“మీరు అల్లాహ్ పై ‘తవక్కల్’ (భరోసా) ఉంచవలసిన విధంగా ‘తవక్కల్’ కలిగి ఉంటే, ఆయన పక్షులకు ప్రసాదించిన విధంగా మీకూ…

“మీరు అల్లాహ్ పై ‘తవక్కల్’ (భరోసా) ఉంచవలసిన విధంగా ‘తవక్కల్’ కలిగి ఉంటే, ఆయన పక్షులకు ప్రసాదించిన విధంగా మీకూ రిజ్’ఖ్ ను (ఉపాధిని) ప్రసాదిస్తాడు. అవి ఉదయం తమ గూళ్ళ నుండి ఆకలితో బయలు దేరుతాయి, సాయంత్రం నిండిన పొట్టలతో సంతృప్తిగా తిరిగి వస్తాయి.”

ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా ఆయన విన్నారు: “మీరు అల్లాహ్ పై ‘తవక్కల్’ (భరోసా) ఉంచవలసిన విధంగా ‘తవక్కల్’ కలిగి ఉంటే, ఆయన పక్షులకు ప్రసాదించిన విధంగా మీకూ రిజ్’ఖ్ ను (ఉపాధిని) ప్రసాదిస్తాడు. అవి ఉదయం తమ గూళ్ళ నుండి ఆకలితో బయలు దేరుతాయి, సాయంత్రం నిండిన పొట్టలతో సంతృప్తిగా తిరిగి వస్తాయి.”

[దృఢమైనది]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధిస్తున్నారు – ప్రాపంచిక వ్యవహారాలలో గానీ లేక ధర్మానికి సంబంధించిన వ్యవహారాలలో గాని - ప్రయోజనం పొందేందుకు, కీడును లేక హాని కలుగజేసే వాటిని దూరం చేసేందుకు - మనం అన్ని వేళలా అల్లాహ్ పై ‘తవక్కల్’ను (దృఢమైన సంపూర్ణ నమ్మకాన్ని, భరోసాను) కలిగి ఉండాలి. ఎందుకంటే, ఎవరూ కూడా దేనినీ ప్రసాదించలేరు, దేనినీ ఆపి ఉంచలేరు, హాని కలిగించలేరు లేదా ప్రయోజనం కలిగించలేరు, కేవలం పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తప్ప. ఇంకా ఇలా తెలియజేస్తున్నారు – ప్రయోజనం పొందడానికి లేదా కీడును, హానిని దూరం చేయడానికి వినియోగించే వనరులను, సాధనాలను, విధానాలను అల్లాహ్ నందు పూర్తి ‘తవక్కల్’తో (సంపూర్ణ విశ్వాసముతో, నమ్మకముతో, భరోసాతో) వినియోగించాలి. మనం ఎపుడైతే అలా చేస్తామో, పక్షులకు ప్రసాదించిన మాదిరిగా అల్లాహ్ మనకూ రిజ్’ఖ్ ను (ఉపాధిని) ప్రసాదిస్తాడు; ఎలాగైతే అవి ఉదయం తమ గూళ్ళ నుండి ఆకలితో బయలుదేరి, సాయంత్రం నిండిన పొట్టలతో సంతృప్తిగా తిరిగి వస్తాయో ఆ విధంగా. పక్షుల యొక్క ఈ చర్య ఉపాధిని పొందడానికి తగిన సాధనాలను వినియోగించాలి అనడానికి ఒక ఉదాహరణ, అంతే గానీ కేవలం భరోసాతో సోమరిపోతుగా ఉండి పోవడం తగదు.

فوائد الحديث

ఈ హదీసులో, ఉపాధి పొందే సాధనాలలో, ‘తవక్కల్’ కలిగి ఉండడం అనేది (అల్లాహ్ పై సంపూర్ణమైన నమ్మకం, భరోసా, విశ్వాసం కలిగి ఉండడం అనేది) అన్నింటికన్నా ఉత్తమమైన మాధ్యమం అని తెలుస్తున్నది. ఇందులో ఆ మాధ్యమం యొక్క ఘనత స్పష్టం అవుతున్నది.

ఇంకా ఈ హదీసులో, అల్లాహ్ పై ‘తవక్కల్’ కలిగి ఉండడం అనేది, ఉపాధిని పొందడానికి, సాధించడానికి అవసరమైన మాధ్యమాలను, సాధనాలను వినియోగించడాన్ని వ్యతిరేకించదు అని తెలుస్తున్నది; నిజానికి స్వచ్ఛమైన ‘తవక్కల్’ అనేది ‘ఉపాధిని’ (రిజ్’ఖ్ ను) పొందడానికి ఉదయం ఇంటి నుండి బయలుదేరడాన్ని ఎప్పుడూ వ్యతిరేకించదు కదా.

షరియత్, హృదయం యొక్క ఆచరణల పట్ల శ్రద్ధ వహిస్తుంది. ఎందుకంటే ‘తవక్కల్’ అనేది (అల్లాహ్ పై పూర్తి నమ్మకం, భరోసా, విశ్వాసం కలిగి ఉండి, ఆయనపై ఆధార పడడం అనేది) హృదయానికి సంబంధించినది.

ఎవరైనా, కేవలం ప్రాపంచిక మాధ్యమాలు, సాధనాలు, వనరులు మరియు విధానాలనే నమ్ముకోవడం, వాటినే అంటిపెట్టుకుని ఉండడం అనేది ధార్మికంగా అతనిలోని లోపం; అలాగే, ప్రాపంచిక సాధనాలను పూర్తిగానే వదిలివేయడం అనేది అతడి తార్కికతలోని లోపం.

التصنيفات

హృదయము యొక్క కార్యల ప్రాముఖ్యతలు