. .

అల్లాహ్ పట్ల ఉథ్మాన్ రదియల్లాహు అన్హు భయభక్తుల గురించి హానీ మౌలా ఉథ్మాన్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖన: "ఉథ్మాన్ రదియల్లాహు అన్హు ఒక సమాధి దగ్గర నిలబడి, ఎంత ఎక్కువగా ఏడ్చినారంటే, (కన్నీళ్ళకు) ఆయన గడ్డం కూడా తడిసిపోయింది. అది చూసి వారిని ఇలా అడిగినారు: 'మీరు స్వర్గం, నరకం గురించి విన్నప్పుడు అంతగా ఏడవరు, కాని సమాధిని చూసి మాత్రం ఏడుస్తున్నారు?' దానికి ఉథ్మాన్ రదియల్లాహు అన్హు ఇలా చెప్పారు: 'ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికి ఉన్నారు: "నిశ్చయంగా సమాధి పరలోక ప్రయాణంలోని మెట్టు. ఇక్కడ (అల్లాహ్ శిక్ష నుండి) రక్షించబడితే, తర్వాతి దశలు సులభంగా ఉంటాయి. ఇక్కడ రక్షించబడకపోతే, తర్వాతి దశలు చాలా కఠినంగా ఉంటాయి."

[ప్రామాణికమైనది]

الشرح

అమీరుల్ ముమినీన్ ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు ఒకవేళ సమాధి దగ్గర ఆగినట్లయితే, ఆయన ఎంతో ఏడ్చేవారు. కన్నీళ్లు అంత ఎక్కువగా కారడం వలన ఆయన గడ్డ కూడా తడిసిపోయేది. దానికి అక్కడి వారిలో కొందరు ఆయనను ఇలా అడిగారు: "మీరు స్వర్గం గురించి లేదా నరకం గురించి విన్నప్పుడు, (స్వర్గశుభాల సంతోషంతో) ఆనంద భాష్పాలు రాల్చడమో, లేదా నరక భయంతో ఏడవడమో చేయరు! కానీ సమాధిని చూసి మాత్రం ఏడుస్తున్నారు?" అవుడు ఉథ్మాన్ రదియల్లాహు అన్హు సమాధి గురించి ఇలా చెప్పినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: 'సమాధి పరలోక ప్రయాణంలో మొదటి మెట్టు. ఇక్కడ (అల్లాహ్ శిక్ష నుండి) రక్షించబడితే, తర్వాతి దశలు సులభంగా ఉంటాయి. ఇక్కడ రక్షించబడకపోతే, తర్వాతి దశల్లో వచ్చే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.'"

فوائد الحديث

ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు ముందుగానే స్వర్గ ప్రవేశం యొక్క శుభవార్త ఇవ్వబడిన వారిలో ఒకరైనా గానీ, ఆయనలో అల్లాహ్ పట్ల భయభక్తులు ఎంత ఎక్కువగా ఉండేవో, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది.

బయటికి కనపడేలా సమాధి శిక్షలు మరియు పునరుత్థాన దినం గురించి ఆలోచిస్తూ ఏడవడం ఇస్లాం ధర్మంలో అనుమతించబడింది.

సమాధిలో సుఖం, శిక్ష రెండూ నిర్ధారించబడినాయి.

సమాధి శిక్ష గురించి హెచ్చరిక

التصنيفات

సమాధుల భయానక పరిస్థితులు