హృదయము యొక్క కార్యల ప్రాముఖ్యతలు

హృదయము యొక్క కార్యల ప్రాముఖ్యతలు

1- “నిశ్చయంగా ‘హలాల్’ ఏమిటో (ఏమి అనుమతించ బడినదో) స్పష్టం చేయబడినది మరియు నిశ్చయంగా ‘హరామ్’ ఏమిటో (ఏమి నిషేధించబడినదో) స్పష్టం చేయబడినది*. మరియు ఆ రెంటికి మధ్య ఉన్నవి సందిగ్ధ విషయాలు. వాటి గురించి ప్రజలలో చాలా మందికి (సరియైన) ఙ్ఞానము లేదు. ఎవరైతే సందిగ్ధ విషయాల నుండి దూరంగా ఉన్నాడో అతడు, తన ధర్మాన్ని గురించి బాధ్యతను మరియు తన గౌరవాన్ని స్పష్ట పరుచుకున్నాడు. మరియు ఎవరైతే సందిగ్ధ విషయాలలో పడిపోయాడో అతడు – ప్రవేశం నిషేధించబడిన పొలం గట్టున పశువులను మేపుతున్న పశువుల కాపరి యొక్క పశువులు, ఏదో క్షణంలో పొలం లోనికి వెళ్ళి పోయినట్లుగా – అతడు ‘హరామ్’ లో పడిపోతాడు. గుర్తుంచుకోండి, ప్రతి రాజుగారికి ఒక రక్షిత పొలం (భూమి) ఉంటుంది. గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క రక్షిత పొలం (భూమి) ఏమిటంటే, ఆయన నిషేధించిన విషయాలు. మరియు గుర్తుంచుకోండి, శరీరంలో ఒక మాంసం ముద్ద ఉన్నది. అది ఆరోగ్యవంతంగా ఉంటే, మిగతా శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒకవేళ అది కలుషితమై పోతే (చెడిపోతే) శరీరం మొత్తం కలుషితమై పోతుంది. అదే అతడి ‘గుండె’.

6- “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ప్రతిఫలం మరియు కీర్తి కోసం యుద్ధానికి వెళ్ళే వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అతను ఏమి పొందుతాడు?” దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “అతని కొరకు ఏమీ లేదు” అన్నారు. అతడు అదే ప్రశ్నను మూడు సార్లు అడిగాడు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లూ “అతని కొరకు ఏమీ లేదు” అని జవాబిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @“అల్లాహ్ కేవలం తనకొరకు, చిత్తశుద్ధితో చేసే పనిని తప్ప మరే పనిని అంగీకరించడు”.