మీరు అనునిత్యం చేయగలిగే ఒక ఆచరణను ఎంచుకొండి; అల్లాహ్ సాక్షిగా, మీరు (మంచి పనులు చేయడంలో) అలసిపోనంత వరకు అల్లాహ్…

మీరు అనునిత్యం చేయగలిగే ఒక ఆచరణను ఎంచుకొండి; అల్లాహ్ సాక్షిగా, మీరు (మంచి పనులు చేయడంలో) అలసిపోనంత వరకు అల్లాహ్ కూడా (ప్రతిఫలం ప్రసాదించడంలో) అలసిపోడు

విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉండగా ‘అల్ హౌలాఅ బింత్ తువైత్ ఇబ్న్ హబీబ్ ఇబ్న్ అబ్దిల్ ఊజ్జా’ నా వద్దకు వచ్చి వెళ్ళినది. నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో “ఆమె హౌలాఅ బింత్ తువైత్, ఆమె రాత్రుళ్లు (ఇబాదత్’లో) అసలు నిద్రపోదు అని ఆమెను గురించి చెప్పుకుంటారు” అన్నాను. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “: “ఓహ్, ఆమె (ఇబాదత్’లో) రాత్రిపూట నిద్రపోదా! మీరు అనునిత్యం చేయగలిగే ఒక ఆచరణను ఎంచుకొండి; అల్లాహ్ సాక్షిగా, మీరు (మంచి పనులు చేయడంలో) అలసిపోనంత వరకు అల్లాహ్ కూడా (ప్రతిఫలం ప్రసాదించడంలో) అలసిపోడు."

[ప్రామాణికమైన హదీథు] [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]

الشرح

ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వసుల మాతృమూర్తి అయిన) ఆయిషా రదియల్లాహు అన్హా, అల్ హౌలాఅ బింత్ తువైత్ రదియల్లాహు అన్హాతో ఉన్నపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాగానే ఆమె అక్కడి నుండి లేచి వెళ్ళిపోయినది. ఆయిషా రదియల్లాహు అన్హా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు: “ఈ స్త్రీ రాత్రి నిద్రపోదు, రాత్రంతా ఇబాదత్’లో గడిపేస్తుంది”. అపుడు ఆమె తనపై తాను చాలా కఠినంగా ఉండటాన్ని ఖండిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఆమె రాత్రిపూట నిద్రపోదా! మీరు క్రమం తప్పకుండా చేయగలిగినంత వరకు మాత్రమే సత్కార్యాలలో (ఇబాదాత్’లలో) పాల్గొనండి. అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ తన సద్గుణవంతులైన, విధేయులైన దాసులకు వారి విధేయత, మంచి పనులు మరియు సద్గుణ చర్యలకు ప్రతిఫలం ఇవ్వడంలో అలసిపోడు, వారు అలసిపోయి వాటిని చేయడం మానేసే వరకు.

فوائد الحديث

శరీరం భరించగలిగిన దానికంటే ఎక్కువ ఆరాధన విసుగు మరియు అలసటకు దారితీస్తుంది, ఫలితంగా ఆత్మ ఆ ఆచరణను వదిలివేస్తుంది.

ఆరాధనలను (ఇబాదాత్’లను) ఆచరించడంలో మితంగా ఉండటం మరియు సమతుల్యత పాటించడం నిరంతరం వాటి కొనసాగింపుకు మరియు వాటి ఆచరణకు దృఢంగా కట్టుబడి ఉండటానికి దారితీస్తుంది.

అడపాదడపాగా చేసే పెద్ద ఆచరణ కంటే, స్థిరంగా, నిరంతరంగా చేసే చిన్న ఆచరణ మంచిది.

ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “నిలకడగా, నిరంతరంగా కొనసాగించే ఒక చిన్న ఆరాధన (ఇబాదత్), భారమైన పెద్ద ఇబాదత్ వలే కాకుండా, అల్లాహ్ యొక్క స్మరణ (జిక్ర్) ద్వారా, ధర్మము పట్ల అవగాహన సాధనకు, నిజాయితీగా ఆ ఇబాదత్’ను నిరంతరం కొనసాగించడం మరియు అల్లాహ్ పట్ల తఖ్వాహ్’ల ద్వారా అల్లాహ్ పట్ల నిరంతర విధేయతకు దారితీస్తుంది. ఇది కష్టతరమైన మరియు భారమైన ఇబాదత్’కు భిన్నమైనది. వాస్తవానికి స్థిరంగా ఆచరించే చిన్న ఆచరణ, అప్పుడప్పుడు ఆచరించే పెద్ద ఆచరణలను అనేకరెట్లు అధిగమిస్తుంది.”

التصنيفات

ఇస్లాంలో మానవుని హక్కులు