“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన…

“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ (నీ సృష్టికర్త అయినప్పటికీ)

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ (నీ సృష్టికర్త అయినప్పటికీ), అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం, ” అన్నారు. దానిని నేను “నిశ్చయంగా అది ఘోరమైనదే” అన్నాను. తరువాత అడిగాను “(దాని) తరువాత ఏది?”; దానికి ఆయన “(నీవు తినే దానిలో) నీతో పాటు తింటాడు అనే భయంతో నీ బిడ్డను నీవు చంపడం” అన్నారు; నేను మళ్ళి అడిగాను: “దాని తరువాత ఏది?” అని. దానికి ఆయన “నీ పొరుగు వాని భార్యతో నీవు వ్యభిచరించడం” అన్నారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఘోరమైన పాపములను గురించి ప్రశ్నించడం జరిగింది, దానికి ఆయన ఇలా అన్నారు: వాటిలో అన్నింటికన్నా ఘోరమైనది “అష్’షిర్క్ అల్ అక్బర్” (పెద్ద షిర్క్); అంటే అల్లాహ్ యొక్క “ఉలూహియత్’లో” (కేవలం ఆయన మాత్రమే అన్ని ఆరాధనలకు ఏకైక నిజ ఆరాధ్యుడు అనే విషయములో); అల్లాహ్ యొక్క “రుబూబియత్”లో (కేవలం అల్లాహ్ మాత్రమే ఈ విశ్వం మొత్తానికీ ప్రభువు అనే విషయములో); మరియు అల్లాహ్ యొక్క “శుభ నామములలో”, మరియు ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన గుణగణాలలో - ఆయనకు సమానమైన వాడిగా, లేక ఆయనను పోలిన వానిగా, ఆయనకు సాటిగా మరొకరిని తీసుకు రావడం – ఇది అన్నింటికన్నా ఘోరమైన పాపము. ఈ పాపాన్ని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడు – దీనికి పాల్బడినవాడు పశ్చాత్తాపము చెందితే తప్ప. ఒకవేళ అతడు ప్రశ్చాత్తపము చెందకుండా, దానిపైనే చనిపోతే అటువంటి వాడు శాశ్వతముగా నరకములో పడి ఉంటాడు. తరువాత – తనతో పాటు తింటాడు అనే భయంతో ఒక వ్యక్తి తన బిడ్డను తానే చంపడం. ఎవరినైనా ధర్మవిరుద్ధంగా చంపడం హరాం (నిషేధము). కానీ దాని తీవ్రత ఇంకా అధికమవుతుంది ఒకవేళ హతుడు, హంతకుడి బంధువు అయినట్లయితే; దాని తీవ్రత మరింత అధికమవుతుంది అల్లాహ్ ప్రాసాదించిన ఉపాధిలో అతడు కూడా భాగస్వామి అవుతాడు అనే ఉద్దేశ్యముతో హత్య చేసినట్లయితే. తరువాత – తన పొరుగువాని భార్యను మాయమాటలు చెప్పి, చివరికి మోసపూరితంగా లోబడిపోయేలా చేసుకుని ఆమెతో వ్యభిచరించడం. (ఇస్లాం లో) వ్యభిచారం హరాం (నిషేధము). ఆ పాపము యొక్క తీవ్రత మరింతగా ఎక్కువ అవుతుంది, అది తన పొరుగువాని భార్యతో అయినట్లయితే – ఎందుకంటే షరియత్ పొరుగువాని పట్ల దయతో, అతనితో మంచినడవడితో, ఒక మంచి పొరుగువానిగా ఉండమని ఆదేశిస్తున్నది.

فوائد الحديث

ఏ విధంగానైతే సత్కార్యాలు భిన్నమైన స్థాయిలు కలిగి ఉంటాయో, పాపకార్యాలు కూడా తీవ్రతలో హెచ్చుతగ్గులు కలిగి ఉంటాయి.

ఘోరమైన పాపములు: అల్లాహ్ కు సాటి కల్పించుట, నీతో పాటు (నీ ఉపాధి నుండి) తింటాదు అనే ఉద్దేశ్యముతో నీ సంతానాన్ని నీవే చంపుట; మరియు పొరుగువాని భార్యతో వ్యభిచరించుట.

నిశ్చయంగా, జీవనోపాధి అంతా అల్లాహ్ చేతిలోనే ఉంది. సర్వలోకాలకు జీవనోపాధిని ప్రసాదించేవాడు పరమ పవితుడైన ఆయనే (అల్లాహ్’యే).

(ఇస్లాం లో) పొరుగు వాని హక్కులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. అతనికి ఏ విధంగానైనా హాని, నష్టం కలిగించడం, ఇతరులకు హాని, నష్టం కలిగించిన దాని కంటే చాలా తీవ్రమైనది.

సృష్టికర్తయైన అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు ఏకైక అర్హుడు; ఆయనకు సాటి, సమానులు ఎవరూ లేరు.

التصنيفات

తౌహీదె రుబూబియ్యత్