ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా, మీ ద్వారా ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సన్మార్గానికి (ఇస్లాం వైపునకు) నడిపిస్తే, అది మీ…

ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా, మీ ద్వారా ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సన్మార్గానికి (ఇస్లాం వైపునకు) నడిపిస్తే, అది మీ కొరకు ఎర్రని ఒంటెల కన్నా మేలు” అన్నారు.”

సహ్ల్ బిన్ స’అద్ అస్సఅదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఖైబర్ దినమున రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నేను రేపు ఈ జెండాను, ఎవరి చేతుల మీదుగా అల్లాహ్ విజయాన్ని ప్రసాదిస్తాడో, అతనికి ఇస్తాను. అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతడిని ప్రేమిస్తారు.” ఆయన (సహ్ల్ బిన్ సఅద్) ఇంకా ఇలా అన్నారు: “తమలో ఎవరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జెండాను ఇవ్వబోతున్నారో” అని ప్రజలందరూ ఆ రాత్రంతా ఉత్సుకతతో అలాగే గడిపారు. ఉదయం అవుతూనే ప్రజలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు, ప్రతి ఒక్కరూ ఆ జెండాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతికే ఇస్తారు అనే ఆశతో. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఎక్కడ?” అని అడిగారు. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ! ఆయన కంటిలో ఏదో సమస్యతో బాధపడుతున్నాడు” అన్నారు. దానికి ఆయన “అయితే అతడిని తీసుకుని రావడానికి ఎవరినైనా పంపండి” అన్నారు. అప్పుడు ఆయనను తీసుకువచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కళ్ళలో ఉమ్మివేసి ఆయన కోసం ప్రార్థించారు. దానితో ఆయన అంతకు ముందు అసలు ఎప్పుడూ నొప్పి లేదు అన్నట్లుగా కోలుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు. అలీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలల్లాహ్! వారు మనలాగా (విశ్వాసులుగా) మారేంతవరకు పోరాడాలా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరు వారి ప్రాంగణానికి చేరుకునే వరకు స్థిరంగా వెళ్ళండి, ఆపై వారిని ఇస్లాంలోకి ఆహ్వానించండి మరియు అల్లాహ్ యొక్క హక్కులకు సంబంధించి వారిపై ఏ ఏ విషయాలు విధి చేయబడినాయో వారికి తెలియజేయండి. ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా, మీ ద్వారా ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సన్మార్గానికి (ఇస్లాం వైపునకు) నడిపిస్తే, అది మీ కొరకు ఎర్రని ఒంటెల కన్నా మేలు” అన్నారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు (భవిష్యవాణిగా ముందుగానే) తెలియజేసినారు – మరునాటి ఉదయం తాను ఏ వ్యక్తి చేతికైతే, సైన్యము తన చిహ్నంగా చేసుకునే జెండాను ఇవ్వబోతున్నాడో, అతని చేతిపై ముస్లిములు ఖైబర్ యూదులపై విజయాన్ని పొందబోతున్నారు అని. ఆ వ్యక్తి యొక్క లక్షణాలలో ఉన్న విషయం ఏమిటంటే - అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అలాగే అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతన్ని ప్రేమిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు విని సహాబాలు – ఎవరి చేతికి ఆ జెండా ఇవ్వబడుతుంది అనే విషయం పై మాట్లాడుకుంటూ, వాదులాడుకుంటూ – ఆ గొప్ప గౌరవం తమకే దక్కాలని కోరుకుంటూ – ఆ రాత్రి గడిపారు. ఉదయం అవుతూనే వారందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు, (ప్రతి ఒక్కరూ) ఆ గొప్ప గౌరవం తనకే దక్కాలని కోరుకుంటూ. వారిని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ను గురించి అడిగారు. వారు: “ఆయన అనారోగ్యంగా ఉన్నారు, కంటి సమస్యతో బాధపడుతున్నారు” అని చెప్పారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజియల్లాహు అన్హు కోసం కొందరిని పంపారు; వారు ఆయనను తీసుకువచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పవిత్ర లాలాజలాన్ని అలీ కళ్ళలో వేసి, ఆయన కోసం దుఆ చేసినారు. దానితో అలీ రజియల్లాహు అన్హు కు అసలేమీ నొప్పి లేనట్లుగా అయి, ఆ అనారోగ్యం నయమైంది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు; శత్రువుల కోటను చేరుకునే వరకు స్థిరంగా కొనసాగమని ఆదేశించారు, అలాగే ఇస్లాంలోకి ప్రవేశించే అవకాశాన్ని వారికి ఇవ్వమని ఆదేశించారు. ఒకవేళ వారు ఆయనకు సానుకూలంగా సమాధానం ఇస్తే, ఇస్లాంలో వారు ఏ ఏ విధులు నిర్వర్తించాలో చెప్పమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు సూచించారు. అప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ వైపునకు ఆహ్వానించడం యొక్క ఘనతను, గొప్పతనాన్ని అలీ రజియల్లాహు అన్హు కు వివరించారు. ఒక వ్యక్తిని ఇస్లాం వైపునకు మార్గదర్శకం చేయడానికి, మరియు అతడు ఇస్లాం స్వీకరించేందుకు, ఆ ఆహ్వానించిన వ్యక్తి కారణమైతే, అది అరబ్బుల యొక్క అత్యంత విలువైన సంపద అయిన ఎర్ర ఒంటెలను కలిగి ఉండటం మరియు వాటిని స్వంతం చేసుకోవడం లేదా దానం చేయడం కంటే కూడా అతనికి మంచిది.

فوائد الحديث

ఈ హదీసులో అలీ రజియల్లాహు అన్హు యొక్క ఘనత, మరియు ఆయనను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఆయనను అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు ప్రేమిస్తున్నారని, మరియు ఆయన అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడని – చేసిన ప్రకటన, అలీ రజియల్లాహు అన్హు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియ జేస్తున్నాయి

ఇందులో సత్కార్యాల పట్ల సహాబాల ఆసక్తి, మరియు దాని కోసం వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీని చూడవచ్చు.

అలాగే ఇందులో యుద్ధభూమికి సంబంధించి ప్రవర్తనా నియమాలు, అనవసరంగా ఉద్వేగానికి లోను కాకుండా ఉండడం, మరియు అనవసరమైన శబ్దాలు చేయుట నుండి దూరంగా ఉండడం మొదలైనవి షరియత్’లోని విషయాలే.

యూదులపై విజయం సాధించబోతున్నామని ముందుగానే భవిష్యవాణి చేయడం, అల్లాహ్ అనుజ్ఞతో అలీ రజియల్లాహు అన్హు కంటి బాధను ఆయన చేతుల మీదుగా పోయేలా చేయడం – ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవక్తత్వానికి నిదర్శనాలు.

జిహాద్ యొక్క గొప్ప ఉద్దేశ్యము ప్రజలను ఇస్లాం లోనికి తీసుకు రావడమే.

ఇస్లాం వైపునకు ఆహ్వానించడం అనేది క్రమానుగతంగా జరుగుతుంది. మొదట అవిశ్వాసిని “షహాదతైన్” (రెండు సాక్ష్యపు వాక్యాలు) పఠించి ఇస్లాం లోనికి ప్రవేశించమని కోరడం జరుగుతుంది, ఆ తరువాత అతడు ఇస్లాం యొక్క విధులు నిర్వహించాలని ఆదేశించడం జరుగుతుంది.

ఇస్లాం వైపునకు ఆహ్వానించడం యొక్క ఘనత, మరియు అది ఆహ్వానించేవానికి, ఆహ్వానించబడిన వానికి తీసుకుని వచ్చే మంచి ఏమిటంటే – ఆహ్వానించబడినవాడు సత్యధర్మం వైపునకు మార్గదర్శనం పొందుతాడు, మరియు ఆహ్వానించువాడు అందుకుగానూ అతి గొప్ప బహుమానం (స్వర్గం) ప్రసాదించబడతాడు.

التصنيفات

వైద్యము,ఔషధం మరియు ధర్మపరమైన మంత్రించటం, ప్రవక్త అనుచరుల రజిఅల్లాహు అన్హుమ్ ప్రాముఖ్యతలు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్దాలు మరియు ఆయన సైన్యాలు