“ముందుగా తొలి పంక్తిని భర్తీ చేయండి. తర్వాత దాని వెనక పంక్తిని భర్తీ చేయండి. ఏమైనా వెలితి ఉంటే అది వెనక…

“ముందుగా తొలి పంక్తిని భర్తీ చేయండి. తర్వాత దాని వెనక పంక్తిని భర్తీ చేయండి. ఏమైనా వెలితి ఉంటే అది వెనక పంక్తిలోనే ఉండాలి.”

అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ముందుగా తొలి పంక్తిని భర్తీ చేయండి. తర్వాత దాని వెనక పంక్తిని భర్తీ చేయండి. ఏమైనా వెలితి ఉంటే అది వెనక పంక్తిలోనే ఉండాలి.”

[ప్రామాణికమైన హదీథు] [అబూ దావూద్ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమాఅత్ తో నమాజు చేసే పురుషులను ముందుగా తొలి పంక్తిని, తర్వాత దాని వెనుక పంక్తిని, ఇదే విధంగా (మిగతా పంక్తులను) భర్తీ చేయమని ఆదేశించారు. ఒకవేళ ఏదైనా పంక్తిలో వెలితి ఉంటే, ఆ వెలితి చివరి పంక్తిలో మాత్రమే ఉండాలి.

فوائد الحديث

పంక్తులను సరిచేయు సున్నత్ పద్ధతి యొక్క వివరణ ఇవ్వబడింది.

నమాజు ఆచరించేవారు ముందు పంక్తులలో వెలితిని వదలిపెట్టరాదు, బదులుగా వెలితి చివరి పంక్తిలోనే ఉండాలి.

التصنيفات

జమాత్ తో చదివే నమాజ్ ప్రాముఖ్యత మరియు దాని ఆదేశాలు