“అపోహలను కల్పించేవాడు స్వర్గం లోనికి ప్రవేశించడు”

“అపోహలను కల్పించేవాడు స్వర్గం లోనికి ప్రవేశించడు”

హుజైఫహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: “అపోహలను కల్పించేవాడు స్వర్గం లోనికి ప్రవేశించడు”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అపోహలను కల్పించేవాని గురించి వివరిస్తున్నారు. ‘నమీమా’ అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య (లేక రెండు సమూహాల మధ్య, రెండు జాతుల మధ్య) కలహాలు రేకెత్తించే ఉద్దేశ్యంతో ఒకరి మాటలను మరొకరికి చేరవేయుట. అలా చేయడం వలన వారి మధ్య అపోహలు ఉత్పన్నమవుతాయి. అవి కలహాలకు, తద్వారా అశాంతికి దారి తీస్తాయి. అటువంటి వారు కఠినమైన శిక్షకు పాత్రులు. స్వర్గంలోనికి ప్రవేశించడానికి అర్హులు కారు.

فوائد الحديث

ఒకరి గురించి అపోహలు రేకెత్తేలా అపవాదులు మాట్లాడుట (అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పుట) ఘోరమైన పాపములలో (అల్ కబాయిర్ లలో) ఒకటి.

‘నమీమా’ నిషేధించబడినది. ఎందుకంటే అది వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య, జాతుల మధ్య కలుగజేసే అరాచకం, హాని ఎక్కువ కనుక.

التصنيفات

దుర్గుణాలు