“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసినా, లేక ‘గుస్ల్’ చేసినా ఒక ‘సా’ నుండి ఐదు ‘ముద్’ ల నీళ్ళతో చేసేవారు.…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసినా, లేక ‘గుస్ల్’ చేసినా ఒక ‘సా’ నుండి ఐదు ‘ముద్’ ల నీళ్ళతో చేసేవారు. ఉదూ కేవలం ఒక ‘ముద్’ నీళ్ళతో చేసేవారు

అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసినా, లేక ‘గుస్ల్’ చేసినా ఒక ‘సా’ నుండి ఐదు ‘ముద్’ ల నీళ్ళతో చేసేవారు. ఉదూ కేవలం ఒక ‘ముద్’ నీళ్ళతో చేసేవారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథు ద్వారా మనకు తెలుస్తున్న విషయం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘జనాబత్ గుస్ల్ స్నానము’ ఒక ‘సా’ నుండి ఐదు ‘ముద్’ ల నీళ్ళతో పూర్తి చేసేవారు, అలాగే ఉదూను కేవలం ఒక ‘ముద్’ నీళ్ళతో పూర్తి చేసేవారు. ఒక ‘సా’ నాలుగు ‘ముద్’ లకు సమానం. ఒక ‘ముద్’ అంటే ఓ మోస్తరు ఎదిగిన వ్యక్తి యొక్క ఒక దోసిలి నిండా పట్టేటంత పరిమాణానికి సమానము.

فوائد الحديث

గుస్ల్ మరియు ఉదూలకు నీటిని పొదుపుగా వాడుట మరియు నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ దుబారా చేయకుండా జాగ్రత్తపడుట ఇవి షరియత్ బోధనలు.

గుస్ల్ చేయుటకు మరియు ఉదూ చేయుటకు అవసరమైనంత వరకే (వీలైనంత తక్కువ) నీటిని ఉపయోగించాలి – ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం.

ఇందులో అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే గుస్ల్ గానీ లేక ఉదూ గానీ పరిపూర్ణంగా ఆచరించుట, అయితే ఈ లక్ష్యాన్ని సాధించుటలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్’ను, ఆ ఆచరణకు సంబంధించిన విధివిధానాలను, దుబారాకు పోకుండా అలా అని మరీ పిసినారితనానికి పాల్బడకుండా, సమయాన్నీ, సందర్భాన్నీ, నీటి యొక్క పరిమాణాన్ని, అందుబాటులో ఉన్న నీటియొక్క మొత్తాన్ని, ఇంకా ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

'జనాబహ్' అనే పదం వీర్య స్ఖలనం చేసి ఉన్న; లేదా లైంగిక సంభోగములో పాల్గొని ఉన్న వారి స్థితిని సూచిస్తుంది. ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారు ఆ స్థితి నుండి తమను తాము పరిశుద్ధ పరుచుకోనంత వరకు సలాహ్ (నమాజు) మరియు ఇతర ఆరాధనల నుండి దూరంగా ఉంటారు (ఇజ్’తినాబ్) కాబట్టి ఆ స్థితికి ‘జనాబహ్’ అని, ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి ‘జునుబి’ అని పేరు ఇవ్వడం జరిగింది.

‘సా’: అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో బరువును, ద్రవాలను కొలవడానికి ఉపయోగించే ప్రసిద్ధ కొలమానము. ఒక ‘సా’ 480 మిథ్’ఖాల్’ల మంచి గోధుమలకు, మరియు లీటర్లలో చూసినట్లైతే 3 లీటర్లకు సమానం.

‘ముద్’: ఇది ఒక అధికారిక కొలమానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో ఉపయేగించబడేది. ఒక ‘ముద్’ అంటే ఓ మోస్తరుగా ఎదిన వ్యక్తి యొక్క దోసిట నిండుగా పట్టేటంత మొత్తము. ఇది ఒక ‘సా’ యొక్క నాలుగవ భాగము. ఈ నాటి కొలమానములో చూసినట్లైతే, ధర్మ పండితుల ఏకాభిప్రాయము ప్రకారము, 750 మీ.లీ.

التصنيفات

వజూ యొక్క సున్నత్ లు మరియు పద్దతులు.