“అల్లాహుమ్మ అఊదు బిరిదాక మిన్ సఖతిక; వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక; వ అఊదుబిక మిన్క; లా ఉహ్’సీ థనాఅన్ అలైక; అన్’త కమా…

“అల్లాహుమ్మ అఊదు బిరిదాక మిన్ సఖతిక; వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక; వ అఊదుబిక మిన్క; లా ఉహ్’సీ థనాఅన్ అలైక; అన్’త కమా అథ్’నైత అలా నఫ్’సిక” (ఓ అల్లాహ్! నీ అనుగ్రహము ద్వారా నీ ఆగ్రహము నుండి రక్షణ కోరుతున్నాను; నీ క్షమాభిక్ష ద్వారా నీ శిక్ష నుండి రక్షణ కోరుతున్నాను; మరియు నీ నుండి నీతోనే రక్షణ కోరుతున్నాను; (ఓ అల్లాహ్!) నీ ప్రశంసలను నేను లెక్కించలేను; (ఏ ప్రశంసా పదాలతో) నిన్ను నీవు ఏమని ప్రశంసించుకున్నావో, నీవు ఆవిధంగానే ఉన్నవాడవు.”

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: ఒక రాత్రి నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్క మీద లేకపోవడం గమనించాను; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు అటూఇటూ తడిమాను. నా చేతికి వారి పాదాల అరికాళ్లు తగిలాయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో ఉన్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పాదాలు నిటారుగా ఉన్నాయి మరియు వారు ఇలా దుఆ చేస్తూ ఉన్నారు: “అల్లాహుమ్మ అఊదు బిరిదాక మిన్ సఖతిక; వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక; వ అఊదుబిక మిన్క; లా ఉహ్’సీ థనాఅన్ అలైక; అన్’త కమా అథ్’నైత అలా నఫ్’సిక” (ఓ అల్లాహ్! నీ అనుగ్రహము ద్వారా నీ ఆగ్రహము నుండి రక్షణ కోరుతున్నాను; నీ క్షమాభిక్ష ద్వారా నీ శిక్ష నుండి రక్షణ కోరుతున్నాను; మరియు నీ నుండి నీతోనే రక్షణ కోరుతున్నాను; (ఓ అల్లాహ్!) నీ ప్రశంసలను నేను లెక్కించలేను; (ఏ ప్రశంసా పదాలతో) నిన్ను నీవు ఏమని ప్రశంసించుకున్నావో, నీవు ఆవిధంగానే ఉన్నవాడవు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్కన నిద్రిస్తున్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్కమీద లేకపోవడం గమనించాను; గదిలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చదివే స్థలాన్ని నేను చేతితో తడిమాను; నా చేతికి వారి రెండు అరికాళ్లు తగిలాయి, అవి నిటారుగా ఉన్నాయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో ఉన్నారు; ఆయన ఇలా వేడుకుంటూ ఉన్నారు (దుఆ చేస్తూ ఉన్నారు): (అఊదు – నేను రక్షణ కోరుతున్నాను): ఓ అల్లాహ్! నాపై లేక నా ఉమ్మత్’పై (బిరదాక మిన్ సఖతిక) నీ అనుగ్రహం ద్వారా, నీ ఆగ్రహం నుండి నీ ఆశ్రయం కొరకు నిన్ను ప్రార్థిస్తున్నాను, నీ రక్షణ కోరుతున్నాను, వేడుకుంటున్నాను; మరియు (బి ఆఫాతిక) - నీ మన్నింపు ద్వారా, అంతులేని నీ క్షమాగుణం ద్వారా నీ శిక్ష నుండి నీ రక్షణ కోరుతున్నాను. (వ అఊదుబిక మిన్’క - ఓ అల్లాహ్! నీ నుండి రక్షించుకొనుట కొరకై నిన్ను వేడుకుంటున్నాను) నీ సౌందర్య గుణలక్షణాల ద్వారా, నీ మహిమాన్విత గుణలక్షణాల ద్వారా నీ రక్షణ కోరుతున్నాను, ఎందుకంటే నీవు తప్ప నీ నుండి మరెవ్వరూ నాకు రక్షణ ఇవ్వలేరు, నన్ను రక్షించలేరు. అల్లాహ్ నుండి అల్లాహ్ రక్షణ, ఆయన ఆశ్రయం తప్ప మరేదీ రక్షించలేదు. (లా ఉహ్’సీ థనాఅన్ అలైక - అన్ని రకాల ప్రశంసలూ నీ కొరకే, నీ ప్రశంసలు లెక్కలేనన్ని, నేను నీ ప్రశంసలను లెక్కించలేను) ఆ సమర్థత లేని వాడను, ఆ సమర్థత లేని కారణంగా నేను ఎంత ప్రయత్నించినా నీ ఘనతకు తగిన విధంగా నేను నీ ప్రశంసలను, నీ ఘనతను, నీ కృపను, దయాదాక్షిణ్యాలను, నీ అనుగ్రహాన్ని లెక్కించలేను (అన్’త కమా అథ్’నైత అలా నఫ్’సిక - నిన్ను నీవు ఏమని ప్రశంసించుకున్నావో, నీవు ఆ విధంగానే ఉన్నవాడవు) ఓ అల్లాహ్! నీ స్తుతికి, ఘనతకు తగినట్టుగా నిన్ను నీవు స్తుతించుకున్నావు. నీ స్తుతికి తగినట్టుగా, నీ ఘనతకు తగినట్టుగా నీ ప్రశంసల హక్కును ఎవరు మాత్రం తీర్చగలరు?

فوائد الحديث

సజ్దహ్’లో ఈ దుఆలను చేయుట అభిలషణీయము.

మీరక్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఇమాం నసయీ తన సునన్ అన్’నసాయీలో నమోదు చేసిన ఇదే హదీథులో ఉల్లేఖకుడు ఇలా అన్నారు: “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించి, నిద్రకు ఉపక్రమించే ముందు ఈ దుఆ పఠించేవారు.”

అల్లాహ్’ను వేడుకొనునపుడు, ఆయనకు మొరపెట్టుకొనునపుడు, ఖుర్’ఆన్ మరియు సున్నతులలో ధృవీకరించబడిన ఆయన ఉత్తమమైన నామములతో ఆయనను స్తుతిస్తూ, ఆయన ఘనతను కొనియాడుతూ వేడుకొనుట అభిలషణీయము.

రుకూ మరియు సజ్దహ్’లలో సృష్టికర్తను కీర్తించుట, ఆయన ఘనతను కొనియాడుట కూడా ఇందులో ఉన్నది.

సర్వోన్నతుడైన అల్లాహ్’ను నేరుగా వేడుకొట, ఉదాహరణకు ‘ఓ అల్లాహ్! నా ఈ కష్టాన్ని తొలగించు’ అని వేడుకొనుటకు – ఏ విధంగా అనుమతి ఉన్నదో, అదే విధంగా అల్లాహ్ యొక్క గుణలక్షణాల ద్వారా కూడా ఆయనను వేడుకొనవచ్చును.

అల్-ఖత్తాబీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “తరచి చూస్తే ఈ దుఆలో సూక్ష్మమైన, నిగూఢమైన అర్థం మనకు కనిపిస్తుంది, అదేమిటంటే: ‘ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క అనుగ్రహం, దయ, కృప ద్వారా ఆయన ఆగ్రహం నుండి రక్షణ కోరినారు; ఆయన క్షమాగుణం, క్షమాభిక్ష ద్వారా ఆయన శిక్ష నుండి రక్షణ కోరినారు; గమనించండి, “ఆగ్రహం మరియు అనుగ్రహం” ఇవి రెండూ ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనవి; అలాగే “శిక్ష మరియు క్షమాభిక్ష” ఇవి రెండూ ఒకదానికొకటి వ్యతిరేకమైనవి; ఎవరికి వ్యతిరేకంగానైతే ఏమీ లేదో, ఆయనను ప్రస్తావించినపుడు, అంటే అల్లాహ్’ను ప్రస్తావించినపుడు, ఆయన నుండి ఆయన రక్షణనే కోరుకున్నారు. దీని అర్థము: అల్లాహ్ యొక్క ఆరాధనలను నెరవేర్చడంలో, ఆయనను స్తుతించుటలో జరిగే వైఫల్యాల నుండి ఆయన రక్షణ కోరడం. ఈ వైఫల్యాల నుండి ఆయన వద్ద తప్ప మరింకెవరి వద్ద రక్షణ కోరగలం. దుఆలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్యము: “లా ఉహ్’సీ థనాఅన్ అలైక - నేను నీ ప్రశంసలను లెక్కించలేను” – అంటే, “అన్ని రకాల ప్రశంసలూ నీ కొరకే, నీ ప్రశంసలు లెక్కలేనన్ని, నేను నీ ప్రశంసలను లెక్కించలేను, ఆ సమర్థత లేని వాడను, నేను ఎంత ప్రయత్నించినా నీ ప్రశంసలను, నీ ఘనతను, నీ కృపను, దయాదాక్షిణ్యాలను, నీ అనుగ్రహాన్ని లెక్కించలేను, సాధించలేను.”

التصنيفات

నమాజ్ దఆలు