“ఎవరైతే స్వయంగా తమకు తామే అన్యాయం చేసుకున్నారో వారి ఇళ్లలోనికి (ప్రాంతము లోనికి) ప్రవేశించకండి, మీరు ఏడుస్తూ…

“ఎవరైతే స్వయంగా తమకు తామే అన్యాయం చేసుకున్నారో వారి ఇళ్లలోనికి (ప్రాంతము లోనికి) ప్రవేశించకండి, మీరు ఏడుస్తూ ఉన్న స్థితిలో ఉంటే తప్ప

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “మేము రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ‘అల్-హిజ్ర్’ ప్రాంతాన్ని దాటినాము. దాటుతున్నపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు: “ఎవరైతే స్వయంగా తమకు తామే అన్యాయం చేసుకున్నారో వారి ఇళ్లలోనికి (ప్రాంతము లోనికి) ప్రవేశించకండి, మీరు ఏడుస్తూ ఉన్న స్థితిలో ఉంటే తప్ప. లేకపోతే వారికి చుట్టుకున్న ఆపదే మీకూ చుట్టుకొనవచ్చును.” అలా పలికి ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం త్వరత్వరగా ఆ ప్రాంతాన్ని వెనుక వదిలి సాగిపోయినారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమూద్ ప్రజల నివాసాల గుండా వెళుతున్నప్పుడు, శిక్షించబడిన మరియు తమకు తామే అన్యాయం చేసుకున్న వారి ఇళ్లలోకి ఎవరూ ప్రవేశించకూడదని ఆయన నిషేధించారు, ఏడుస్తూ మరియు వారికి పట్టిన దుస్థితిని గురించి ఆలోచిస్తూ, వారికి సంభవించిన ఆపద తనకు కూడా వస్తుందేమోనని భయపడుతూ ఉన్న స్థితిలో తప్ప. తరువాత, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన గుర్రాన్ని త్వరగా వెళ్ళమని ఆజ్ఞాపించి, ఆ ప్రాంతాన్ని వదిలి త్వరత్వరగా వెళ్ళిపోయినారు.

فوائد الحديث

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నాశనం చేసిన వారి పరిస్థితులను గురించి ప్రతి ఒక్కరూ పర్యాలోచన చేయాలి. వారు ఎటువంటి తప్పులో పడినారో, లేదా ఎటువంటి పాపములో పడినారో ఆ తప్పులు మరియు పాపపు పనులపట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే అల్లాహ్ యొక్క ఆయతులపై (సూచనలు, నిదర్శనాలు మొ.) దృష్టి పెట్టకుండా, వాటి పట్ల అవలోకన చేయకుండా నిర్లక్ష్యం వహించడం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అల్లాహ్ చేత శిక్షించబడిన వారి నివాసాలు, వారి తరువాత, ఎవరికీ ఎన్నటికీ నివాసయోగ్యం కావు. అలాగే ఆ ప్రాంతం కూడా మాతృభూమిగా చేసుకొనడానికి పనికి రాదు. ఎందుకంటే అందులో నివశించాలనుకునే వారు శాశ్వతంగా ఏడుస్తూ ఉండలేరు కనుక. మరి ఆ ప్రాంతములోనికి, ఆ నివాసాల లోనికి ఏడుస్తూ ఉన్న స్థితిలో తప్ప ప్రవేశించడం నిషేధము.

ఇమామ్ నవవి ఇలా అన్నారు: ఈ హదీథు తప్పు చేసిన వారి నివాసాలు మరియు శిక్షా స్థలాల గుండా వెళుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండమని ప్రోత్సహిస్తుంది; ఇది ‘అస్’హాబుల్ ఫీల్’ (ఏనుగు సహచరులు) మరణించిన ముహస్సిర్ లోయ గుండా త్వరత్వరగా వెళ్ళిన విధానాన్ని పోలినది. కాబట్టి, ఆ ప్రదేశాలనుండి వెలుతున్న ప్రతి ఒక్కరు అప్రమత్తంగా, భయంతో, ఏడుస్తూ, తమ విధి గురించి ఆలోచిస్తూ, అలాంటి ముగింపు నుండి రక్షించమని అల్లాహ్‌ను ఆశ్రయించాలి, వేడుకోవాలి.

ఈ నిషేధం మరియు హెచ్చరిక అల్లాహ్ యొక్క శిక్ష దిగివచ్చిన సమూద్ మరియు అటువంటి ఇతర జాతుల నివాసాలకు కూడా వర్తిస్తుంది.

ఈ హదీథు - ఈ ప్రదేశాలు మరియు ప్రాంతాలను పర్యాటకం, వినోదం మొదలైన వాటి కోసం ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది.

التصنيفات

ప్రయాణపు పద్దతులు మరియు ఆదేశాలు