“ఏ పదార్థమైనా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మత్తు కలిగించేట్లైతే, దానిని కొద్ది మొత్తంలో తీసుకోవడం కూడా…

“ఏ పదార్థమైనా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మత్తు కలిగించేట్లైతే, దానిని కొద్ది మొత్తంలో తీసుకోవడం కూడా నిషిద్ధం.”

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలికినారు: “ఏ పదార్థమైనా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మత్తు కలిగించేట్లైతే, దానిని కొద్ది మొత్తంలో తీసుకోవడం కూడా నిషిద్ధం.”

[ప్రామాణికమైనది]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అని వివరిస్తున్నారు: మెదడును మొద్దుబారేలా చేసి, మానసిక సామర్థ్యాలపై నియంత్రణ కోల్పోయేలా చేసే ఏదైనా పానీయం లేదా ఆహారం ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం నిషేధించబడింది, అలాగే మెదడును మొద్దుబారేలా చేయకపోయినా – అటువంటి పదార్ధాన్ని తక్కువ మొత్తంలో తీసుకోవడం కూడా నిషేద్ధమే.

فوائد الحديث

షరియా ప్రజల బుద్ధిని (మెదళ్లను) పరిరక్షిస్తుంది.

కారణాలను నిరోధించడంను షరీఅతు సరైనదిగా పరిగణిస్తుంది. అది ఆ కీచక చర్యలకు దారితీసే ప్రతి మార్గాన్నీ మూసివేయడం ద్వారానే జరుగుతుంది.

మత్తు కలిగించే పదార్థాన్ని కొద్దిగానైనా తీసుకోవడం నిషేధం, ఎందుకంటే అది మత్తుకు ఒక సాధనం కనుక.

ఒకవేళ చిన్న మొత్తములో తీసుకున్నా, లేక పెద్ద మొత్తములో తీసుకున్నా అది మత్తు కలిగించకపోతే, అపుడు దానిని తీసుకోవడం నిషేధము కాదు.

التصنيفات

నిషేధించబడిన పానీయాలు