“అల్లాహ్ కేవలం తనకొరకు, చిత్తశుద్ధితో చేసే పనిని తప్ప మరే పనిని అంగీకరించడు”

“అల్లాహ్ కేవలం తనకొరకు, చిత్తశుద్ధితో చేసే పనిని తప్ప మరే పనిని అంగీకరించడు”

అబూ ఉమామహ్ అల్ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ప్రతిఫలం మరియు కీర్తి కోసం యుద్ధానికి వెళ్ళే వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అతను ఏమి పొందుతాడు?” దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “అతని కొరకు ఏమీ లేదు” అన్నారు. అతడు అదే ప్రశ్నను మూడు సార్లు అడిగాడు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లూ “అతని కొరకు ఏమీ లేదు” అని జవాబిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ కేవలం తనకొరకు, చిత్తశుద్ధితో చేసే పనిని తప్ప మరే పనిని అంగీకరించడు”.

[దృఢమైనది] [దాన్ని నసాయీ ఉల్లేఖించారు]

الشرح

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, అల్లాహ్ నుండి ప్రతిఫలం మరియు ప్రజల నుండి ప్రశంసలు మరియు కీర్తి కోరుతూ పోరాడటానికి (జిహాద్’కు) బయలుదేరిన వ్యక్తిపై షరియత్ పరమైన తీర్పును గురించి అడగడానికి వచ్చాడు. అతడు ప్రతిఫలం పొందుతాడా అని? దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: "అతనికి ఎలాంటి ప్రతిఫలం లభించదు. ఎందుకంటే, అతడు (జిహాద్’లో పాల్గొనాలనే) తన సంకల్పములో అల్లాహ్’కు ఇతరులను భాగస్వాములుగా చేసినాడు”. ఆ వ్యక్తి తన ప్రశ్నను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మూడు సార్లు పునరావృతం చేశాడు. మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి మూడుసార్లు సమాధానమిచ్చారు మరియు మూడుసార్లూ అదే సమాధానం ధృవీకరించారు - అతనికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ చేత ఆచరణలు అంగీకరించబడే నియమాన్ని గురించి అతనికి తెలియజేశారు: అల్లాహ్ కార్యాలను అంగీకరించడు, అవన్నీ కేవలం అల్లాహ్ కొరకు, మరియు ఇతరులను పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన ఆయనకు (అల్లాహ్’కు) భాగస్వాములను చేయకుండా ఆచరిస్తే తప్ప.

فوائد الحديث

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల చిత్తశుద్ధితో మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం ప్రకారం చేసే పనులను తప్ప అల్లాహ్ ఏ పనులను అంగీకరించడు.

ఒక ముఫ్తీ తన ఫత్వాను, ప్రశ్నించిన వ్యక్తి యొక్క ఉద్దేశ్యాన్ని సంబోధిస్తూ, అతను ప్రశ్నించిన దానికి మించి సమాధానం ఇవ్వడానికి కృషి చేయాలి; ఇది ఒక మంచి మార్గం.

దాని గురించిన ప్రశ్నను పునరావృతం చేయడం ద్వారా విషయం యొక్క ప్రాధాన్యత, గొప్పదనం నిర్ధారించబడుతుంది.

నిజమైన ముజాహిద్ అల్లాహ్ యొక్క వాక్కు సర్వోన్నతమైనదిగా ఉండటానికి కృషి చేస్తాడు మరియు చిత్తశుద్ధితో పరలోకంలో లభించే ప్రతిఫలాన్ని మరియు బహుమతిని కోరుకుంటాడు, అతని ప్రయత్నం, శ్రమ, ప్రయాస ఈ లోకం కొరకు అయిఉండదు.

التصنيفات

హృదయము యొక్క కార్యల ప్రాముఖ్యతలు