహ్’ (సూరహ్ అల్-ఇఖ్లాస్) పఠించుటను ఎక్కువగా ఇష్టపడేవారు.

فوائد الحديث

ఫజ్ర్ యొక్క రెండు రకాతుల సున్నత్ నమాజులో, సూరహ్ అల్ ఫాతిహహ్ పఠించిన తరువాత ఈ రెండు సూరహ్’లను పఠించుట అభిలషణీయము.

ఈ రెండు సూరాలలో ప్రతి సూరహ్ “సూరహ్ అల్-ఇఖ్లాస్” (ఇఖ్లాస్ = నిష్కాపట్యము, నిజాయితీ) అనే పిలువబడుతుంది. ఎందుకంటే సూరత్ అల్-కాఫిరూన్ బహుదైవారాధకులు అల్లాహ్’ను కాకుండా వారు పూజించే ప్రతిదాని నుండి ఎటువంటి సంబంధమూ లేనట్లు, విడిపోతున్నట్లు, బంధాలుత్రెంచుకుంటున్నట్లు ప్రకటిస్తుంది; అంతే కాకుండా వారి యొక్క షిర్క్ (బహుదైవారాధన) వారి కర్మలను వ్యర్థం చేస్తుంది, కనుక వారు అల్లాహ్ యొక్క దాసులు కూడా కాదు అని, మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు అనే వాస్తవాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా, సూరత్ అల్-ఇఖ్లాస్ అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని ప్రకటిస్తుంది, ఆయన పట్ల నిజాయితీని నొక్కి చెబుతుంది మరియు ఆయన గుణవిశేషణాలను, లక్షణాలను స్పష్టం చేస్తుంది.

التصنيفات

నమాజ్ పద్దతి