"ఎవరి వద్దనైనా (బక్రీద్ పండుగ నాడు) ఖుర్బానీ చేయడానికి ఒక పశువు ఉంటే , దుల్ హజ్ నెలవంక (హిలాల్) కనిపించిన తర్వాత,…

"ఎవరి వద్దనైనా (బక్రీద్ పండుగ నాడు) ఖుర్బానీ చేయడానికి ఒక పశువు ఉంటే , దుల్ హజ్ నెలవంక (హిలాల్) కనిపించిన తర్వాత, తన ఖుర్బానీ పూర్తి చేసే వరకు అతడు తన వెంట్రుకలు లేదా గోర్ల నుండి ఏదీ కత్తిరించకూడదు."

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర భార్య ఉమ్ముల్ ముమినీన్ ఉమ్మె సలమా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఎవరి వద్దనైనా (బక్రీద్ పండుగ నాడు) ఖుర్బానీ చేయడానికి ఒక పశువు ఉంటే , దుల్ హజ్ నెలవంక (హిలాల్) కనిపించిన తర్వాత, తన ఖుర్బానీ పూర్తి చేసే వరకు అతడు తన వెంట్రుకలు లేదా గోర్ల నుండి ఏదీ కత్తిరించకూడదు."

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్బానీ చేయాలని సంకల్పం చేసుకున్న వారికి ఇలా ఆదేశించారు: "ఎవరైతే ఖుర్బానీ (ఉద్దియ్యా) చేయాలనుకుంటున్నారో, దుల్-హిజ్జహ్ నెలవంక కనిపించిన తర్వాత, తన ఖుర్బానీ పూర్తి చేసే వరకు: తన తల వెంట్రుకల నుండి, చంకల క్రింద పెరిగే వెంట్రుకల నుండి, మీసం నుండి, శరీరంలోని ఇతర ప్రాంతాలలోని అంటే మర్మాంగాలు మొదలైన చోట పెరిగే వెంట్రుకల నుండి, చేతి/కాళ్ల గోర్ల నుండి ఏమీ తీయకూడదు."

فوائد الحديث

ఖుర్బానీ (ఉద్దియ్యా) చేయాలని నిర్ణయించిన వ్యక్తి కోసం ప్రకటించబడిన నియమాలు: "ఎవరైతే దుల్-హిజ్జహ్ యొక్క మొదటి 10 రోజులు మొదలైన తర్వాత ఖుర్బానీ చేయాలని నిర్ణయించుకుంటారో, వారు ఆ నిర్ణయం తీసుకున్న సమయం నుండి ఖుర్బానీ పూర్తి చేసే వరకు: తమ వెంట్రుకలు కత్తిరించకూడదు, గోర్లు కత్తిరించకూడదు, చర్మం నుండి ఏదీ తొలగించకూడదు లేదా కత్తిరించకూడదు (షరియతు మినహాయించిన స్థితిలో తప్ప)

"ఎవరైతే ఈదుల్ అద్హా (10 దుల్-హిజ్జహ్) దినమున ఖుర్బానీ చేయలేదో, వారు 'అయ్యామే తష్రీక్' (11, 12, 13 దుల్-హిజ్జహ్) దినాలలో తమ ఖుర్బానీని పూర్తి చేసే వరకు తమ వెంట్రుకలు, గోర్లు తీయకుండా ఉండాలి."

التصنيفات

ఖుర్బానీలు