“నిద్రలో మంచి దృశ్యాన్ని చూడడం అల్లాహ్ వైపు నుండి అయి ఉంటుంది; కనుక నిద్రలో మీరు భయపడే, లేదా భయం కలిగించే కల…

“నిద్రలో మంచి దృశ్యాన్ని చూడడం అల్లాహ్ వైపు నుండి అయి ఉంటుంది; కనుక నిద్రలో మీరు భయపడే, లేదా భయం కలిగించే కల ఏదైనా చూసినట్లయితే అతడు తన ఎడమ వైపునకు ఉమ్మివేయాలి మరియు దాని కీడు నుండి అల్లాహ్ యొక్క శరణు, రక్షణ కోరుకోవాలి; అపుడు అది అతనికి ఎలాంటి నష్టాన్నీ కలుగజేయదు.”

అబూ ఖతాదహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిద్రలో మంచి దృశ్యాన్ని చూడడం అల్లాహ్ వైపు నుండి అయి ఉంటుంది; కనుక నిద్రలో మీరు భయపడే, లేదా భయం కలిగించే కల ఏదైనా చూసినట్లయితే అతడు తన ఎడమ వైపునకు ఉమ్మివేయాలి మరియు దాని కీడు నుండి అల్లాహ్ యొక్క శరణు, రక్షణ కోరుకోవాలి; అపుడు అది అతనికి ఎలాంటి నష్టాన్నీ కలుగజేయదు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: కలలో మనసును ఆహ్లాదపరిచే దృశ్యం చూడడం అనేది అల్లాహ్ వైపునుండి అయి ఉంటుంది. అలాగే ఏ మాత్రమూ ఇష్టపడని, కలవరపరిచే, విచారానికి గురిచేసే దృశ్యాలు కలలో కనపడడం అది షైతాను వైపు నుంచి అయి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కలలో తనకు అసహ్యంగా అనిపించే, తాను ఇష్టపడని దృశ్యాన్ని చూసినట్లయితే అతడు తన ఎడమ వైపునకు ఉమ్మివేయాలి. దాని కీడునుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోవాలి. అపుడు అది అతనికి ఎలాంటి హానీ కలిగించదు. ఎందుకంటే అల్లాహ్ ఇందులో పేర్కొనబడిన విషయాన్ని, అటువంటి చెడు కలలో చూసిన తాను ఇష్టపడని విషయము యొక్క కీడు నుండి అల్లాహ్ యొక్క రక్షణ మరియు ఆయన శరణు వేడుకోవడానికి దానిని ఒక కారణంగా చేసినాడు.

فوائد الحديث

కలలో మనసును ఆహ్లాదపరిచే దృశ్యాలు - “అల్-రు’యా” ; అలాగే కలలో భయానక దృశ్యాలు, అయిష్టమైన విషయాలు - “అల్-హులుము”; ఇవి నిద్రిస్తున్న వ్యక్తి చూసే విషయాలు. అయితే “అల్-రు’యా” అనే పదం సాధారణంగా కలలో మంచి మరియు ఆహ్లాదకరమైన విషయాలు చూడడాన్ని సూచిస్తుంది; “అల్-హులుము” అనే పదం సాధారణంగా కలలో చెడు మరియు అసహ్యకరమైన విషయాలను, భయం గొలిపే విషయాలను చూడడాన్ని సూచిస్తుంది. అయితే అరబీ భాషలో ఈ రెండు పదాలు పరస్పరం ఒక దాని స్థానములో మరొకటి ఉపయోగించబడడం కూడా సాధారణమే.

“అల్-రు’యా” యొక్క రకాలు: 1 – మంచి దృశ్యం: ఇది నిజమైన కల, అల్లాహ్ తరఫు నుండి అతడు చూసే శుభవార్త అవుతుంది, లేక అతని కొరకు మరొకరు చూసిన శుభవార్త అయి ఉంటుంది. 2 – ఇది అతడు మేల్కొని ఉన్నపుడు తనకు తాను మాట్లాడుకున్న విషయాలు; 3 – ఆదాము కుమారుని దుఃఖపెట్టడానికి, భయపెట్టడానికి, భయాందోళనలకు గురి చేయడానికి మరియు అతనికి దుఃఖాన్ని కలిగించడానికి షైతాను చేసే ప్రయత్నాలు.

ఈ హదీథులో మంచి కలను గురించి ప్రస్తావించబడిన దాని ఆధారంగా, మంచి కలను చూసిన వ్యక్తి మూడు పనులు చేయాలి: అందుకొరకు అల్లాహ్ యొక్క ఘనతను స్తుతించాలి, కీర్తించాలి; దాని పట్ల సంతోషపడాలి, ఒక మంచి శకునంగా తీసుకోవాలి; మరియు దానిని గురించి తాను ఇష్టపడేవారితో మాట్లాడాలి; తాను ఇష్టపడని వారితో మాట్లాడరాదు.

(షరియత్’లో) ఇష్టపడని కలను గురించి చెప్పబడిన విషయాల సారాంశములో ఈ ఐదు విషయాలు ఉన్నాయి: ఆ కల యొక్క కీడు నుండి అల్లాహ్ యొక్క రక్షణ, శరణువేడుకోవాలి, మరియు షైతాను యొక్క కీడు నుండి అల్లాహ్ యొక్క రక్షణ, శరణు వేడుకోవాలి; అతడు నిద్ర మేల్కుంటే తన ఎడమవైపునకు మూడు సార్లు (సూచన ప్రాయంగా) ఉమ్మివేయాలి; ఆ కలను గురించి ఎవరికీ తెలియజేయ రాదు మరియు అతడు పడుకోవాలి అనుకుంటే, అతడు ఏ వైపునకు తిరిగి పడుకుని ఉండగా ఆ చెడు కల వచ్చిందో ఆ వైపునకు కాకుండా మరోవైపునకు తిరిగి పడుకోవాలి, అపుడు ఎటువంటి కీడూ కలుగదు.

التصنيفات

కల పద్దతులు