“మీలో ఎవ్వెరూ అల్లాహ్ పట్ల ఉత్తమమైన అంచనాలు కలిగి ఉన్న స్థితిలో తప్ప చనిపోకండి.”

“మీలో ఎవ్వెరూ అల్లాహ్ పట్ల ఉత్తమమైన అంచనాలు కలిగి ఉన్న స్థితిలో తప్ప చనిపోకండి.”

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “మరణానికి మూడు దినముల ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “మీలో ఎవ్వెరూ అల్లాహ్ పట్ల ఉత్తమమైన అంచనాలు కలిగి ఉన్న స్థితిలో తప్ప చనిపోకండి.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ముస్లిములకు అల్లాహ్ పట్ల ఉత్తమమైన అంచనాలను కలిగి ఉన్న స్థితిలో తప్ప చనిపోకండి అని హితబోధ చేస్తున్నారు. ముఖ్యంగా మరణ శయ్యపై ఉన్న స్థితిలో (భయం కాక) అల్లాహ్ యొక్క కరుణ, క్షమాపణ పట్ల ఆశ, విశ్వాసము అత్యున్నత స్థితిలో ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ పట్ల భయం అనేది మంచి పనులు చేయుటను వృద్ధి చేస్తుంది. కానీ మరణ శయ్యపై ఉన్న స్థితి ఆచరణలను వృద్ధి చేసుకుని సమర్పించుకునే స్థితి కాదు. కనుక ఆ స్థితిలో కావలసినది అల్లాహ్ యొక్క కరుణ మరియు క్షమాపణ పట్ల అచంచలమైన విశ్వాసము మరియు ఆశ.

فوائد الحديث

ఈ హదీథులో తన ఉమ్మత్’కు సరియైన మార్గదర్శకం చేయుట పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆసక్తి చూడవచ్చు, అలాగే తన ఉమ్మత్ పట్ల అన్ని వేళలా వారి సంవేదన, పరితాపము, దయాళుత్వము చూడవచ్చు, చివరికి వారు స్వయంగా మరణశయ్యపై ఉన్న స్థితిలో కూడా వారు తన ఉమ్మత్’కు మోక్షము పొందే మార్గాన్ని సూచిస్తున్నారు.

అత్తయ్యిబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: మంచి పనులు చేయుటను ఇప్పుడే వృద్ధి చేయుట ప్రారంభించండి, ఎందుకంటే మరణ సమయాన అవి అల్లాహ్ పట్ల మీ అంచనా, అభిప్రాయము ఉత్తమంగా ఉండేలా చేస్తాయి; అలాగే మరణానికి ముందు ఎవరి ఆచరణలు అయితే చెడుగా ఉంటాయో, అల్లాహ్ పట్ల అతని అంచనా ఉత్తమంగా ఉండదు.

ఒక దాసుని యొక్క అత్యంత పరిపూర్ణమైన స్థితి ఏమిటంటే అల్లాహ్ యొక్క కరుణ, ఆయన క్షమాపణ పట్ల ఆశ; మరియు అల్లాహ్ పట్ల భయం ఈ రెండూ సమతూకములో కలిగి ఉండి, ఆయన పట్ల ప్రేమ ఈ రెంటినీ అధిగమిస్తూ ఉన్న స్థితి. వీటిలో అల్లాహ్ పై ప్రేమ వాహనం అయితే, ఆశ ఆ ప్రయాణాన్ని నిర్వహించే మార్గదర్శి, భయం ఆ వాహనాన్ని నడిపే సారథి అయితే అల్లాహ్ తన కరుణ మరియు తన అనుగ్రహంతో అతడు తన గమ్యస్థానానికి చేరుకునేలా చేయువాడు.

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణానికి మూడు రోజుల ముందు పలికిన మాదిరిగా, మరణిస్తున్న వ్యక్తికి సమీపంలో ఉన్న ఎవరైనా అతనికి అల్లాహ్ యొక్క కరుణ మరియు అనుగ్రహం పట్ల దృఢమైన ఆశ మరియు మంచి అంచనాలను కలిగి ఉండటానికి సహాయపడాలి.

التصنيفات

హృదయాల ఆచరణలు