إعدادات العرض
“ఒక స్త్రీ తన భర్త కొరకు తప్ప, మరింకే చనిపోయిన వ్యక్తి కొరకు కూడా మూడు దినముల కంటే ఎక్కువ దుఃఖించరాదు. ఆమె భర్త…
“ఒక స్త్రీ తన భర్త కొరకు తప్ప, మరింకే చనిపోయిన వ్యక్తి కొరకు కూడా మూడు దినముల కంటే ఎక్కువ దుఃఖించరాదు. ఆమె భర్త చనిపోతే మాత్రం ఆమె నాలుగు నెలల పది దినములు దుఃఖ దినములుగా సంతాపములో గడపాలి
ఉమ్మె అతియా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు: “ఒక స్త్రీ తన భర్త కొరకు తప్ప, మరింకే చనిపోయిన వ్యక్తి కొరకు కూడా మూడు దినముల కంటే ఎక్కువ దుఃఖించరాదు. ఆమె భర్త చనిపోతే మాత్రం ఆమె నాలుగు నెలల పది దినములు దుఃఖ దినములుగా సంతాపములో గడపాలి. ఆమె (ఆ దుఃఖదినములలో) రంగులద్దిన వస్త్రాలు ధరించరాదు, ‘అస్బ్’ (అంత ఆకర్షణీయం కాని) వస్త్రాలు తప్ప. ‘కొహ్’ల్’ (కాటుక, సుర్మా లేదా అటువంటి పదార్థాలు) పూయరాదు. ఆమె రుతుస్రావానికి గురైతే దాని నుండి శుద్ధి అయిన తరువాత తప్ప సుగంధద్రవ్యాలను (అత్తరు, పెర్’ఫ్యూమ్ మొ.) తాకరాదు, అయితే (శుద్ధి అయిన తరువాత) ఆమె ‘ఖుస్త్’ లేదా ‘అజ్’ఫార్’ వంటి సుగంధ ద్రవ్యాలను పూయవచ్చును.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Português Kurdî Tiếng Việt Magyar ქართული Kiswahili සිංහල Română অসমীয়া ไทย मराठी دری አማርኛ ភាសាខ្មែរ Nederlands Македонски ગુજરાતી ਪੰਜਾਬੀ മലയാളം ಕನ್ನಡالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం, స్త్రీలు మరణించిన వ్యక్తి కోసం, అది తండ్రి అయినా, సోదరుడు అయినా, కొడుకు అయినా లేదా మరెవరైనా అయినా సుగంధ ద్రవ్యాలు, కోహ్ల్, నగలు లేదా అందమైన దుస్తులు ధరించకుండా మూడు రోజుల కంటే ఎక్కువ కాలం దుఃఖించడాన్ని నిషేధించారు, కేవలం భర్త విషయం లో తప్ప; భర్త చనిపోయినట్లయితే సంతాప కాలం నాలుగు నెలల పది రోజులు. భర్త కోసం పాటిస్తున్న దుఃఖదినముల సమయంలో ఆమె అలంకరణ కోసం రంగు వేసిన లేదా అద్దిన దుస్తులను ధరించరాదు, 'అసబ్ (మాదిరి) వస్త్రం' తప్ప, అసబ్ వస్త్రం అనేది నేయడానికి ముందు రంగు వేయబడిన యెమెన్ వస్త్రం. ఆ దుఃఖ దినముల సమయములో అలంకరణ కోసం తన కళ్ళకు కొహ్’ల్ (కాటుక, సుర్మా లేదా అటువంటి పదార్థాలు) రాసుకోకూడదు, లేదా పరిమళ ద్రవ్యాలు లేదా ఇతర సువాసనలను ఉపయోగించకూడదు, ఆమె ఋతుస్రావానికి గురైతే తన శరీరాన్ని కడుక్కున్న తరువాత (గుస్ల్ చేసిన తరువాత) తప్ప. ఋతుస్రావం నుండి పరిశుద్ధత పొందిన తరువాత ఆమె ‘ఖుస్త్’ లేదా ‘అజ్’ఫార్’ అనే ధూపపు ముక్కలను, సుగంధ ద్రవ్యంగా కాకుండా ఏదైనా అప్రియమైన వాసనను తొలగించే సాధనాలుగా ఉపయోగించవచ్చు. ‘ఖుస్త్’ లేదా ‘అజ్’ఫార్’ అనేవి ప్రసిద్ధి చెందిన సుగంధ ధూపసామాగ్రికి చెందినవి. ఆమె వాటిని ఋతుస్రావపు రక్తంతో ప్రభావితమైన యోని ప్రాంతంపై సున్నితంగా పూయవచ్చు, సుగంధ ద్రవ్యాలను పూసుకున్నట్లు కాకుండా.فوائد الحديث
“అల్ ఇహ్’దాద్” (చనిపోయిన వ్యక్తి కొరకు స్త్రీ ప్రకటించే సంతాపము, దుఃఖము) అంటే: అలంకారాలను మరియు ఆమె వివాహానికి దారి తీసే ప్రతిదాన్ని వదిలివేయడం, దూరంగా ఉంచడం. ఆమె అన్ని ఆభరణాలు, పరిమళ ద్రవ్యాలు, కోహ్ల్ మరియు అలంకార దుస్తులను నివారించాలి.
ఆమె భర్త కొరకు తప్ప ఒక స్త్రీ చనిపోయిన వారెవరికొరకైనా మూడు దినముల కంటే ఎక్కువ సంతాప దినములు (దుఃఖ దినములు) పాటించరాదు.
ఈ హదీథులో ఒక స్త్రీ కొరకు భర్త యొక్క స్థానాన్ని తెలియజేస్తున్నది – చనిపోయినది ఎవరైనా ఆమె సంతాప దినములు మూడు దినములకు మించదు (కేవలం చనిపోయిన భర్త కొరకు తప్ప).
భావోద్వేగం, మానసిక క్షోభ నుండి ఉపశమనం పొందే సాధనంగా మూడు రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం శోకదినములుగా పాటించడానికి అనుమతి ఉన్నది.
ఒక స్త్రీ తన భర్త చనిపోతే నాలుగు నెలల పది రోజులు దుఃఖం పాటించాలి, ఆమె గర్భవతి అయితే తప్ప; గర్భవతి అయి ఉన్న సందర్భంలో ఆమె దుఃఖ కాలం ప్రసవంతో ముగుస్తుంది.
అలంకరణ కోసం ఉద్దేశించబడని రంగులద్దిన సాధారణ దుస్తులను ధరించడానికి ఆమెకు అనుమతి ఉన్నది మరియు అలాంటి దుస్తులను గుర్తించడానికి ప్రమాణం, ఆ ప్రాంతము యొక్క సాధారణ ఆచార-వ్యవహారాలపై ఆధారపడి ఉంటుంది.
التصنيفات
ఇద్దత్ (గడువు)