“మీలో ఏమనిషి కూడా అతడు సత్యమేమిటో చూసి ఉండీ, లేదా సత్యమేమిటో తెలిసి ఉండీ, అతడు సత్యాన్ని మాట్లాడకుండా ప్రజల భయం…

“మీలో ఏమనిషి కూడా అతడు సత్యమేమిటో చూసి ఉండీ, లేదా సత్యమేమిటో తెలిసి ఉండీ, అతడు సత్యాన్ని మాట్లాడకుండా ప్రజల భయం అతడిని నిరోధించరాదు.”

అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “మీలో ఏమనిషి కూడా అతడు సత్యమేమిటో చూసి ఉండీ, లేదా సత్యమేమిటో తెలిసి ఉండీ, అతడు సత్యాన్ని మాట్లాడకుండా ప్రజల భయం అతడిని నిరోధించరాదు.”

[దృఢమైనది] [رواه الترمذي وابن ماجه وأحمد]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహచరులకు ఒక ఉపన్యాసం ఇచ్చారు అందులో ఆయన(స) సిఫార్సు చేసిన విషయాలలో ప్రజల భయం, భీతి మరియు వారి శక్తి ఒక ముస్లిం సత్యాన్ని చూసి ఉన్నా లేదా సత్యమేమితో అతనికి తెలిసినా సత్యాన్ని మాట్లాడకుండా లేదా ఆజ్ఞాపించకుండా, అవి అతనికి నిరోధము కారాదని అన్నారు.

فوائد الحديث

ఇందులో - ప్రజలకు భయపడి సత్యాన్ని దాచిపెట్టకుండా, సత్యాన్ని వెల్లడించమని ప్రజలను ప్రోత్సహించడం ఉన్నది.

నిజం చెప్పడం అంటే మర్యాద, జ్ఞానం మరియు మంచి సలహాలను విస్మరించడం కాదు.

అల్లాహ్‌ను వ్యతిరేకించే ప్రజల యొక్క ప్రయోజనాల కంటే ఆయన హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం, చెడును ఖండించడం విధి.

التصنيفات

మంచి గురించి ఆదేశం మరియు చెడు నుండి వారించటం యొక్క ఆదేశం