ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో ఉన్నప్పుడు, మేము బలమైన యువకులుగా ఉండేవాళ్ళం, మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి…

ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో ఉన్నప్పుడు, మేము బలమైన యువకులుగా ఉండేవాళ్ళం, మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి ముందు ఈమాన్ గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత మేము ఖుర్ఆన్ నేర్చుకున్నాము, దాని ద్వారా మా ఈమాన్ మరింత అధికమయ్యింది

జుందుబ్ ఇబ్న్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో ఉన్నప్పుడు, మేము బలమైన యువకులుగా ఉండేవాళ్ళం, మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి ముందు ఈమాన్ గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత మేము ఖుర్ఆన్ నేర్చుకున్నాము, దాని ద్వారా మా ఈమాన్ మరింత అధికమయ్యింది.

[ప్రామాణికమైన హదీథు] [ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:]

الشرح

జుందుబ్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నప్పుడు, యుక్తవయస్సుకు చేరువలో ఉన్న బలమైన, దృఢమైన యువకులం. మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి ముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఈమాన్ నేర్చుకున్నాము. ఆ తర్వాత మేము ఖుర్ఆన్ నేర్చుకున్నాము; దాని ద్వారా మా ఈమాన్ మరింత బలపడింది.

فوائد الحديث

ఈమాన్ (విశ్వాసం) పెరుగుతుంది మరియు తగ్గుతుంది అని స్పష్టమవుతున్నది.

పిల్లల పెంపకంలో ప్రాధాన్యతలను క్రమబద్ధం చేయడం, వారిని ఈమాన్ (విశ్వాసం)తో నింపడం పట్ల శ్రద్ధ వహించడం స్పష్టమవుతున్నది.

ఖుర్ఆన్ విశ్వాసమును పెంచుతుంది, దానితో హృదయం ప్రకాశిస్తుంది, మరియు మనస్సు విశాలమౌతుంది.

التصنيفات

ఖుర్ఆన్ చదివే పద్దతులు మరియు దాని ప్రచారం., ఈమాను విశ్వాసం పెరగడం మరియు తరగడం .