“మీ వస్త్రాలలో తెల్లని వస్త్రాలను ధరించండి, ఎందుకంటే అవి మీ దుస్తులలో ఉత్తమమైనవి; మరియు మీ మృతుడిని వాటితో…

“మీ వస్త్రాలలో తెల్లని వస్త్రాలను ధరించండి, ఎందుకంటే అవి మీ దుస్తులలో ఉత్తమమైనవి; మరియు మీ మృతుడిని వాటితో కప్పండి

అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “మీ వస్త్రాలలో తెల్లని వస్త్రాలను ధరించండి, ఎందుకంటే అవి మీ దుస్తులలో ఉత్తమమైనవి; మరియు మీ మృతుడిని వాటితో కప్పండి."

[దృఢమైనది]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పురుషులు తెల్లటి దుస్తులు ధరించాలని మరియు చనిపోయిన వారిని వాటితో కప్పాలని ఆదేశించారు, ఎందుకంటే నిశ్చయంగా అవి ఉత్తమమైన దుస్తులలో ఉన్నాయి.

فوائد الحديث

తెల్లని దుస్తులు ధరించాలనే ప్రొత్సాహం ఉన్నది, అయితే ఇతర వర్ణాల వస్త్రాలు ధరించుట కూడా అనుమతించబడినది.

చనిపోయిన వారిని తెల్లటి వస్త్రాలతో కప్పాలని సిఫార్సు చేయబడినది.

అల్-షౌకానీ ఇలా అన్నారు: ఈ హదీసు తెల్లని దుస్తులు ధరించడానికి మరియు దానిలో చనిపోయిన వారిని కప్పడానికి అనుమతిని సూచిస్తున్నది; ఎందుకంటే ఇది ఇతర వర్ణాల కంటే స్వచ్ఛమైనది మరియు మరింత ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. తెల్లని దుస్తులు మరింత ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉంటాయి అనే విషయానికి వస్తే, అది స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది; మరి వాటి స్వచ్ఛత విషయానికి వస్తే దానిపై ఒక చిన్నపాటి కల్మషం లేక మరక పడినా అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

التصنيفات

వస్త్రములు ధరించే పద్దతులు