మీలో ఒకరు నమాజు కు వచ్చినప్పుడు ఇమామ్ ను ఏ స్థితిలో పొందుతారో అదే స్థితిలో ఇమాము ను అతను అనుసరించవలసి ఉంటుంది.

మీలో ఒకరు నమాజు కు వచ్చినప్పుడు ఇమామ్ ను ఏ స్థితిలో పొందుతారో అదే స్థితిలో ఇమాము ను అతను అనుసరించవలసి ఉంటుంది.

అలీ బిన్ అబూ తాలిబ్ మరియు ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హుమా మర్ఫూ ఉల్లేఖనం:మీలో ఒకరు నమాజు కు వచ్చినప్పుడు, ఇమామ్ నమాజు యొక్క ఒక స్థితిలో ఉన్నాడు అప్పుడు అతను ఇమాము చేస్తున్న దాన్ని అనుసరించవలసి ఉంటుంది.

[దృఢమైనది] [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

الشرح

మీరు నమాజుకు వచ్చినప్పుడు నమాజులో ఖియామ్,రుకూ,సజ్దా మరియూ కుఊద్ లో నుంచి ఇమామ్ ను ఏ స్థితిలో పొందితే అదే స్థితిలో కలుసుకోవాలి,ఇమామ్ లేచే వరకు వేచిచూడకూడదు,కొంతమంది అజ్ఞానులు ఇలా చేస్తూ ఉంటారు.

فوائد الحديث

ఇమామ్ తో పాటు నమాజులో చేరేవాడికి ఏ భాగం దొరికితే ఆ భాగంలో రుకూ,సజ్దా మరియు కుఊద్ అనే తేడా చూపకుండా కలిసిపోవాలని ఇస్లాం ధర్మశాసనాలు సూచిస్తున్నాయి.

నిశ్చయంగా నమాజులో ఇమామ్ రుకూ చేస్తున్నప్పుడు అతనితోపాటు ఆ రుకూలో చేరితే అతను ఆ పూర్తి రకాతును పొందినట్లుగా అర్ధం, ఇతర హదీసుల్లో దీనిని రూఢీ పరిచే ప్రామాణిక ఆధారాలు ఉన్నాయి.

التصنيفات

ఇమామ్ మరియు ముఖ్తదీల ఆదేశాలు