నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు.

నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా తాను విన్నానని, అబూ దర్దాఅ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు: నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: 'ఎవరైతే అమాయకులపై తరుచుగా శాపాలు పెడతారో, వారు రెండు శిక్షలకు పాత్రులవుతారు. మొదటి శిక్ష: ప్రళయ దినాన అతడు ప్రవక్తలు, సందేశహరులు తమ తమ జాతులకు దైవసందేశాలను అందజేసారని సాక్ష్యం ఇచ్చే అర్హత కోల్పోతాడు. అంతేగాక, అతడి దుష్టత్వం వలన ఇహలోకంలోనూ అతడి సాక్ష్యం అంగీకరించబడదు. అలాగే అతడికి 'షహాదత్' (అల్లాహ్ మార్గంలో ధర్మయుద్ధం చేస్తూ మరణించే భాగ్యం) లభించదు. రెండవ శిక్ష: ప్రళయ దినాన విశ్వాసులు (ముస్లింలు) నరకానికి అర్హులైన తమ సోదరుల కొరకు మధ్యవర్తన చేసే సమయంలో, ఈ శపించే వ్యక్తి (లాఅిన్) ఎవరికీ మధ్యవర్తన చేయడానికి అనుమతించబడడు.

فوائد الحديث

శాపాలు పెట్టడం హరామ్ (నిషేధించబడినది). తరచుగా శాపాలు పెట్టడం అనేది నిశ్చయంగా, కబీరా గునాలలో (పెద్ద పాపాలలో) ఒకటిగా పరిగణించబడుతుంది.

ఈ హదీథులో తెలిపిన విషయం తరచుగా శపించేవారికే వర్తిస్తుంది, ఏదో ఒకసారి లేదా చాలా అరుదుగా శపించేవారి కొరకు కాదు. ఇంకా, ఇస్లామీయ ధర్మశాస్త్రంలో షరియతు అనుమతించిన శాపాలు దీని క్రిందకు రావు. అవి ఏమిటంటే — ప్రత్యేకంగా ఒక వ్యక్తిని శపించడం గురించి కాకుండా, కేవలం చెడు లక్షణాలు ఉన్నవారిని లేదా చెడు పనులు చేసే వారిని

సాధారణంగా శపించడాన్ని షరిఅతు అనుమతిస్తుంది. ఉదాహరణకు: "అల్లాహ్ యూదులను, నసారాలను శపించును", "అల్లాహ్ దుర్మార్గులను శపించును", "అల్లాహ్ చిత్రాలు వేసే వారిని శపించును", "అల్లాహ్ లూత్ ప్రజల పని చేసే వారిని (స్వలింగ సంపర్కం చేసే వారిని) శపించును", "అల్లాహ్ కోసం కాకుండా ఇతరుల కోసం బలి ఇచ్చే వారిని అల్లాహ్ శపించును", "అల్లాహ్ పురుషులలో మహిళలలా, మహిళలలో పురుషులలా ప్రవర్తించే, వేషధారణ చేసే వారిని శపించును" మొదలైన వాటికి ఇది వర్తించదు.

దీని ద్వారా ప్రళయదినం నాడు, మోమినుల (విశ్వాసుల) శిఫారసు (షఫాఅత్) ఉండటం ఇస్లామీయ విశ్వాసంలో స్పష్టంగా ధృవీకరించబడింది.

التصنيفات

దుర్గుణాలు