"ఎవరైతే 'నేను అల్లాహ్‌ను నా ప్రభువుగా, ఇస్లాం‌ను నా ధర్మంగా, ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా…

"ఎవరైతే 'నేను అల్లాహ్‌ను నా ప్రభువుగా, ఇస్లాం‌ను నా ధర్మంగా, ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా స్వీకరించాను' అని పలుకుతారో, వారికి స్వర్గం నిశ్చయం."

అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే 'నేను అల్లాహ్‌ను నా ప్రభువుగా, ఇస్లాం‌ను నా ధర్మంగా, ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా స్వీకరించాను' అని పలుకుతారో, వారికి స్వర్గం నిశ్చయం."

[దృఢమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపినారు: "ఎవరైతే [నేను అల్లాహ్‌ను - నా ప్రభువుగా, ఆరాధ్యుడిగా, పోషకుడిగా, సర్వాధికారిగా, యజమానిగా, నన్ను సరిదిద్దేవాడిగా మనస్పూర్తిగా (రజా) అంగీకరిస్తున్నాను; ఇస్లాం ధర్మాన్ని — దాని అన్ని ఆజ్ఞలు, నిషేధాలతో సహా — నా ధర్మంగా, నా మార్గంగా, నా విశ్వాసంగా, సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను; అలాగే ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా, సందేశహరుడిగా, ఆయన తెచ్చిన ప్రతీ విషయాన్ని, ప్రకటించిన ప్రతీ సందేశాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను'] అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో, అతనికి తప్పకుండా స్వర్గం లభిస్తుంది."

فوائد الحديث

ఇందులో ఈ దుఆ పలకమని ప్రజలను ప్రోత్సహించడం మరియు దాని ఫలితంగా వచ్చే ప్రతిఫలాన్ని వివరించడం జరిగింది.

అల్లాహ్ ను ప్రభువుగా భావించి సంతృప్తి చెందడం అంటే ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు, ఆయన పరమ పవిత్రుడు.

ఒక ప్రవక్తగా మరియు సందేశహరుడిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల సంతృప్తి చెందడం అంటే ఆయనకు విధేయత చూపడం, అల్లాహ్ ఆయనను ఆశీర్వదించాలని దరూద్ పంపడం ద్వారా ఆయన కొరకు దుఆ చేయడం మరియు ఆయన సున్నతులకు విధేయత చూపడం.

ఇస్లాంను ఒక ధర్మంగా స్వీకరించడం అంటే అల్లాహ్ తన దాసుల కోసం ఎంపిక చేసిన దానిని స్వీకరించడం.

ఇతర హదీథులలో ప్రస్తావించబడినట్లుగా, అదాన్ పిలుపు విన్న తర్వాత విశ్వాసం యొక్క రెండు సాక్ష్యాలను పలికి, ఈ ప్రార్థన కూడా చేయాలని సిఫార్సు చేయబడింది.

ఈ ప్రార్థనను ఉదయం మరియు సాయంత్రం పలకడం యొక్క ఆవశ్యకతను మరొక హదీథు పేర్కొన్నది.

التصنيفات

అన్ని దుఆలు