“ఎవరైనా ఇద్దరు భార్యలు కలిగి ఉండి, వారిలో ఒక భార్య వైపునకు ఎక్కువగా ఆకర్షితులై ఉంటే (అన్నింటా ఆమెకు ఎక్కువ…

“ఎవరైనా ఇద్దరు భార్యలు కలిగి ఉండి, వారిలో ఒక భార్య వైపునకు ఎక్కువగా ఆకర్షితులై ఉంటే (అన్నింటా ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే) పునరుత్థాన దినమున అతడు శరీరం ఒక వైపునకు వంగి ఉన్న స్థితిలో వస్తాడు.”

అబూ బురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా ఇద్దరు భార్యలు కలిగి ఉండి, వారిలో ఒక భార్య వైపునకు ఎక్కువగా ఆకర్షితులై ఉంటే (అన్నింటా ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే) పునరుత్థాన దినమున అతడు శరీరం ఒక వైపునకు వంగి ఉన్న స్థితిలో వస్తాడు.”

[దృఢమైనది]

الشرح

ఎవరికైనా ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండి, ఖర్చు విషయంలో, వారికి ఇల్లు సమకూర్చే విషయంలో, వారికి దుస్తులు సమకూర్చే విషయంలో మరియు వారితో రాత్రి గడపడం వంటి విషయాలలో తన భార్యలను సమానంగా చూడకపోతే, పునరుత్థాన దినాన అతని శరీరం సగం వంగి ఉంటుంది; మరియు అతని శరీరం వంగి ఉన్న స్థితిలో రావడం అతని అన్యాయానికి శిక్ష అని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం మనకు తెలియజేస్తున్నారు.

فوائد الحديث

ఒక పురుషుడు తన సమయాన్ని తన ఇద్దరు భార్యల మధ్య, లేదా ఇద్దరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉంటే వారి మధ్య విభజించడం అతనిపై విధి. తన సమర్ధత మేరకు వారిపై ఖర్చు చేసే విషయంలోగానీ, లేక వారితో రాత్రుళ్లు గడిపే విషయంలోగానీ, లేక వారిని మంచిగా చూసుకునే విషయంలోగానీ, వారిలో ఎవరైనా ఒకరివైపునకు ఎక్కువగా వంపు కలిగి ఉండడం, లేక ఆమెను మిగతా వారిపై అన్నింటా ఆధిక్యతలో ఉంచడం నిషేధము.

తన భార్యల నందరినీ సమానంగా చూడడం అనేది ఆవ్యక్తి అధీనం లో ఉన్న విషయాలకు వర్తిస్తుంది (ఉదాహరణకు: తన భార్యలపై ఖర్చు చేయడం, వారి మధ్య సమయాన్ని విభజించుకోవడం మొదలైనవి అన్నీ అతని అధీనములో ఉన్న విషయాలే); అతని అధీనములో లేని విషయాలకు ఇది వర్తించదు, ఉదాహరణకు ప్రేమ, మనసు, మనసులోని భావాలు మొదలైనవి. వీటిపై అతని నియంత్రణ ఉండదు. ఈ విషయాలకు ఈ హదీథు వర్తించదు. సూరహ్ అన్’నిసా, 129వ ఆయతులో అల్లాహ్ ప్రకటనకు అర్థం ఇదే { وَلَن تَسْتَطِيعُوٓا۟ أَن تَعْدِلُوا۟ بَيْنَ ٱلنِّسَآءِ وَلَوْ حَرَصْتُمْ...} (మరియు మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ వల్ల కాని పని, మీరు ఎంతగా కోరుకున్నాసరే...)

తీర్పు దినమున మనిషి ఆచరణలకు తగిన మరియు సమానమైన ప్రతిఫలం లభిస్తుంది. భార్యల విషయంలో ఒక భార్య వైపునకు మొగ్గు చూపడం, అన్ని విషయాలలో ఆమె వైపునకు వంగిపోవడం అనేది తీర్పు దినము నాడు అతని శరీరం ఒకవైపునకు వంగిపోవడానికి కారణం అవుతుంది.

ఈ హదీథులో ఇతరుల హక్కులను గౌరవించడం, వాటికి అన్నింటికన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనే విషయాల ప్రాముఖ్యత తెలుస్తున్నది. నిజానికి ఇతరుల హక్కులను గౌరవించకపోవడం, వాటిని కాజేయడం, వాటికి ప్రాధాన్యతనివ్వక పోవడం అనేది సహించరానిది. అయితే ఇది వనరుల లభ్యత మరియు తగినంత పరిశోధనపై ఆధారపడిన విషయం.

ఒక పురుషుడు తన భార్యల మధ్య సమానత్వం పాటించలేనేమో అనో, లేక ధర్మం విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తానేమో అనో భయపడితే, అతడు ఒక భార్యకే పరిమితం కావడం మంచిది. అల్లాహ్ ప్రకటన { فَإِنْ خِفْتُمْ أَلَّا تَعْدِلُوا۟ فَوَٰحِدَةً} (అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకు ఉంటే, ఒకామెను మాత్రమే వివాహం చేసుకొోండి...)(సూరహ్ అన్’నిసా – 4:3)

التصنيفات

భార్యభర్తల మధ్య పది విషయాలు