.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలకడం విన్నాను అని అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించినారు. నిశ్ఛయంగా ఆదము సంతానం (మానవుల) హృదయాలన్నీ ఆ దయామయుడి (అల్లాహ్) రెండు వేళ్ల మధ్యలో ఒకే ఒక్క హృదయంలా ఉంటాయి. ఆయన తన ఇష్టం ప్రకారం వాటిని తిప్పుతాడు." తర్వాత అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు: "అల్లాహుమ్మ ముసర్రిఫ్ అల్-ఖులూబ్ సర్రిఫ్ ఖులూబనా అలా తా’అతిక్ (ఓ అల్లాహ్! హృదయాలను తిప్పేవాడా, మా హృదయాలను నీ విధేయత వైపు మళ్లించు).

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలిపినారు: ఆదము సంతతి (మానవుల) హృదయాలన్నీ దయామయుడైన అర్రహ్మాన్ (అల్లాహ్) యొక్క రెండు వేళ్ల మధ్యలో ఒక్క హృదయంలా ఉంటాయి. ఆయన తన ఇష్టం ప్రకారం వాటిని తిప్పుతాడు. ఆయన తలుచుకుంటే దానిని సత్యమార్గంపై నిలుపుతాడు; లేదా తప్పుదారిలో విడిచి పెట్టేస్తాడు. హృదయాలన్నింటినీ నడిపించడం ఆయనకు ఒక్క హృదయాన్ని నడిపించడమంత సులభం. ఏ ఒక్క పని కూడా మరో పనికి ఆయన వద్ద అడ్డు తగలదు." తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు: "అల్లాహుమ్మ ముసర్రిఫల్-ఖులూబ్! (హృదయాలను తిప్పేవాడా!) కొన్నిసార్లు ఆజ్ఞాపాలన చేసేలా, కొన్నిసార్లు అవిధేయతకు పాల్బడేలా, కొన్నిసార్లు జ్ఞాపకం ఉంచుకునేలా, మరికొన్నిసార్లు మరచిపోయేలా హృదయాలను తిప్పే నీవు, మా హృదయాలను నీ ఆజ్ఞపాలన వైపు మాత్రమే తిప్పు."

فوائد الحديث

ఖుద్రత్ (విధివ్రాత) నిరూపణ ఉంది. మరియు అల్లాహ్ తన దాసుల హృదయాలను వాటి మీద లిఖించబడిన ఖుద్రత్ ప్రకారం నడిపిస్తాడు.

సత్యం మరియు సన్మార్గంపై స్థిరంగా ఉండేట్లు చేయమని ఒక ముస్లిం తన ప్రభువును నిరంతరం ప్రార్థించుకోవాలి.

అల్లాహ్ పట్ల భయం మరియు ఆయన ఒక్కడి పట్ల మాత్రమే అనుబంధమేర్పరచుకోవటం,ఆయనకు ఎటువంటి భాగస్వామి లేడు.

ఆల్-ఆజురీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "సత్యాన్ని అనుసరించేవారు (అహ్లుస్-సున్నా) కూడా, మహోన్నతుడైన అల్లాహ్ తనను తాను ఎలా వర్ణించుకున్నాడో, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని ఎలా వర్ణించారో, సహాబాలు రదియల్లాహు అన్హుమ్ ఆయన్ని ఎలా వర్ణించారో - అదే విధంగా ఆయన్ని వర్ణిస్తారు. ఇదే తొలితరం విద్వాంసుల (సలఫ్) మార్గం, ఎవరు (సున్నత్) అనుసరించారో వారి మార్గము, కొత్తదనాలు (బిద్అత్) సృష్టించని వారి మార్గము."

التصنيفات

మాసూర్ దుఆలు