إعدادات العرض
“మూడు సమయాలలో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్ములను నమాజు ఆచరించడం నుండి, మరియు మాలో చనిపోయిన వారిని…
“మూడు సమయాలలో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్ములను నమాజు ఆచరించడం నుండి, మరియు మాలో చనిపోయిన వారిని ఖననం చేయడం నుండి నిషేధించేవారు.* వాటిలో (ఒకటి) సూర్యుడు ఉదయించడం మొదలైనప్పటి నుండి పూర్తిగా ఉదయించేంత వరకు, (రెండు) (మిట్టమధ్యాహ్నం) సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు, నడినెత్తి నుంచి కొద్దిగా వాలనంత వరకు; మరియు (మూడు) సూర్యుడు అస్తమించడం ప్రారంభమైనప్పటి నుండి అస్తమించడం పూర్తికానంతవరకు – (ఈ మూడు) సమయాలు ఉన్నాయి.”
ఊఖ్బహ్ బిన్ ఆమిర్ అల్ జుహనీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “మూడు సమయాలలో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్ములను నమాజు ఆచరించడం నుండి, మరియు మాలో చనిపోయిన వారిని ఖననం చేయడం నుండి నిషేధించేవారు. వాటిలో (ఒకటి) సూర్యుడు ఉదయించడం మొదలైనప్పటి నుండి పూర్తిగా ఉదయించేంత వరకు, (రెండు) (మిట్టమధ్యాహ్నం) సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు, నడినెత్తి నుంచి కొద్దిగా వాలనంత వరకు; మరియు (మూడు) సూర్యుడు అస్తమించడం ప్రారంభమైనప్పటి నుండి అస్తమించడం పూర్తికానంతవరకు – (ఈ మూడు) సమయాలు ఉన్నాయి.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Português Tiếng Việt Kiswahili Nederlands অসমীয়া ગુજરાતી සිංහල Magyar ქართული Română ไทยالشرح
దినములో మూడు సమయాలలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ఆచరించడాన్ని, చనిపోయిన వారిని ఖననం చేయడాన్ని నిషేధించినారు. మొదటి సమయం: సూర్యుడు ఉదయిస్తూ ఉన్నపుడు, అంటే సూర్యుడు పూర్తిగా ఒక బల్లెం అంత ఎత్తుకు ఉదయించనంత వరకు (నమాజు ఆచరించరాదు). ఒక బల్లెం అంత ఎత్తుకు ఉదయించడానికి దాదాపు పావు గంట సమయం పడుతుంది. రెండవది: మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీద ఉన్నపుడు. అపుడు ఒక వస్తువు యొక్క నీడ తూర్పు వైపునకు గానీ లేక పడమర వైపునకు గానీ ఉన్నట్లుగా కనిపించదు, సూర్యుడు నడినెత్తి మీద నుంచి కొద్దిగా వాలనంత వరకు. సూర్యుడు నడినెత్తి మీదనుండి వాలితే అపుడు నీడ పడమర వైపు నుండి కనబడుతుంది. అపుడు జుహ్ర్ నమాజు సమయం మొదలవుతుంది. సూర్యుడు నడి నెత్తి మీద నుండి వాలడాని కొద్ది సమయమే పడుతుంది, దాదాపు ఐదు నిమిశాలు. మూడవది: సూర్యుడు అస్తమించడం ప్రారంభమైనప్పటి నుండి అస్తమించడం పూర్తి కానంత వరకు.فوائد الحديث
ఈ హదీథులోనూ మరియు ఇతర హదీథులలోనూ సూచించబడిన విధంగా నమాజు ఆచరించుట నిషేధించబడిన సమయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: మొదటిది: ఫజ్ర్ నమాజు తరువాత సూర్యోదయం వరకు; రెండవది: సూర్యుడు ఉదయించడం మొదలైన్నటి నుండి, కంటికి కనిపించేలా కనీసం ఒక బల్లెం అంత ఎత్తుకు ఉదయించనంత వరకు, అంటే సూర్యుడు ఉదయించడం మొదలైనప్పటి నుండి కనీసం 15 నిమిశాల వరకు అన్నమాట. మూడవది: మిట్టమధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిమీద ఉన్నప్పుడు; అపుడు నిలబడి ఉన్న వ్యక్తి యొక్క నీడ తూర్పు వైపు నుంచి గానీ లేక పడమరవైపు నుంచి గానీ అసలు కనిపించదు. సూర్యుడు నడినెత్తి మీద నుండి కొద్దిగా వాలితే అపుడు కనిపిస్తుంది. కొద్ది మంది దీనికి ఐదు నిమిశాల సమయం పడుతుంది అని ఉజ్జాయింపుగా అంచనా వేసారు. నాలుగవది: అస్ర్ నమాజు తరువాత సూర్యాస్తమయం వరకు. ఐదవది: సూర్యుడు పసుపు రంగుకు మారినప్పటి నుండి సూర్యుడు పూర్తిగా అస్తమించనంత వరకు.
‘ఫర్జ్ నమాజులు’ (అంటే విధిగా ఆచరించవలసిన నమాజులు), మరియు ఏదైనా నిర్దిష్ట కారణం లేక ప్రయోజనం కోసం ఆచరించబడే నమాజులు – ఈ ఐదు నిషేధిత సమయాలనుండి మినహాయించ బడినాయి.
ఖననం చేయడానికి సంబంధించి – ఈ మూడు నిషేధిత సమయాలవరకు ఉద్దేశ్యపూర్వకంగా ఖననం చేయకుండా ఆలస్యం చేయడం నిషేధం; అదే సమయంలో పగలు లేదా రాత్రి మరే ఇతర సమయంలోనైనా ఖననం చేయడానికి అనుమతి ఉంది.
ఈ సమయాల్లో నమాజు నిషేధం వెనుక ఉన్న వివేకం మరియు హేతువు: ప్రధాన సూత్రం ఏమిటంటే - ముస్లిం వ్యక్తి అల్లాహ్’ను ఆరాధించే భావంతో ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా అనుసరిస్తాడు, నిషిద్ధ విషయాలనుంచి దూరంగా ఉంటాడు. ఏదైనా ఆదేశం వెనుక ఉన్న ఙ్ఞానము లేక వివేకము ఏమిటో తెలుసుకునే వరకు అతడు ఆ ఆదేశపాలన చేయడాన్ని (అల్లాహ్’ను ఆరాధించడాన్ని) ఆపడు. నిజానికి అతడు ఆదేశపాలన చేయవలసినదే. ఈ విషయంపై హదీథ్‌లలోని వివరణల ప్రకారం: మొదటిది: మిట్టమధ్యాహ్నం: సరిగ్గా మిట్టమధ్యాహ్నానికి ముందు నరకం శక్తివంతమైన జ్వాలతో వెలిగించబడుతుంది రెండవది: సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో నమాజు నిషేధం వెనుక ఉన్న జ్ఞానం విషయానికొస్తే, ఇది బహుదైవారాధకుల ఆరాధనను పోలి ఉంటుంది, ఎందుకంటే వారు సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో సూర్యుడికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.
మూడవది: ‘ఫజ్ర్’ నమాజు తర్వాత సూర్యుడు పూర్తిగా ఉదయించనంత వరకు మరియు ‘జుహ్ర్’ నమాజు తర్వాత సూర్యాస్తమయం వరకు నమాజు నిషేధం విషయానికొస్తే, ఇది బహుదైవారాధకుల ఆరాధనా విధానాలను, మార్గాలను అనుకరించకుండా అడ్డుకోవడం; తద్వారా ముస్లిం ఆరాధనలో అవిశ్వాసులను అనుకరించడు మరియు వారి బహుదైవారాధనలో వారిని అనుకరించడు, వారు సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో సూర్యుడికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.
التصنيفات
నమాజు నిషిద్ధ వేళలు