దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్దాలు మరియు ఆయన సైన్యాలు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్దాలు మరియు ఆయన సైన్యాలు

1- “నేను రేపు ఈ జెండాను, ఎవరి చేతుల మీదుగా అల్లాహ్ విజయాన్ని ప్రసాదిస్తాడో, అతనికి ఇస్తాను. అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతడిని ప్రేమిస్తారు.” ఆయన (సహ్ల్ బిన్ సఅద్) ఇంకా ఇలా అన్నారు: “తమలో ఎవరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జెండాను ఇవ్వబోతున్నారో” అని ప్రజలందరూ ఆ రాత్రంతా ఉత్సుకతతో అలాగే గడిపారు. ఉదయం అవుతూనే ప్రజలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు, ప్రతి ఒక్కరూ ఆ జెండాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతికే ఇస్తారు అనే ఆశతో. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఎక్కడ?” అని అడిగారు. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ! ఆయన కంటిలో ఏదో సమస్యతో బాధపడుతున్నాడు” అన్నారు. దానికి ఆయన “అయితే అతడిని తీసుకుని రావడానికి ఎవరినైనా పంపండి” అన్నారు. అప్పుడు ఆయనను తీసుకువచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కళ్ళలో ఉమ్మివేసి ఆయన కోసం ప్రార్థించారు. దానితో ఆయన అంతకు ముందు అసలు ఎప్పుడూ నొప్పి లేదు అన్నట్లుగా కోలుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు. అలీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలల్లాహ్! వారు మనలాగా (విశ్వాసులుగా) మారేంతవరకు పోరాడాలా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరు వారి ప్రాంగణానికి చేరుకునే వరకు స్థిరంగా వెళ్ళండి, ఆపై వారిని ఇస్లాంలోకి ఆహ్వానించండి మరియు అల్లాహ్ యొక్క హక్కులకు సంబంధించి వారిపై ఏ ఏ విషయాలు విధి చేయబడినాయో వారికి తెలియజేయండి@. ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా, మీ ద్వారా ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సన్మార్గానికి (ఇస్లాం వైపునకు) నడిపిస్తే, అది మీ కొరకు ఎర్రని ఒంటెల కన్నా మేలు” అన్నారు.”