:

ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: రెండు గొప్ప అనుగ్రహాలు ఉన్నాయి, వీటి విషయంలో చాలా మంది మనుషులు (నిర్లక్ష్యం వలన) నష్టపోతారు: ఇవి ఆరోగ్యం మరియు తీరిక సమయం.

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

అల్లాహ్ మనిషికి ఇచ్చిన రెండు గొప్ప అనుగ్రహాల గురించి ప్రవక్త ﷺ ఇలా తెలిపినారు - అవి: ఆరోగ్యం మరియు తీరిక సమయం. చాలామంది ఈ రెండింటి విషయంలో నష్టపోతారు, ఎందుకంటే అవి ఉన్నప్పుడు వాటిని సరిగ్గా ఉపయోగించరు, వృథా చేస్తారు. ఒక మనిషికి ఆరోగ్యం కూడా ఉంది, ఖాళీ సమయం కూడా ఉంది, కానీ అతడు అల్లాహ్ ఆజ్ఞలకు విధేయత చూపకుండా, ఆలస్యంగా, అలసత్వంతో సమయాన్ని వృథా చేస్తే — అతడు నష్టపోయినవాడు అవుతాడు. చాలా మంది పరిస్థితి ఇలానే ఉంటుంది. కానీ, ఎవరు తమ ఆరోగ్యాన్ని, ఖాళీ సమయాన్ని అల్లాహ్ ఆజ్ఞలకు లోబడి, ఆయన విధేయతలో, మంచిపనుల్లో వినియోగిస్తారో — వారే నిజంగా లాభం పొందేవారు. ఈ ప్రపంచం పరలోక పంటను సాగు చేయడానికి ఉపయోగపడే ఒక పంటభూమి. ఇక్కడ చేసే మంచిపనుల లాభం పరలోకంలో కనిపిస్తుంది. ఖాళీ సమయం తర్వాత పనిలో నిమగ్నమైపోతారు అంటే బిజీ అయిపోతారు, ఆరోగ్యం తర్వాత అనారోగ్యం వస్తుంది, చివరికి వృద్ధాప్యం అయినా సరే, ఆరోగ్యం కోల్పోతారు.

فوائد الحديث

ఇక్కడ మానవుడిని ఒక వ్యాపారితో పోల్చడం జరిగింది. ఆరోగ్యం, ఖాళీ సమయం — ఇవి ప్రధాన మూలధనం (క్యాపిటల్) లాంటివి. ఎవరు తమ ఆరోగ్యాన్ని, ఖాళీ సమయాన్ని (మూలధనాన్ని) సరైన విధంగా ఉపయోగిస్తారో, వారు లాభం పొందుతారు. ఎవరు వాటిని వృథా చేస్తారో,

వారు నష్టపోతారు, (కాలం గడిచిపోయిన) తరువాత పశ్చాత్తాపపడతారు.

ఇబ్నె -ఖాజిన్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: అరబీ పేర్కొనబడిన పదం "అన్నఅమత్" కు అర్థము - మనిషి ఆనందపడే, సుఖసంతోషాలతో అనుభవించే దానిని "అన్నఅమత్" అంటారు (అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహం, వరం, ఆశీర్వాదం). అలాగే "అల్ గబ్న్" అంటే: ఎవరైనా ఒక వస్తువును అసలు ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేయడం, లేదా తక్కువ ధరకు అమ్మడం — అంటే, నష్టపోవడం. ఎవరికైనా ఆరోగ్యం ఉంది, పనుల నుండి తీరిక సమయమూ ఉంది, కానీ ఆ స్థితిలో అతడు తన పరలోకాన్ని సరి చేసుకోవడానికి (మంచిపనులు చేయడానికి) ప్రయత్నించకపోతే — అతడు వ్యాపారంలో నష్టపోయినవాడిలా అయి పోతాడు.

ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఖాళీ సమయం లభించినప్పుడు మహోన్నతుడైన అల్లాహ్‌కు దగ్గర కావడానికి, మంచి పనులు చేయడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఈ రెండు (ఆరోగ్యం, ఖాళీ సమయం) కోల్పోయే ముందే అల్లాహ్‌కి విధేయత, పుణ్యకార్యాలు చేయడంలో త్వరపడాలి.

అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలకు (నిఅమతులకు) నిజమైన కృతజ్ఞత (ధన్యవాదం) తెలపడం అంటే: ఆ అనుగ్రహాలను అల్లాహ్‌కు విధేయతలో, మంచిపనుల్లో వినియోగించడమే.

అల్-ఖాది మరియు అబూ బకర్ ఇబ్నుల్-అరబీ (రహిమహుముల్లాహ్) ఇలా చెప్పినారు: అల్లాహ్ తన దాసుడికి ప్రసాదించే మొదటి అనుగ్రహం ఏమిటి అన్నదానిపై పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి: కొందరు - "ఈమాన్" (విశ్వాసం) అని చెప్పారు. మరికొందరు: "జీవితం" (ప్రాణం) అని చెప్పారు. మరికొందరు: "ఆరోగ్యం" అని చెప్పారు. వాస్తవానికి, మొదటిది (ఈమాన్)నే గొప్ప అనుగ్రహం. ఎందుకంటే అది పరిపూర్ణమైన, అఖండమైనది. జీవితం, ఆరోగ్యం — ఇవి ఈ ప్రపంచంలో ఉపయోగపడే అనుగ్రహాలు మాత్రమే. అవి నిజమైన అనుగ్రహాలుగా మారాలంటే, అవి ఈమాన్‌తో పాటు ఉండాలి. ఇంకా, ఆరోగ్యం, జీవితం లాంటి అనుగ్రహాలలోనే చాలా మంది నష్టపోతారు; అంటే, వాటి లాభాన్ని కోల్పోతారు లేదా తక్కువగా పొందుతారు. ఎవరు తమ మనస్సును అనుసరించి సుఖాన్ని, విశ్రాంతిని మాత్రమే కోరుతూ అల్లాహ్ ఆజ్ఞలను పాటించకుండా, పుణ్యకార్యాల్లో నిర్లక్ష్యంగా ఉంటారో - వారు నష్టపోయినవారే. అలాగే, ఎవరికైనా ఖాళీ సమయం ఉండి, కానీ దాన్ని మంచిపనులు చేసేందుకు వినియోగించకపోతే - అతనికి మన్నింపు లేదు, ఎందుకంటే

పనిలో నిమగ్నమైన ఉన్నవాడికి అదొక సాకుగా ఉండవచ్చు,

కానీ ఖాళీగా ఉన్నవాడి కొరకు ఏ కారణం ఉండదు, అది అతని స్వంత తప్పుగానే పూర్తిగా లెక్కించబడుతుంది.

التصنيفات

మనస్సుల పరిశుద్ధత