“ఓ అబూ దర్! నీవు ఏదైనా రసంతో కూడిన వంట వండుతుంటే, దానిలో నీటిని (నీటి శాతాన్ని) పెంచు, మరియు (వంటలో కొంత నీ…

“ఓ అబూ దర్! నీవు ఏదైనా రసంతో కూడిన వంట వండుతుంటే, దానిలో నీటిని (నీటి శాతాన్ని) పెంచు, మరియు (వంటలో కొంత నీ పొరుగువారికి ఇవ్వు) వారితో మంచిగా వ్యవహరించు

అబూ దర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ఓ అబూ దర్! నీవు ఏదైనా రసంతో కూడిన వంట వండుతుంటే, దానిలో నీటిని (నీటి శాతాన్ని) పెంచు, మరియు (వంటలో కొంత నీ పొరుగువారికి ఇవ్వు) వారితో మంచిగా వ్యవహరించు.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ దర్ అల్-గిఫారి (రదియల్లాహు అన్హు)ని ఉడకబెట్టిన పులుసు వండేటప్పుడు, దానిలో నీటిని (నీటి శాతాన్ని) మరియు దాని నిల్వను పెంచాలని మరియు అతను తన పొరుగువారిని జాగ్రత్తగా చూసుకోవాలని మరియు దానితో వారిని పరామర్శించాలని ఉద్బోధించినారు.

فوائد الحديث

ఈ హదీథులో పొరుగువారితో మంచిగా వ్యవహరించాలనే హితబోధ ఉన్నది.

ఇరుగుపొరుగు వారు కానుకలను, బహుమతులను ఇచ్చిపుచ్చుకొనుట మంచి సంప్రదాయము. ఎందుకంటే ఇది ప్రేమను ప్రోత్సహిస్తుంది మరియు ఆప్యాయతను పెంచుతుంది. ముఖ్యంగా వండిన వంట మంచి సువాసన కలిగి ఉంటే, మరియు పొరుగు వారి అవసరం తెలిసినట్లైతే, ఆ సందర్భములో ఈ మార్పిడి అనేది వారి మధ్య అవగాహనను, మంచితనాన్ని మరింతగా పెంచుతుంది.

బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ప్రోత్సహించబడుతుంది, అది చిన్నదే అయినా, ముస్లింలకు ఆనందాన్ని ఇస్తుంది.

التصنيفات

సయోధ్య మరియు ఇరుగు పొరుగు వారి ఆదేశాలు