“నిశ్చయంగా మీ పేర్లలో అల్లాహ్ వద్ద అత్యంత ఇష్టమైన, ప్రియమైన పేర్లు ‘అబ్దుల్లాహ్’ మరియు ‘అబ్దుర్రహ్మాన్’.

“నిశ్చయంగా మీ పేర్లలో అల్లాహ్ వద్ద అత్యంత ఇష్టమైన, ప్రియమైన పేర్లు ‘అబ్దుల్లాహ్’ మరియు ‘అబ్దుర్రహ్మాన్’.

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “నిశ్చయంగా మీ పేర్లలో అల్లాహ్ వద్ద అత్యంత ఇష్టమైన, ప్రియమైన పేర్లు ‘అబ్దుల్లాహ్’ మరియు ‘అబ్దుర్రహ్మాన్’.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో, అల్లాహ్ వద్ద మగపిల్లల కొరకు అత్యంత ఇష్టమైన పేర్లు ‘అబ్దుల్లాహ్’ మరియు ‘అబ్దుర్రహ్మాన్’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేస్తున్నారు.

فوائد الحديث

ఇమాం ఖుర్తుబి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ రెండింటినీ పోలిన పేర్లైన ‘అబ్దుర్-రహీం, ‘అబ్దుల్-మాలిక్, మరియు ‘అబ్దుల్-సమద్’ కూడా ఉన్నాయి. ఈ పేర్లు అన్నీ అల్లాహ్ కు అత్యంత ప్రియమైనవి ఎందుకంటే అవి అల్లాహ్ కు తప్పనిసరి అయిన ఒక లక్షణాన్ని (సిఫత్’ను) మరియు మానవులకు తప్పనిసరి అయిన ఒక లక్షణాన్ని(సిఫత్’ను) మిళితం చేస్తాయి - అదే అల్లాహ్ యొక్క దాస్యం. ఆ తరువాత దాసుడు నిజమైన అనుబంధములో తన ప్రభువుకు ఆపాదించబడుతున్నాడు. ఆ విధంగా ఈ కూర్పు ఈ పేర్లను సత్యమైనవిగా, గౌరవనీయమైనవిగా చేస్తుంది, తద్వారా ఈ కూర్పు యోగ్యతను పొందుతుంది. మరికొందరు ఇలా అన్నారు: ఈ రెండు పేర్లను పేర్కొనడం వెనుక ఉన్న హేతువు ఏమిటంటే, ఖురాన్‌లో, అల్లాహ్ పేర్లు అనేకం ఉన్నాయి. వాటన్నింటిలో "అబ్ద్" (దాసుడు) అనే ఆపాదింపు ఈ రెండింటికి మాత్రమే ఉన్నది. ఖుర్’ఆన్’లో సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు: {وَأَنَّهُ ‌لَمَّا ‌قَامَ عَبْدُ اللَّهِ يَدْعُوهُ} [వ అన్నహు లమ్మా ఖామ అబ్దుల్లాహి యద్’ఊహు - మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ యొక్క దాసుడు (అబ్దుల్లాహ్) (ము'హమ్మద్‌) ఆయన ప్రార్థించటానికి నిలబడినప్పుడు…] (సూరహ్ అల్ జిన్న్ 72:72:19) ఈ ఆయతులో “అబ్దుల్లాహ్” అనే పేరు ఉన్నది; అలాగే మరొక సూరాలో అల్లాహ్ ఇలా అంటున్నాడు: {وَعِبَادُ ‌الرَّحْمَنِ} [వ ఇబాదుర్రహ్మాని - మరియు వారే, అనంత కరుణామయుని దాసులు...] (సూరహ్ అల్ ఫుర్ఖాన్ 25:63) ఈ ఆయతులో “అబ్దుర్రహ్మాన్” అనే పేరు యొక్క బహువచనం “ఇబాదుర్రహ్మాన్” ఉన్నది. మరొక సూరాలో అల్లాహ్ ఒక ఆయతులో ఈ విధంగా అవతరింపజేయడం ఈ పరిశీలనకు మరింత బలం చేకూరుస్తున్నది - { ‌قُلِ ‌ادْعُوا ‌اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَنَ} [ఖులిద్’ఊ అల్లాహ్ ఇవిద్’ఊ అర్రహ్మాన్ - “వారితో అను: ''మీరు ఆయనను, 'అల్లాహ్‌!' అని పిలవండీ, లేదా 'అనంత కరుణామయుడు (అర్ర'హ్మాన్‌)!' అని పిలువండీ....] (సూరహ్ అల్ ఇస్రా 17:110)

التصنيفات

జన్మించిన పిల్లవాడి ఆదేశాలు