إعدادات العرض
ఉఖ్బహ్ ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: …
ఉఖ్బహ్ ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “స్త్రీలు ఒంటరిగా ఉన్నపుడు వారిని కలవడం నుండి జాగ్రత్తగా ఉండండి”. అది విని అన్సారులలో నుండి ఒక వ్యక్తి “మరి “హమ్’వ” (భర్త తరఫు పురుష బంధువు) ను గురించి మీరు ఏమంటారు?” అని ప్రశ్నించాడు. దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “హమ్’వ” అంటే మరణమే” అన్నారు
ఉఖ్బహ్ ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఉఖ్బహ్ ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “స్త్రీలు ఒంటరిగా ఉన్నపుడు వారిని కలవడం నుండి జాగ్రత్తగా ఉండండి”. అది విని అన్సారులలో నుండి ఒక వ్యక్తి “మరి “హమ్’వ” (భర్త తరఫు పురుష బంధువు) ను గురించి మీరు ఏమంటారు?” అని ప్రశ్నించాడు. దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “హమ్’వ” అంటే మరణమే” అన్నారు.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी සිංහල ئۇيغۇرچە Hausa Português Kurdî Русский Nederlands অসমীয়া Tiếng Việt Kiswahili ગુજરાતી پښتو አማርኛ ไทย Oromoo Română മലയാളം Deutsch नेपाली ქართული Кыргызча Moore Magyarالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరాయి స్త్రీలతో కలసి ఉండరాదని హెచ్చరిస్తూ ఇలా అన్నారు: స్త్రీలు ఉన్న ప్రాంతంలో ప్రవేశించకుండా జాగ్రత్త వహించండి మరియు మీరు ఉన్న చోట స్త్రీలు ప్రవేశించకుండా జాగ్రత్త వహించండి. అది విని అన్సారులకు చెందిన ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను “ఒకవేళ ఆమె వివాహం అతనితో జరిగి ఉండకపోతే, ఆమె వివాహం చేసుకోవడానికి అనుమతి ఉన్న అతని తరఫు బంధువులు (అంటే భర్త తరఫు బంధువులు), ఉదాహరణకు అతని సోదరుడు, అతని మేనల్లుడు (సోదరుని కుమారుడు, లేక సోదరి కుమారుడు), లేక అతడి చిన్నాన్న, లేక అతడి చిన్నాన్న కుమారుడు, మొదలైన వారి గురించి మీరు ఏమంటారు?” అని ప్రశ్నించాడు (అంటే వాళ్ళు ఆమె ఉన్న చోటులోనికి వెళ్ళవచ్చునా? అని ప్రశ్నించాడు). దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: మీరు మరణం గురించి మీరు ఏవిధంగానైతే జాగ్రత్త పడతారో, అటువంటి బంధువు పట్ల కూడా అదే విధంగా జాగ్రత్తగా ఉండండి! ఎందుకంటే భర్తకు సంబంధించిన అటువంటి మగ బంధువులతో ఒంటరిగా ఉండడం ధర్మములో ప్రలోభాలకు మరియు విధ్వంసానికి దారి తీస్తుంది. భర్త బంధువులు, ఉదాహరణకు అతడి తండ్రులు (అంటే, అతని తండ్రి, చిన్నాన్న, పెదనాన్నలు, అతని తాత, ముత్తాత మొ.) మరియు అతని కొడుకులు కాకుండా, స్త్రీలు ఉన్న ప్రదేశం లోనికి ప్రవేశించకుండా నిరోధించబడడానికి, ఇటువంటి బంధువులు పరాయి మగవారి కంటే ఎక్కువ అర్హులు. ఎందుకంటే, పరాయి పురుషుల కంటే, భర్త బంధువులు ఆమె ఉన్న ప్రదేశం లోనికి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కనుక ఇటువంటి బంధువు నుండి చెడు చోటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువే. ఆమెతో ఒంటరిగా ఉండే అవకాశం కారణంగా అతడి నుండి దురాకర్షణ ప్రబలే ప్రమాదము మరియు ఆమె దానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు బంధుత్వం కారణంగా అతడు ఆ స్త్రీని చేరుకునే, ఆమెతో ఏకాంతంగా గడిపే అవకాశాలు అతనికి ఎక్కువగా లభిస్తాయి. బంధుత్వం కారణంగా అతని ఉనికి అనివార్యమైనందున అతడిని ఆమె నుంచి దూరంగా ఉంచడం సాధ్యం కాదు కూడా. మన ఇళ్ళలో ఒక వ్యక్తి తన సోదరుని భార్య ఒంటరిగా ఉన్నపుడు ఆమె దగ్గరికి వెళ్ళడాన్ని, ఆమెతో అక్కడ ఉండడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అందుకు అతడు నిందించబడడు కూడా. కనుక అటువంటి ఇళ్ళలో ఒక వ్యక్తి తన సోదరుని భార్యను ఏకాంతంలో సులభంగా కలుసుకోగలడు. ఈ స్థితి, అది దారితీసే భయంకరమైన చెడు పరిణామాల పరంగా మరణానికి సమానమైనదై ఉంటుంది. అదే పరాయి పురుషుని విషయాన్ని తీసుకుంటే, మన స్త్రీల దగ్గరికి వెళ్ళకుండా ముందే అడ్డుకోబడతాడు.فوائد الحديث
పరాయి స్త్రీలను కలవడం, వారితో ఒంటరిగా ఉండడంపై నిషేధం ఎందుకంటే అది దారితీసే అనైతికత, అనాపేక్షిత పరిణామాలను ముందుగా అడ్డుకోవడం, ముందుగానే దానికి అడ్డుకట్టవేయడం దాని అసలు ఉద్దేశ్యము గనుక.
ఈ నిషేధము సాధారణంగా పరాయి పురుషులకు వర్తిస్తుంది, అంటే మహిళకు మహ్రం కాని బంధుత్వం ఉన్న పురుషులు (ఆమెతో వివాహానికి అభ్యంతరం లేని బంధుత్వం ఉన్న పురుషులు). ఇందులో అటువంటి బంధుత్వం ఉన్న భర్త తరఫు పురుషులు, మరియు పరాయి పురుషులు అందరూ వస్తారు.
తప్పులో పడిపోయే ప్రమాదం ఉంటుంది అనే భయంతో తప్పు జరగడానికి సాధారణంగా అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలనుండి దూరంగా ఉండాలి.
ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “అరబీ భాషా పండితులు “అల్-అహ్మాఅ” అంటే భర్త తరఫు బంధువులు – అంటే అతడి తండ్రి, చిన్నాన్న, పెదనాన్నలు, అతని సోదరులు, వారి పిల్లలు, అతని కజిన్ (చిన్నాన్న, పెదనాన్న సంతానం) మొదలైన వారు అని; “అల్-అఖ్’తాన్” అంటే భార్య తరఫు బంధువులు అని; అలాగే “అల్-అస్’హార్” అంటే ఇద్దరి తరఫు బంధువులు అని ఏకాభిప్రాయంగా స్థిరపరచినారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్-హమ్’వ” ను మరణంతో సమానము అన్నారు: దీనిని ఇమాం ఇబ్న్ హజర్ (రహిమహుల్లాహ్) ఇలా వివరించినారు: అరబ్బులు ద్వేషించదగిన దేనినైనా ‘మరణం’ తో పోలుస్తారు. ఇక్కడ మరణంతో సారూప్యత ఏమిటంటే; పాప కార్యము సంభవించినట్లయితే అక్కడ ధర్మము మరణించినట్లే; మరియు పాపకార్యము సంభవించినపుడు ఏకాంతంలో అందులో పాలుపంచుకున్న వానిపై “రజం” శిక్ష వాజిబ్ అవుతుంది. పర్యవసానంగా అందులో పాలుపంచుకున్న స్త్రీ భర్త, అసూయ కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చివేస్తాడు; ఆమె జీవితం నాశనం అవుతుంది.
التصنيفات
స్త్రీల ఆదేశాలు