వజూ యొక్క సున్నత్ లు మరియు పద్దతులు.

వజూ యొక్క సున్నత్ లు మరియు పద్దతులు.

2- “ఒక ముస్లిం మంచిగా ఉదూ చేసుకుని, ఆ తరువాత నిలబడి రెండు రకాతుల నమాజును తన హృదయమును మరియు ముఖమును రెండింటినీ ‘ఖిబ్లహ్’ వైపునకు త్రిప్పుకుని ఆచరిస్తే, అతని కొరకు స్వర్గము ‘వాజిబ్’ చేయబడుతుంది (అతని కొరకు స్వర్గము తప్పనిసరి చేయబడుతుంది)*.” అది విని నేను “ఆహా! ఎంత చక్కని విషయం ఇది” అన్నాను. నా ముందు వరుసలో కూర్చొన్న వ్యక్తి “ఇంతకంటే ముందు చెప్పింది దీని కన్నా మంచిది” అన్నాడు. నేను ఎవరా అని చూస్తే ఆయన ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు). ఆయన “నువ్వు ఇప్పుడే వచ్చినట్లున్నావు. (ఇంతకు ముందు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘మీలో ఎవరైనా ఉదూ ఆచరిస్తే, పరిపూర్ణంగా ఉదు పూర్తి చేసి, “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు” అని పలుకుతాడో, అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరవ బడతాయి, వాటిలో అతను కోరుకున్న దాని ద్వారా స్వర్గములోనికి ప్రవేశించవచ్చు’ అన్నారు.