"దీనార్ లో కనీసం నాలుగవ వంతు లేదా అంతకంటే ఎక్కువ విలువైనదాన్ని దొంగతనం చేసిన వారి చేయి నరకాలి."

"దీనార్ లో కనీసం నాలుగవ వంతు లేదా అంతకంటే ఎక్కువ విలువైనదాన్ని దొంగతనం చేసిన వారి చేయి నరకాలి."

ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "దీనార్ లో కనీసం నాలుగవ వంతు లేదా అంతకంటే ఎక్కువ విలువైనదాన్ని దొంగతనం చేసిన వారి చేయి నరకాలి."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా తెలిపినారు: దొంగతనానికి పాల్పడినవారు బంగారపు దీనార్ లో కనీసం నాలుగవ వంతు లేదా అంతకంటే ఎక్కువ విలువైనదాన్ని దొంగిలిస్తేనే, వారి చెయ్యి నరకాలి. ఇది సుమారు 1.06 గ్రాముల బంగారం విలువకు సమానం.

فوائد الحديث

దొనగతనం అనేది ఘోరమైన పెద్ద పాపాలలో ఒకటి.

మహోన్నతుడైన అల్లాహ్ అలాంటి దొంగకి శిక్షగా అతని చెయ్యి నరకమని ఆదేశించినాడు. అల్లాహ్ వాక్కు: "పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికి వేయండి." (ఖుర్ఆన్ 5:38). ఈ శిక్ష అమలు చేయడంలోని షరతులు సున్నతులో స్పష్టంగా వివరించిబడినాయి.

హదీథులో "చేయి" అనే పదం, అరచేయిని ముంజేయి మణికట్టు వద్ద నరకడాన్ని సూచిస్తుంది.

దొంగ చేతిని నరికే శిక్ష విధించడం వెనుకనున్న ప్రధాన కారణాల్లో ఒకటి, ప్రజల ఆస్తిని రక్షించడం మరియు ఇతరులు అలాంటి తప్పు చేయకుండా నిరోధించడం.

దీనార్ అనేది ఒక బంగారు మిత్కాల్ (బరువుకు ప్రమాణం)కు సమానం, ఇది ప్రస్తుతం 24-క్యారెట్ బంగారం 4.25 గ్రాములకు సమానం. అందువలన, ఒక క్వార్టర్ దీనార్ అంటే సుమారు 1.06 గ్రాముల బంగారం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.

التصنيفات

దొంగతనం శిక్ష