إعدادات العرض
ఒక ముస్లిం యొక్క ఇజార్ (థోబు, లుంగీ లేదా ప్యాంటు అంటే నడుము క్రింది భాగంలో ధరించే వస్త్రం) కనీసం కాలిపిక్క వరకు…
ఒక ముస్లిం యొక్క ఇజార్ (థోబు, లుంగీ లేదా ప్యాంటు అంటే నడుము క్రింది భాగంలో ధరించే వస్త్రం) కనీసం కాలిపిక్క వరకు ఉండాలి. ఒకవేళ అతడి మోకాలికి మరియు చీలమండలానికి మధ్య భాగంలో ఉంటే అందులో దోషం ఏమీ లేదు. కానీ చీలమండలానికి దిగువన ఉంటే (నేలపై ఈడుస్తూ ఉంటే), అది నరకంలోనికి తీసుకువెళ్తుంది. ఎవరు గర్వంతో తన లుంగీని లేదా ప్యాంటును (గర్వంతో నేలపై) ఈడుస్తారో, అల్లాహ్ అతని వైపు చూడడు
అబూ సయీద్ అల్-ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక ముస్లిం యొక్క ఇజార్ (థోబు, లుంగీ లేదా ప్యాంటు అంటే నడుము క్రింది భాగంలో ధరించే వస్త్రం) కనీసం కాలిపిక్క వరకు ఉండాలి. ఒకవేళ అతడి మోకాలికి మరియు చీలమండలానికి మధ్య భాగంలో ఉంటే అందులో దోషం ఏమీ లేదు. కానీ చీలమండలానికి దిగువన ఉంటే (నేలపై ఈడుస్తూ ఉంటే), అది నరకంలోనికి తీసుకువెళ్తుంది. ఎవరు గర్వంతో తన లుంగీని లేదా ప్యాంటును (గర్వంతో నేలపై) ఈడుస్తారో, అల్లాహ్ అతని వైపు చూడడు.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी Kurdî Português සිංහල Tiếng Việt অসমীয়া Nederlands Kiswahili Hausa ગુજરાતી Magyar ქართული Română Русскийالشرح
ప్రవక్త ముహమ్మద్ ﷺ ఒక ముస్లిం పురుషుడు తాను ధరించే ఇజార్ (అంటే, నడుము క్రింది భాగాన్ని కప్పే వస్త్రం) కు సంబంధించిన మూడు స్థితులను స్పష్టంగా వివరించారు: మొదటిది: ఇజార్‌ను మోకాళ్ల మధ్య వరకు ధరించడం ఉత్తమం; అయితే అది కాలిమడమల కంటే దిగువకు జారకూడదు. రెండవది: అనుమతించదగినది (అయితే అహంకారంతో కాకూడదు) - అది కాలిమడమ ఎముక వరకు ఉండే పొడువైన ఇజార్. మూడవది: నిషేధించబడిన స్థాయి - అంటే ఇజార్ వస్త్రం కాలిమడమ (చీలమండలం) కంటే దిగువన జారి, నేలను తాకుతూ ఉండటం. ఇటువంటి వ్యక్తి నరక అగ్నికి భయపడాలి. మరియు ఎవరైతే గర్వంతో, దురహంకారంతో ఇలా చేస్తారో, అల్లాహ్ ప్రళయ దినాన అతని వైపు చూడడు.فوائد الحديث
ఈ నియమాలు మరియు హెచ్చరికలు ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే వర్తిస్తాయి. మహిళలు ఈ నిబంధన నుండి మినహాయింపబడ్డారు, ఎందుకంటే వారి కొరకు తమ మొత్తం శరీరాన్ని కప్పి ఉంచాలనే ఆదేశం నిర్దేశించబడింది.
పురుషులు నడుము క్రింది భాగంలో ధరించే వస్త్రాన్ని 'ఇజార్' అంటారు, ఉదాహరణకు ప్యాంటు, లుంగీ, థోబు మొదలైనవి. ఇది ఈ హదీథు ద్వారా ఇస్లామీయ షరిఅహ్ ధర్మశాసనంలో చేర్చబడింది.
التصنيفات
వస్త్రములు ధరించే పద్దతులు