إعدادات العرض
“రెల్లు చాపను రెల్లు పుల్లలతో ఒకదాని తరువాత ఒకటి కలిపి నేసినట్లుగా, “అల్-ఫితన్” (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు,…
“రెల్లు చాపను రెల్లు పుల్లలతో ఒకదాని తరువాత ఒకటి కలిపి నేసినట్లుగా, “అల్-ఫితన్” (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు, కోరికలు, సంకటములు, పరీక్షలు మొ.) మనుషుల హృదయాలకు ప్రస్తుతపరచబడతాయి
హుదైఫహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: “మేము ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్ద కూర్చుని ఉన్నాము. ఆయన ఇలా అన్నారు: మీలో ఎవరు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) (హఠాత్తుగా వచ్చిపడే) విపత్తు, ఆపద (అల్’ఫిత్నా) గురించి ప్రస్తావించడం విన్నారు? కొంతమంది “మేము విన్నాము” అన్నారు. దానికి ఆయన ఇలా అన్నారు: “బహుశా మీరు ఒక వ్యక్తికి తన కుటుంబములోని సమస్యలు, మరియు అతని పొరుగువారితో సమస్యలు గురించి అనుకుంటున్నారు, అవునా?” వారు “అవును” అన్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు: “అవి నమాజు, ఉపవాసం మరియు దానధర్మాల ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడతాయి. కానీ మీలో ఎవరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సముద్రపు అలల వలె ఎగసిపడే ‘అల్-ఫిత్నా’ గురించి ప్రస్తావించగా విన్నారు?”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “అక్కడున్న ప్రజలు మౌనంగా ఉండిపోయారు”. ఆయన ఇంకా ఇలా అన్నారు “నేను విన్నాను”. ఉమర్ రదియల్లాహు అన్హు “మీ తండ్రి నీ కొరకు త్యాగం చేయబడుగాక (మీ తండ్రి గొప్ప ధర్మపరుడు)”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “రెల్లు చాపను రెల్లు పుల్లలతో ఒకదాని తరువాత ఒకటి కలిపి నేసినట్లుగా, “అల్-ఫితన్” (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు, కోరికలు, సంకటములు, పరీక్షలు మొ.) మనుషుల హృదయాలకు ప్రస్తుతపరచబడతాయి. ఏ హృదయమైతే వాటితో నిండిపోతుందో దానిపై ఒక నల్లటి మచ్చ వేయబడుతుంది. మరియు ఏ హృదయమైతే వాటిని తిరస్కరిస్తుందో దానిపై ఒక తెల్లని మచ్చ వేయబడుతుంది; అలా హృదయాలు రెండు రకాలుగా తయారవుతాయి. ఒకటి శ్వేత వర్ణములో, దానిపై ఏది పడినా దానికి అంటకుండా జారిపోయేటంతటి అతి నున్నటి ఉపరితలం కలిగిన రాయిలాగా, ఆకాశాలూ మరియు భూమి మిగిలి ఉన్నంత కాలం ఏ ప్రలోభాలూ, ఆకర్షణలూ తాకకుండా ఉంటుంది. మరియు మరొకటి నలుపు మరియు ధూళి రంగులో బోర్లించి ఉన్న పాత్రలాగా, మంచిని గుర్తించకుండా లేదా చెడును, కీడును తిరస్కరించకుండా, తాను నింపుకున్న వాంఛలు, మోహము, కోరికలతో నిండి ఉంటుంది.” హుదైఫహ్ (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు: “మీకూ వాటికి (అల్ ఫితన్) మధ్య ఒక మూసివేసిన ద్వారం ఉంది. అది త్వరలోనే బ్రద్దలు కాబోతున్నది”. ఉమర్ రదియల్లాహు అన్హు “అది బ్రద్దలవుతుందా? నీకు తండ్రి లేకుండా పోవుగాక? ఒకవేళ అది తెరుచుకున్నా, తిరిగి అది మూసుకుపోవచ్చుకదా?” నేను ఇలా అన్నాను “లేదు అది బ్రద్దలవుతుంది”, నేను ఆయనకు వివరించాను “నిశ్చయంగా ఆ ద్వారము మనిషిని సూచిస్తుంది. అతడు చంపబడవచ్చు, లేదా చనిపోవచ్చు. ఈ హదీథులో ఎంతమాత్రమూ తప్పు అనేది లేదు. అబూ ఖాలిద్ ఇలా ఉల్లేఖించినారు నేను సా’అద్ తో ఇలా చెప్పాను “ఓ అబూ మాలిక్, “అస్వద్ ముర్బద్ద” అనే పదానికి అర్థం ఏమిటి?” దానికి అతడు “నలుపులో (కలిసిఉన్న) ఉత్తమ స్థాయి తెలుపు” అన్నాడు. నేను “మరి “అల్ కూజు ముజక్ఖియన్” అంటే అర్థం ఏమిటి?” అని ప్రశ్నించాను. దానికి అతడు: “అంటే అది బోర్లించబడి యున్న పాత్ర” అన్నాడు.
الترجمة
العربية Tiếng Việt Bahasa Indonesia Nederlands Kiswahili English অসমীয়া ગુજરાતી සිංහල Magyar ქართული Hausa Română ไทย Português मराठी ភាសាខ្មែរ دری አማርኛ বাংলা Kurdî Македонски Tagalog Українська ਪੰਜਾਬੀالشرح
విశ్వాసుల నాయకుడు (అమీరుల్ ము’మినీన్) ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) తన సభలో ఉన్నారు, మరియు ఆయనతో సహచరుల బృందం ఉంది, ఆయన వారితో ఇలా అన్నారు: “అల్ ఫితన్” ను గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రస్తావించగా మీలో ఎవరు విన్నారు?” వారిలో కొందరు “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్-ఫితన్ ను గురించి ప్రస్తావించగా మేము విన్నాము” అన్నారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితములో అతడు, తన భార్య, పిల్లల పట్ల అధిక ప్రేమ, లేక అతని పిసినారితనం, వారితో ఎక్కువ సమయం గడపడం వల్ల తాను సత్కార్యాలు చేలేక పోవడం, తన విధులను సరిగా నిర్వర్తించలేక పోవడం, వారి (భార్యా, పిల్లల) హక్కులు నెరవేర్చలేకపోవడం, వారి క్రమశిక్షణ, వారి విద్య మొదలైన విషయాలలో కొరతలు, అలాగే తన పొరుగు వారితో సమస్యలు – బహుషా వీటన్నిటినీ మీరు “అల్-ఫితన్” అనుకుంటున్నారు, అవునా?” దానికి వారు “అవును” అన్నారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు “ఇవి జవాబుదారీ తనానికి సంబంధించిన పరీక్షలు (ఫిత్నాలు), మరియు వాటిలో నమాజు, ఉపవాసం మరియు దానధర్మాలు వంటి మంచి పనుల ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడే పాపాలు ఉన్నాయి. కానీ మీలో ఎవరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సాధారణంగా ఎదురయ్యే బహిరంగ ఫిత్నాలను (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు, కోరికలు, సంకటములు, పరీక్షలు మొ.) గురించి – వాటి తీవ్రత మరియు విస్తృత వ్యాప్తి కారణంగా, అల్లకల్లోలంగా ఉన్న సముద్రపు అలల వలె ప్రజలను కదిలించే ఫిత్నాల గురించి చెప్పగా విన్నారా? ప్రజలందరూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు హుదైఫహ్ ఇబ్న్ అల్ యమాన్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అన్నారు: “నేను విన్నాను”. అది విని ఉమర్ రదియల్లాహు అన్హు సంతోషంగా ఇలా అన్నారు: “నీలాంటి వాడిని పుట్టించినందుకు అల్లాహ్ మీ తండ్రికి ప్రతిఫలం ప్రసాదించుగాక. చెప్పు”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: 'ఒక సిరి చాప యొక్క పుల్లలు, ముద్రలు దానిపై నిద్రిస్తున్న వ్యక్తి వీపుకు, ప్రక్కలకు అంటుకున్నట్లుగా, ఫిత్నాలు (పరీక్షలు) మానవ హృదయానికి మరియు దాని ప్రక్కలకు అంటుకుంటాయి. పరీక్షల తీవ్రత హృదయాన్ని ప్రభావితం చేస్తుంది మరియు ఈ పరీక్షలు ఒకదాని తర్వాత ఒకటి పునరావృతమవుతాయి. ఈ ఫిత్నాలు ప్రవేశించే ఏ హృదయమైనా వాటిని ఆలింగనం చేసుకుని, ఒక పానీయం శరీరం లోనికి ప్రవేశించిన తరువాత ఎలాగైతే శరీరమంతా దాని ప్రభావం వ్యాపిస్తుందో అలా, ఈ ఫిత్నాలు తనలో వ్యాపించడానికి అనుమతిస్తుంది. అటువంటి హృదయం పై ఒక నల్లని మచ్చ వేయబడుతుంది. మరియు ఏ హృదయమైతే వాటిలో (ఫిత్నాలలో) పడకుండా ఫిత్నాలను తిరస్కరిస్తుందో, ఒక తెల్లని మచ్చ దానిపై వేయబడుతుంది. అలా హృదయాలు రెండు రకాలుగా తయారవుతాయి. తెల్లని హృదయం - ఇది విశ్వాసం (ఈమాన్) పట్ల దృఢమైన నిబద్ధత కలిగి ఉంటుంది, లోపాల నుండి విముక్తమై ఉంటుంది, అది అల్లాహ్’ను కలుసుకునేంత వరకు దానికి ఏ ఫిత్నాలు (పరీక్షలు, వ్యామోహాలు మొ.) అతుక్కోవు, లేదా దానిని ప్రభావితం చేయవు – ఎలాగైతే ఒక అత్యంత మృదువైన, స్వచ్ఛమైన రాయిపై ఏదైనా పడినా దానికి అతుక్కోకుండా జారిపోతుందో ఆ విధంగా. మరొక హృదయం – ఫిత్నాల కాతణంగా (వ్యామోహాలు, వాంఛలు, పరీక్షల కారణంగా) నల్లగా మారిన హృదయం, ఇది తలక్రిందులుగా బోర్లించబడిన కూజా లాంటిది, ఇందులో నీరు నిలిచి ఉండలేదు. అదేవిధంగా, ఈ హృదయం మంచితనం లేదా జ్ఞానం ద్వారా ప్రభావితం కాదు. అది మంచిని గుర్తించదు, చెడును ఖండించదు, అది ఇష్టపడే, ప్రేమించే మరియు కోరుకునే వాటిని తప్ప. హుదైఫా రదియల్లాహు అన్హు ఉమర్ రదియల్లాహు అన్హుతో ఇలా అన్నారు: "మీ జీవితకాలంలో ఈ పరీక్షలేవీ (ఈ ఫిత్నాలు ఏవీ) జరగవు; మీకు మరియు వాటికి మధ్య ఒక మూసిన ద్వారం ఉంది; అయితే అది త్వరలోనే విరిగిపోతుంది.” ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “అది విరిగి పోతుందా? ఒకవేళ అది తెరుచుకున్నా, బహుషా అది తిరిగి మూసుకు పోవచ్చును కూడా”. దానికి హుదైఫహ్ రదియల్లాహు అన్హు “లేదు, అది విరిగిపోతుంది. ఆ ద్వారం ఒక మనిషి, అతడు చంపివేయ బడతాడు, లేక చనిపోతాడు.” నేను ప్రస్తావించినది నిజమైన మరియు ధృవీకరించబడిన ఉల్లేఖన. ఇది గ్రంథ ప్రజల రచనల నుండి కాదు, లేదా ఒక వ్యక్తి యొక్క ఇజ్తిహాద్ అభిప్రాయం నుండి కాదు, కానీ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసు నుండి.فوائد الحديث
సాధారణంగా ఎదురయ్యే బహిరంగ ఫిత్నాల ప్రమాదం రక్తపాతములోనూ, సంపద నష్టములోనూ మరియు సాధారణ భద్రత కూడా లేకపోవడం, మృగ్యమై పోవడం మొదలైనవాటిలో ఉంది.
ఒకవేళ ఫిత్నాలు (పరీక్షలు) ధర్మానికి సంబంధించినవి అయితే, వాటిలో పాల్గొనేవారు నిందార్హులు, ఎందుకంటే అవి (ఆ ఫిత్నాలు) నూతన ఆవిష్కరణలు (బిద్’అత్ లు) లేదా పాపాలు (సయ్యిఆత్ లు) అయి ఉంటాయి. అవి (ఫిత్నాలు) ప్రాపంచిక విషయాలకు సంబంధించినవి అయితే, వాటిలో పాల్గొనేవారికి అవి ఒక పరీక్ష మరియు సంకటము వంటివి, అటువంటి సమయములో వారు వాటిలో పడకుండా ఓరిమి వహించాలి.
హృదయం దానికి ఎదురయ్యే ఫిత్నాల వల్ల (పరీక్షల వల్ల) ప్రభావితమవుతుంది; అయితే వాటిలో ఏదైతే అల్లాహ్ మార్గదర్శకం పై స్థిరంగా ఉంటుందో అదే విజయం సాధించినది అవుతుంది.
ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: అల్-తహ్రీర్ రచయిత ఇలా అన్నారు: హదీసు యొక్క అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి తన కోరికలను అనుసరించి పాపాలు చేస్తే, అతను చేసే ప్రతి పాపంతో అతని హృదయంలో చీకటి ప్రవేశిస్తుంది. ఇదే జరిగితే, అతను ప్రలోభాలకు లోనవుతాడు మరియు ఇస్లాం వెలుగు అతని నుండి తొలగించబడుతుంది. హృదయం ఒక పాత్ర లాంటిది; దానిని తలక్రిందులు చేసినట్లైతే, దానిలో ఉన్నది బయటకు చిమ్ముతుంది మరియు మరేదీ దానిలోకి ప్రవేశించదు.
‘ఉమర్ (రదియల్లాహు అన్హు) హుదైఫా (రదియల్లాహు అన్హు) తో చెప్పిన మాటలు: (లా అబా లక్ – నీకు తండ్రి లేకుండా పోవుగాక) దీని అర్థం: ఈ విషయంలో శ్రద్ధగా కృషి చేయు, నడుము బిగించు, ఏ సహాయకుడూ లేని వానిలా నిన్ను నీవు సిధ్ధం చేసుకో” అని.
ఈ హదీథులో ఉమర్ (రదియల్లాహు అన్హు) యొక్క సద్గుణం, ఘనత తెలుస్తున్నాయి; ఆయన ప్రజలకు మరియు ఫిత్నాలకు (పరీక్షకు) మధ్య ఒక మూసిన ద్వారం వంటివారు.
التصنيفات
మనోవాంఛ మరియు కోరికల ఖండన